Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక సంఘటన జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు. అందుకు తులసీదాసు, వాల్మీకి, భర్తృహారి మొదలైన వారి నెందరినో ఉదాహరణలుగా పేర్కొంటారు. వారందరు ఇప్పటి వారు కారు.
ఇప్పటి వారిలో నిన్న, మొన్నటి దాకా ఉన్న బీ.వి. నరసింహస్వామి గారిని తీసుకోవచ్చు. శ్రీ నరసింహస్వామి అక్టోబరు 19, 1956లో సాయిలో ఐక్యమయ్యారు.
శ్రీ బీ.వి. నరసింహస్వామి గారిని సాయి వ్యాసుడంటారు. జ్ఞానేశ్వరుడు సంస్కృతంలోనే లభ్యమయ్యే భగవద్గీతను మరాఠీ వారికి ఇచ్చాడు.
నరసింహస్వామి గారు మహరాష్ట్రులకు తప్ప తెలియని సాయిబాబాను దక్షిణాది రాష్టాలకే కాదు, యావత్ భారత దేశానికి, అంతర్జాతీయంగా కూడా ఇంటి ఇలవేల్పు చేశాడు.
నరసింహస్వామి గారిది సాయి భక్త ప్రచారం మాత్రమే కాదు. తాను అనుభవించి, సాయి భక్తిని ఇతరులతో ప్రవేశపెట్టిన ఆధ్యాత్మిక వేత్త.
నరసింహస్వామి గారి సాహిత్యంలో తనదంటూ, అంటే బీ.వి. స్వామిగారిదంటూ ఏమీ లేదు. సాయి చూపినవి, సాయి తెలిపినవి, సాయి అనుభవములోనికి తెచ్చినవి మాత్రమే నరసింహస్వామి సాహిత్యంలో కానవస్తాయి.
అందులకు ఒక ఉదాహరణ. సాయిబాబాపై ఉన్న గాఢమైన భక్తితో, అపారమైన ప్రేమతో నరసింహస్వామి గారు ఎందరెందరినో కలిసి, వారికి సాయికి ఉన్న బంధాన్ని తెలుపుటకు ప్రయత్నించారు.
సాయి ఒకసారి ఇక చాలు అన్నారు. ఆ రచనా సామాగ్రి సేకరణను అంతటితో ఆపమన్నారు సాయి. నరసింహస్వామి మితిమీరిన ప్రేమతో ఆగిపోలేదు. సాయికి ఏమి చేయాలో తెలుసు.
ఇక అయన (నరసింహస్వామిగారి) ఆరోగ్యం చెడింది. స్పర్శ జ్ఞానం నశించింది. మాట్లాడలేని స్థితి వచ్చింది. ఈ విపరీత పరిస్థితి వెనుకనున్న సాయి బోధను – లేదా అంతరార్దాన్ని నరసింహస్వామి గారు గ్రహించారు.
ఇక ఆరోగ్యం బాగుపడింది. అనుభవాల సేకరణ మానినారు నరసింహస్వామి గారు.
ఒకసారి ఉపాసనీ మహారాజ్ సాకోరీలో సంతర్పణ చేస్తుంటే, ఒక కుష్టు రోగి వచ్చాడు భోజనానికి.
అప్పుడు అక్కడ ఉన్న రాం బాబాను ఆ రోగికి భోజనం తినిపించమన్నాడు ఉపాసనీ మహారాజ్. రాం బాబా తినిపించాడు.
కొన్ని మెతుకులు క్రింద పడ్డాయి. దగ్గర ఉన్న నరసింహస్వామిని ఆ మెతుకులను తినమని ఆదేశించారు ఉపాసనీ. నరసింహస్వామి ఆ మెతుకులను తిన్నాడు.
“చూచారా! ఆ కుష్టురోగి ఎంత చక చకా వెళ్లిపోయాడో. అంత రోగంతో ఉన్నవాడు అంత వేగంగా ఎలా నడుస్తాడు? అయన ఎవరనుకున్నారు? సాయిబాబాయే” అన్నారు ఉపాసని.
సాయిబాబా ఎప్పుడు, ఎవరిని ఏ రూపంలో వచ్చి కరుణిస్తాడో మనకు అవగతం కాదు.
నేడు అక్టోబర్ 19, నరసింహస్వామి వర్థంతి.
ఉపాసనీ, నరసింహస్వామిని, సాయిని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio
- రామ స్మరణం …. మహనీయులు – 2020… అక్టోబరు 22
- ఒక చెంపను కొడితే …. మహనీయులు – 2020… అక్టోబరు 30
- రాం రామాయ నమః…. మహనీయులు – 2020… అక్టోబరు 24
- శ్రీరామ రక్ష…. మహనీయులు – 2020… అక్టోబరు 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments