Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
కబీరు ఒకసారి గంగా నదీ తీరం వెంట నడుస్తున్నాడు. ఆయనకొక వింత దృశ్యం కనిపించింది.
ఎంతో దాహంతో ఒక చాతక పక్షి గంగా నదీ తీరం చేరింది. అంతే. ఆ చాతక పక్షి పవిత్ర గంగా జలాలతో తన దాహాన్ని తీర్చుకోకుండానే వెళ్ళిపోయింది.
ఆయన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. చాతక పక్షులు ఏ నీటినీ త్రాగవు – ఎంత దాహంతో ఉన్నాగాని. మొదటి సారిగా మేఘం నుండి వచ్చే జలధారను తప్ప ఏ నీటిని స్వీకరించదు – ప్రాణము పోతున్నా సరే.
అలాంటి బంధాన్నే కబీరు, ఆ చాతక పక్షిని స్వయంగా చూచి హర్షిస్తాు. ప్రతి వ్యక్తి, అంతి బంధాన్ని భగవంతునితో పెట్టుకోవాలని వాంఛిస్తాడు.
ఆది శంకరాచార్యుల వారు భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణ(ల)తో పోలుస్తాడు.
చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు, అన్యములు ఏవియును అతనికి అక్కరలేదు.
గురు గ్రంథ్ సాహెబ్‌లో గురు రామ్‌దాస్ ”ఎడతెగని భక్తి మాత్రమే భగవంతుని ప్రేమను చూరగొంటుంది. చాతక పక్షి వలె మనం కూడ అమృత బిందువుకై ఆశిద్దాం” అని వ్రాసారు.
5 సెప్టెంబరు 1877లో అహమ్మద్ నగర్‌లో జన్మించిన మాధవ రావ్ అడ్కర్ పూర్వ పుణ్యం వల్లనే సాయి సన్నిధిని చేరుకో గలిగాడు.
ఆరతి పాటను ఎంతో ఆర్తితో వ్రాశాడు. ఆ ఆరతి పాటనే మైనతాయి ప్రసవ సమయాన సాయి రాంగిర్ బువాతో నానాకు పంపారు. ఆ ఆరతి చివరి చరణంలో
”ఇచ్ఛిత దీనచాతక నిర్మలతోయ నిజసూఖ
పాజవే మాధవయా! సంభాళ అపూళీబాకా
అని వ్రాసారు. అంటే
”చాతక పక్షి నిర్మలమైన ఉదకమునే కోరును. నీ స్వరూప జలమును త్రావించి నన్ను కాపాడుము. మా మొర నాలకింపుము”.
మాధవ్ రావ్ అడ్కర్ ఆశించిన విధముగా మనమందరము చాతక పక్షులమే అగుదుము గాక..
ఓ సాయీ!
ఓ కారుణ్య మేఘమా!! వర్షింపుమా!!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అబ్బా! దెబ్బ…..సాయి@366 సెప్టెంబర్ 28….Audio
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- నీ పాదం గంగాయమున సంగమ సమానం….. సాయి@366 ఫిబ్రవరి 24….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- సాయి స్తవన మంజరి…..సాయి@366 సెప్టెంబర్ 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments