Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భరత్ రావు గారి అనుభవములు ఆరవ భాగం
మా ఆవిడ పూజలు అవీ బాగా చేస్తూ తరచూ ఉపవాసాలు చేస్తూంటుంది.
ఆమె కూడా రోజు బాబా పారాయణ కూడా చేస్తూంటుంది. ఆమె బ్యాంకు లో ఉద్యోగం చేస్తూండేది.
ఉదయం పూర్తి సమయం పారాయణ కోసం కుదరదు కాబట్టి, కొంత ఉదయం మరి కొంత సాయంత్రం బ్యాంకు నుండి వచ్చాక చేస్తూండేది.
మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది బాబా కి మేము ఉపవాసం ఉంటాము ఉదయం నుండి ఏమీ తినకుండా సాయంత్రం చపాతీలు తింటాం అని చెప్పేవారు.
అదివిని మా ఆవిడా నేను కూడా బాబా కోసం ఉపవాసం ఉంటాను అని మనసులో అనుకుని అనుకున్నదే తడవు ఆమె గురువారాలు ఉపవాసం ఉండటం మొదలుపెట్టింది.
అలా చేస్తుంటే ఆమెకు ఆఫీస్ లోనో, ఇంట్లోనో ఏదో ఒక చెడు జరగటం మొదలు అయ్యింది. ప్రతి గురువారం ఇలానే అవుతోంది.
ఎందుకు ఇలా జరుగుతోంది? నా వల్ల ఏదో తప్పు జరుగుతోంది అని గమనించింది.
రోజూ ఉదయం సాయంత్రం పారాయణం చెయ్యటం అలవాటు ఉందిగా, ఆ పరంపరలోనే ఒక రోజు పారాయణ పూర్తి అయ్యి బ్యాంకుకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాక యధాలాపంగా పుస్తకం తెరిచేసరికల్లా ఒక పేజీలో పుస్తకం తెరుచుకుంది.
ఆ పేజీ లో ఉన్న కథ తాలూకు అక్షరాల వెనకాల ఆమె కనులు పరుగెత్తాయి. ఆ కథ చదివాక ఆమె చేస్తున్న తప్పు ఏమిటో ఆమెకు తెలిసి వచ్చింది.
ఆ కథలో గోఖలే గారి భార్య ఉపవాస దీక్ష కథ ఉంది, ఆమె ఉపవాసం ఉండాలి అనుకుని షిరిడీకి రావటం అది బాబాకి తెలిసి ఎవరికో ఇబ్బందిగా ఉంది అని వారి ఇంటికి పంపించి బొబ్బట్టు ఆమె చేత చేయించి తినిపించే కథ అది.
అంటే “నేను ఉపవాసం చేయడం బాబా కి ఇష్టం లేదు” అన్న సంగతి నా భార్య తెలుసుకుంది. కానీ ఆమె బాబా కి మాట ఇచ్చింది – నేను గురువారాలు ఉపవాసం ఉంటాను అని, అది ఏ విధంగా విరమించుకోవాలో ఆమె కి తెలియలేదు.
అలా ఇంకొన్ని రోజులు గడిచాయి. ఆమె ఆఫీస్ లో పనిచేసే ఒకామె వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలిచింది.
ఆ రోజు గురువారం, నేనేమి తినను కాబట్టి పెళ్ళి వాళ్లకి కనిపించి , అటు నుంచి అటే బ్యాంకు కి వెళదామని బయలు దేరింది.
అక్కడ ఆవిడకి ఒక పదార్ధం ప్లేట్ లో వేసి తీసుకువచ్చి ఆమె ముందు ఉంచారట. ఈ రోజు గురువారం నేను ఏమి తినను దయచేసి ఇది లోపలికి తీసుకెళ్లండి అన్నదట.
ఇంతలో ఒకాయన వచ్చి “అమ్మా! గురువారం కాబట్టే ఈ రోజు ఈ పదార్ధం చేయించాము. మేము కూడా గురువారం నాడు రాఘవేంద్ర స్వామి కి ఉపవాసం ఉంటాము.
అలాంటప్పుడు ఇది మాత్రమే తిని ఉంటాము. ఇది తింటే తప్పు లేదు తల్లీ తిను పరవాలేదు” అన్నాడట, సరేనని తినడం మొదలు పెట్టింది.
ఆ పదార్ధం తియ్యగానూ, కారంగానూ, ఉంది చాలా మధురంగా ఉంది. అది మొదలు ఆమె అన్నం తింటూ ఉపవాసం చేయడం విరమించుకుంది.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru
భరత్ రావు గారి అనుభవములు ఏడవ భాగం తరువాయి…..
Latest Miracles:
- భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి–Audio
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- నవ గురవార వ్రత మహిమ
- బాబా వారి సత్సంగ మహిమ ద్వారా “చైనా ప్రభుత్వము వారు మా మరిదిని విడుదల చేయట.”—-Audio
- ముసలమ్మ రూపం – దక్షిణ–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments