సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


వంద సంఖ్య ఏమిటో, పక్షి ఎగిరిపోవడం ఏమిటో నని నేను చాలా భయపడ్డాను. ఆ రోజు మొదలుకొని వంద రోజులు తిరిగేటప్పటికి మా సొంత ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది.

అది ఎలా అంటే, మేము ఉంటున్న ఇంటి ఓనర్ అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరో ఆ ఇంటికి వస్తారుట.

ఆ వూరు transfer అయి వస్తున్నారని ఖాళీ చేయమన్నాడు. సరేనని వేరే ఇల్లు వెతుక్కునే పనిలో పడ్డాము.

ఆ పరంపరలో ఒక రోజు ఒక అపార్టుమెంట్ లో మా వారు కేబుల్ పని మీద వెళ్లి అక్కడ ఒక ఆంటీని అడిగారట. అద్దె కోసం ఇళ్ళు ఏమైనా ఉన్నాయా అని.

అప్పుడు ఆ ఆంటీ అద్దె ఇళ్లలో ఎన్నాళ్ళు తిప్పలు పడతావు కరుణాకర్ సొంత ఇల్లు కొనుక్కోకూడదా అని చెప్పిందట.

అప్పుడు మా వారు సొంత ఇల్లు గురించి ఆలోచించే అర్హత కూడా మాకు లేదు, మేమేమిటో మా సంపాదన ఏమిటో మీకు తెలుసు కదా ఆంటీ! అని అన్నారుట.

ఆవిడ మా వారికి ముందునుండి తెలుసు. మా హితం కోరే మనిషి. కరుణాకర్! నువ్వు తీసుకుంటానంటే చెప్పు ఇదే అపార్టుమెంట్ లో ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది,

వాళ్ళు మనకు బాగా తెలిసినవాళ్ళే, కొంచెం తగ్గించమని అడుగుదాం.

బ్యాంకు లో కూడా తెలిసిన వాళ్ళు వున్నారు. లోన్ కి కూడా ప్రయత్నం చేద్దాం. కొంచెం కష్టపడితే ఇల్లు అమరుతుంది ఏమంటావ్ అని అందిట.

మా వారు ఆలోచనలో పడి ఇంటికి వచ్చి నాకు ఆ విషయం చెప్పారు. నేను వెంటనే మా నాన్న గారికి ఫోన్ చేసి, ఆయనకి విషయం అంతా చెప్పాను.

ఆయన, సరేనమ్మా అయితే పొలం బేరం పెట్టి, అమ్మేసి నీకు నేను అయిదు లక్షలు ఇస్తాను అని చెప్పారు.

ఇల్లు పదమూడు లక్షలు, మా దగ్గర లక్ష రూపాయలుంది. మిగిలిన డబ్బులు ఎలాగా అని ఆలోచిస్తుంటే  అప్పుడు ఆంటీ గారు బ్యాంకు లోన్ పెడదాం అని చెప్పింది.

మేము కావలసిన కాగితాలను తయారు చేసుకుని ఎంత కావాలో అంతే పెడితే బ్యాంకు ద్వారా తక్కువ ఇస్తారని కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలని పెట్టాం.

వాళ్ళు మొత్తం అంత మంజూరు చేసి అంత డబ్బులకి EMI నిర్ణయించి మొత్తం లోన్ తీసుకోవలసింది అని చెప్పారు.

అది మా నాన్న గారికి ఫోన్ చేస్తే ఆయన మరి అలాంటప్పుడు పొలం అంత అర్జెంటుగా అమ్మడం ఎందుకు మంచి బేరం వచ్చినప్పుడు అది అమ్ముకోవచ్చు దాని సంగతి తరువాత చూదాం అని అన్నారు.

మా దగ్గర ఉన్న లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ కి వచ్చాయి. అలా బాబా దయ వల్ల గుడిలో బాబా ముందు అనుకున్న రోజు నుండి సరిగ్గా వందవ రోజుకి ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది.

అంతా ఒక కల లాగ జరిగింది. మేము అందులోకి మారిపోయాము. EMI బ్యాంకు కి అద్దె రూపంలో కడుతున్నాము.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….

Sai Baba

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba….Sai Baba is the only mother will give every thing to his children.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles