అడిగినా , అడగకపోయినా నా అవసరాలు అన్నింటినీ తీరుస్తున్న బాబా వారు ….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక సారి మా ఆవిడ ఇంట్లో పారాయణం చేస్తోంది. అప్పుడు మా అబ్బాయి వయసు ఏడు సంవత్సరాలు ఉంటాయి. వాడు పైన మేడ మీద ఆడుకుంటున్నాడు.

మా ఆవిడ చదివే అధ్యాయంలో పాము, తేలు లాంటీ విషప్రాణుల నుండి కూడా నన్ను నమ్ముకున్న వారిని నేను కాపాడుతాను, అని చదువుతుండగా,

మా అబ్బాయి పైనుండి క్రిందకి దాదాపు 10 అడుగులు మెట్లు మీద నుండి మెట్లు పక్కనే కాంపౌండ్ గోడ ఉంది. ఆ పక్కకి దూకేసాడు .

చిన్న పిల్లవాడు ఆ గోడ కనుక తగిలినా, కింద ఏదైనా రాయో రప్పో ఉంటే చాలా ప్రమాదం జరిగేది.

కానీ ఇంతకీ దూకిన కారణం ఏంటంటే పైన వీడు వెళ్లేసరికి పెద్ద పాము పడగ విప్పి ఉందట. అది చూస్తూనే వీడు భయపడి దూకేసాడు. వాడికేం కాలేదు.

లోపలికి వచ్చి అమ్మా! పైన పాము ఉంది నేను చూసాను అన్నాడు. అందరం భయపడి పోయాము. రెండు రోజులు పాటు తలుపులు మూసుకుని లోపలే ఉండిపోయాము.

తలుపులు తీస్తే ఆ పాము లోపలికి వస్తుందని మా భయం. మూడవ రోజు దాక ఆ పాము చుట్టూ పక్కలే తిరిగి అది ఒక తూములోంచి బయటికి వెళ్ళిపోవటం మేము అందరం కళ్ళారా చూసాము.

బాబా కరుణించి చూడకపోతే మా అబ్బాయి పాము బారినో, దాని తాలూకా ”భయం” బారినో పడిపోయి ఉండేవాడు.

2006లో నాకు ఒక ఇల్లు కొనాలి అనిపించింది. నాకసలు జాతకం లో ఇల్లు లేదు. నాకేదయిన పని ఉంటే డబ్బులు కుదురుతాయి కానీ ఇల్లు అంటే మాత్రం ఉద్యోగానికి ఎసరు రాసాగింది.

ఒక సారి మా కంపెనీ (డిజిటల్ పింక్) మూసివేయాలని నిర్ణయానికి వచ్చి, సీనియర్లు అందరికి VRS ఇస్తాము అంటూ లిస్టు తయారు చేస్తున్నారు.

పూజ రూంలో వేరే దేవతల ఫోటోలు చాలా ఉన్నాయి. అవన్నీ తీసేసి ఒక బాబా విగ్రహాన్ని మాత్రమే పెట్టి, ”నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఏదో ఒకటి చెయ్యి” అంటూ బాబా ముందు కూర్చున్నాను.

బాబా విగ్రహం లోంచి ”నీకు ఇల్లు చూస్తాను, నేను ఇచ్చేదాకా అడగకు” అని వినిపించింది. సరే అని నేను అనుకున్నాను.

సీనియర్లు లిస్ట్ లో బాబా దయ వల్ల నా పేరు లేదు. 3  నెలల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి పైన అపార్టుమెంట్ అమ్మకానికి ఉంది అది నీ పేరు మీద తీసుకుంటావా? అని అడిగింది.

నేను అవును అంటే నా ఉద్యోగానికి ఎసరు వస్తుందేమో అని భయంతోటి మా ఆవిడ పేరు మీద పెట్టమన్నాను.

నేను ఒక కారు అమ్మేసి 2. 50 లక్షల రూపాయలు బ్యాంకు లో వేసాను. అమ్మ కొంత డబ్బు వేసింది ఇల్లు మా ఆవిడ పేరు మీద రిజిస్టర్ అయిపొయింది.

ఇంకా కొంచెం డబ్బులు అవసరం అయితే మరో కారుని మా డ్రైవర్ కి అమ్మాను, అమ్మి ఆ డబ్బులు కూడా ఇంటికి వాడాను.

మేము కొనుక్కున్న ఇంట్లో ఒక బెంగాలీ అతను రెంటుకుండేవాడు.

నేను గృహ ప్రవేశం చేసుకునే నాటికీ నేను తలుపులు తీసేసరికి ఎదురుగ్గా బాబా వుండాలనుకున్నాను. నేను మా నాన్న గారి చేత బాబాకి (శిరిడికి)  లెటర్ రాయించాను.

ఇలా ఫలానా రోజున గృహ ప్రవేశం నువ్వు తప్పకుండా రావాలి బాబా అంటూ నేను తాళం తీసేసరికి ఎదురుగా బాబా ఫోటో ఉంది.

నాకంటే ముందు గానే బాబా మా ఇంటి గృహ ప్రవేశానికి వచ్చేసారు.

దసరా రోజులలో మేము షిరిడీ వెళ్ళాలి అని మా ఆవిడ పట్టు పట్టింది, సరే అని బయలు దేరి వెళ్ళాము, చావడి పక్కన ఉన్న హోటల్ లో దిగాము.

సాధారణంగా షిరిడి లో ఒక రివాజు ఉంది. బాబా షిరిడి లో ఉన్నప్పుడు ఐదుగురు ఇళ్లల్లో భిక్ష అడిగేవారు.

ఎవరు అయితే ఐదుగురు ఉండే వాళ్ళో వారి వంశీకులు బాబా మహా సమాధి అనంతరం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం దసరాకి ముందు రోజు ఉదయం 7 : 00 – 7 : 30 గంటల సమయం లో భిక్షకు వస్తారు.

అందరూ గోధుమలు పట్టుకుని లైన్లో నిలబడతారు. ఆయా వంశీకులు వచ్చిన తర్వాత అందరూ భిక్ష వేస్తారు.

అది అయ్యాక మరల వారి దగ్గర కొన్ని గోధుమలు అడిగి తీసుకుని మనం ఇంటికి తెచ్చుకోవాలి అదీ ఆచారం అక్కడ.

అందులో నేను నిలబడ్డాను. నేను కూడా భిక్ష వేసాను. తిరిగి మరల కాసిని గోధుమలు తీసుకుని ఇంటికి తెచ్చుకుని బియ్యం డబ్బాలో వేసుకున్నాం. అలా కనుక చేస్తే మన ఇంట ధాన్యానికి లోటు ఉండదు అని వారి వారి నమ్మకం . 

నేను సిగెరెట్స్ బాగా కాల్చే వాడిని. ఒక రోజు బాబా మీద ఒట్టు వేసి నేను ఇంక సిగెరెట్ కాల్చను అని  అనుకున్నాను.

కానీ ఆగలేక ”శిరిడి” లోనే సిగెరెట్ వెలిగించాను. బాబా నా వెనుకనే నిలబడి ”ఏరా నా మీద ఒట్టు వేసి మరీ మానేస్తాను అన్నావు! మానవా?” అని అడిగాడు.

నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించి సిగెరెట్ కింద పడేసాను. అప్పటినుండి సిగరెట్లు మానేసాను.

ఇంక శిరిడి లో మరో రివాజు ఉంది. ఖండోబా మందిరంలో ఖండోబా రాయుడి మీద పసుపు వేస్తారు. ఆ పసుపు కొంచెం ఇంటికి తెచ్చుకుంటే అది మనకి శుభం.

శ్రీ సాయినాథ చరణా విందార్పణ మస్తు

శుభం భవతు

 

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles