జ్ఞాన దీపము …. మహనీయులు – 2020… అక్టోబరు 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు, అట్లాగే విశ్రమించటానికి చోటు ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు” అన్నాడు సాయి.

శ్రీహరి సంతుష్టుడు మాత్రమే అవుతాడా?

ఈ విషయం ముదాలాళ్వార్ల  జీవితంలో తెలుస్తుంది. తోలి ముగ్గురు ఆళ్వార్లను ముదాలాళ్వార్లని అంటారు.

వీరు ముగ్గరు వరుస దినములలో ఒకే నెలలో జన్మించారు.

పోయింగై(కై) ఆళ్వార్లు సిద్దార్ది నామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు, పూదత్తాళ్వార్లు నవమినాడు, పేయాళ్వార్లు దశమి నాడు జన్మించారు (ఆశ్వయుజ మాసం సామాన్యంగా అక్టోబరులో వస్తుంది).

వీరు విడి విడిగా హరి లీలను గానం చేస్తూ, దేశ సంచారం చేస్తున్నారు. ఒకరిని ఇంకొకరు ఎరుగరు.

వీరు మువ్వురూ యాదృచ్చికంగా ఒకనాటి రాత్రి తిరుక్కోవలూరు చేరారు. ఆ రాత్రి హోరున వాన కురుస్తున్నది.

కటిక చీకటి. పొయిగై ఆళ్వారు ఒక భగవతోత్తముని అరుగు మీద శయనించాడు, విష్ణువును స్మరిస్తూ.

కొంతసేపటికి పూదత్తాళ్వారు అక్కడికి వచ్చి తలదాచుకునేందుకు స్థలమడిగారు. “ఈ స్థలంలో ఒకరు పడుకోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు, రండి. ఇద్దరమూ కూర్చుందాము” అన్నాడు పొయిగై ఆళ్వారు. ఇరువురు కూర్చున్నారు.

మరికొంత సేపటికి పేయాళ్వారు అక్కడకి వచ్చి ఉండటానికి కొంత చోటు కావాలని అడిగాడు వారిని.

“ఒకడు పడుకోవచ్చు, ఇద్దరూ కూర్చోవచ్చు, ముగ్గరు నిలబడవచ్చు రండి” అని మొదటి ఇద్దరూ ఆహ్వానించారు పేయాళ్వారుని.

ఈ ముగ్గరు విష్ణు లీలలను  కొనియాడుతూ నిలబడ్డారు. వీరిని అనుగ్రహించే ఉద్దేశ్యంతో విష్ణువు వారి మధ్య కొచ్చాడు.

వాళ్ల మధ్య నిలబడి ఒత్తిడి కలిగించాడు. ఎవరో నాల్గవ వ్యక్తి వారి మధ్య ఉన్నాడని జ్ఞాన దృష్టితో పరిశీలించారు.

ఆ దేవదేవుడు తన దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింప చేశాడు. ఆశువుగా ఒకరి తరువాత మరొకరు పాశురాలు వందేసి చొప్పున చేప్పారు.

రమా రమణుని గుణగాన కీర్తనలతో తెల్లవారింది. రాత్రి తుఫాను జాడయే లేదు!

వారు వెలిగించిన జ్ఞాన దీపపు వెలుగులో మనకు కూడా శ్రీహరి దర్శనమగును గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles