Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. jeevani
అది ఏ సంవత్సరమో తెలియదు గాని సామాన్యంగా ఫిబ్రవరి నెల చివరలో వచ్చే మహా శివరాత్రికి షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న సంగం వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించుకున్న దాసగణును సాయి అనుమతించ లేదు.
”గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది. వెళ్ళకు!” అన్నారు సాయి.
సాయిబాబా నారాయణుడని, ఆయన పాదముల చెంత గంగ ప్రవహిస్తుందని దాసగణుకు తెలుసు.
అయితే గంగా స్నానంవల్ల కలిగే అనుభూతి కావాలనుకున్నాడు దాసగణు.
అతని మనస్తత్వం ఎరిగిన సాయి తన పాదాల చెంతకు రమ్మని పిలిచి చేయి పట్టమన్నారు.
సాయిబాబా రెండు పాదాల నుండి సన్నటి ధార దాసగణు చేతిలోనికి ప్రవహించింది. చేతులు నిండయి. మనసు ఉప్పొంగింది.
”గంగా యమున సాయి గోళ్ళనుండి పొంగె
పొంగె దాసగణుని పెదవి నుండి
రాగ తాళ యుక్త రమనీయ గీతమై
పొంగిపొరల భక్తి” అంటారు శ్రీ పోరూరి వెంకట నారాయణ గారు.
”నీ పదము దాకి గంగ పునీతమయ్యె
నీ పదాబ్జమె ముక్తికి నిలయమయ్యె” అని వ్రాశారు శ్రీమతి స్వర్ణ లక్ష్మీకాంతమ్మ గారు.
”శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగ లేదా గోదావరి యాత్ర చేయనవసరం లేదు.
భక్తి భావంతో మహనీయుల స్తోత్రం, సాయి మధుర చరిత్రను వింటే చాలును” అంటారు హేమాడ్‌పంత్ గారు.
శ్రీ విస్సాప్రగడ సోమరాజు గారు ఆ స్తోత్రమే కాదు, ఆ దృశ్యం కూడ ఫలదమే అంటారు ఇలా:
”చేసిన పాపము గంగలో కలప
దలచిన జనులు నీ దరినే
బొటన వ్రేలిలో పావన గంగను
కని తరియించే ఆ దృశ్యం
తలచిన కొలది చమురును దేహం
సర్వం సాయి నీ శక్తి
జయ జయహే సకలాగమ సన్నుత
సద్గురునాథా సాయీశా!
సాయి కరుణను దోచుకున్నది దాసగణు మాత్రమేనా?
”నీ లీలలు పాడినందుకు
దాసగణుకేమిచ్చినావో
మాకు కూడ అట్టి ఫలితము
నీయవయ్యా సాయి దేవా!” అంటారు మోపర్తి గోపాలరావు గారు.
ఎందుకంటే అందరూ దాసగణులాగా ఆడి పాడ లేరు కదా!
స్మరణకు మహా శివరాత్రియే కానక్కరలేదు. ప్రతి క్షణము పవిత్రమే సాయి చరణ స్మరణకు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- ఆది భిక్షువు సాయినేమి కోరేది? ….. సాయి @366 ఫిబ్రవరి 10….Audio
- సన్నుతించు వేళ…..సాయి@366 జూన్ 12…Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
- నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో! …. మహనీయులు – 2020… జూన్ 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments