Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
స్నానం చేద్దామని ఓసారి నది గట్టుకి చేరుకున్నాను. తొందరేముంది? తర్వాత చెయ్యొచ్చులే అనిపించింది. ఓ చెట్టు కింద కూర్చున్నాను. చిలుం నింపుకుంటున్నాను. ఇంతలో ఎవరో భక్తుడు దగ్గరగా వచ్చి, చేతులు జోడించి, నా ముందు నిల్చున్నాడు.
‘ఎవరు బాబూ నువ్వు?’ అడిగాను.‘‘మాది ఈ పక్క గ్రామం బాబా! చిన్న పని మీద ఈ గ్రామం వచ్చాను. పని అయిపోయింది. వెళ్ళిపోతున్నాను. ఆకలిగా ఉంది, కూడా తెచ్చుకున్న భోజనం చేద్దామని, నీడ కోసం చూస్తోంటే ఈ చెట్టూ, మీరు కనిపించారు.’ అన్నాడతను.
‘కలసి భోంచేద్దాం బాబా! తెచ్చుకున్నది ఇద్దరం సర్దుకుందాం.’ అన్నాడు. సరేనన్నాను.
అంతలో ఓ కప్ప అరుపులు జాలిగా వినవచ్చాయి. ఆ అరుపుల్ని బట్టి అది చాలా ప్రమాదంలో ఉన్నదని తెలుస్తోంది.‘ఏమిటి బాబా ఆ అరుపులు? కప్ప అరుపులనిపిస్తున్నా, చిత్రంగా ఉన్నాయి. ఏమయి ఉంటుంది దానికి?’ అడిగాడు భక్తుడు.
‘చేసిన కర్మ అనుభవిస్తున్నాడు. పాము నోటికి చిక్కాడు.’ అన్నాను.
పాపం అని జాలిపడ్డాడు భక్తుడు. ఎక్కడ? ఎక్కడ ఆ పాము-కప్ప అని శబ్దం వినవస్తున్న వైపుగా వెళ్ళి, వెంటనే తిరిగి వచ్చాడతను. బాగా భయపడ్డట్టుగా ఉన్నాడు. వణికిపోతున్నాడు.‘చూడలేకపోయాను బాబా! కప్ప బాధ చూడలేకపోయాను.
మీరు అన్నట్టే పాము నోటిలో ఉంది కప్ప. గిలగిలలాడుతోంది. కాస్సేపట్లో చచ్చిపోతుంది. పాము మింగెస్తుంది దానిని.’ అన్నాడు.
‘వీల్లేదు. పాము దానిని మింగకూడదు.’ అన్నాను నేను. లేచి నిల్చున్నాను.‘ఇంత దూరం ఎందుకొచ్చానిక్కడికి? వాణ్ణి కాపాడడానికే! నేనుండగా వాణ్ణి చంపనిస్తానా? పద పద’ అన్నాను.
గబగబా ముందుకు నడిచాను. భక్తుడు నన్ను అనుసరించాడు.‘ఇదిగో ఇక్కడ, ఇక్కడ బాబా’ అని భక్తుడు కప్పని మింగుతోన్న పాముని చూపించాడు.
పాము చాలా పెద్దది. కప్పని నోట కరచి పెట్టి దాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కసి తీర్చుకుంటోంది. బక్కప్రాణి కప్ప, ప్రాణభయంతో విలవిలలాడుతోంది. అరవలేక అరవలేక అరుస్తోంది.
నేను రెండు అడుగులు ముందుకు వేశానో లేదో, భక్తుడు వారించి, నన్ను పట్టుకున్నాడు.
‘వద్దుబాబా! ఆ పాముని చూస్తోంటే భయంగా ఉంది. మన మీదికొచ్చినా వస్తుంది.’ అన్నాడు.‘అంత సాహసం చెయ్యదులే’ అన్నాను నేను. పాము దగ్గరగా వెళ్ళాను. నెత్తి మీద ఒక్కటిచ్చాను.
‘పాముగా పుట్టినా పగ చల్లారలేదా వీరభద్రప్పా! ఏం బసప్పా, కప్పగా పుట్టావు. ఇంకా నీకు బుద్ధి రాలేదా?’ అడిగాను.
‘చాల్చాలు! ఈ కొట్లాట ఇంకా ఎన్ని జన్మలు కొనసాగిస్తారు? పొండి, ఒకరికొకరు దూరంగా పొండి.’ కసిరాను. అంతే! కప్పను వదిలేసింది పాము. అటుగా పొదల్లోకి పారిపోయింది. కప్ప కూడా మెల్లగా గెంతుకుంటూ గెంతుకుంటూ నీళ్ళలోకి జారింది.
‘ఎన్ని జన్మలెత్తినా ఇద్దరికిద్దరూ ఇంతే! కొట్టుకు చావడమే’ అన్నాను.
భక్తుడికి నా మాటలు అర్థమయి, అర్ధం కాకుండా ఉన్నాయి.‘ఏమిటి బాబా ఇదంతా?’ అడిగాడు.
‘ఇదో పెద్దకథ’ అన్నాను.‘కథేంటి బాబా? ఏం జరిగింది?’ అడిగాడు భక్తుడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (2వ. భాగం)
- పాము కాటునుండి బాబా వారు కాపాడుట.
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (1వ. భాగం)
- మాతాజీ జీవితం లో మరో ఆణి ముత్యం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments