దూరమెరుగని దైవం ….. సాయి@366 ఫిబ్రవరి 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా పరిధి ఎదో కొన్ని మైళ్ళు లేదా కిలోమీటర్లు కాదు.

కెనడా దేశస్థుడైన జేమ్స్‌ వుడ్‌ క్రైస్థవుడు. 1978లో ఆయనకు ప్రమాదకరమైన జబ్బు చేసింది.

మూత్రపిండాలు పనిచేయటం మానివేసాయి.

కృత్రిమంగా మూత్రపిండాలను అమర్చి చూచారు. అవి కూడ పని చేయలేదు.

ఆసుపత్రిలోనే కాలం గడపసాగాడు నేడో, రేపో ఆఖరి దినం అనుకుంటూ. ఆయనకు తోడు నీడలా ఆ ఆసుపత్రి నర్సు లెస్లీ బానీ ఉండేది.

ఆయన సొంత చెల్లెల్లా అన్నట్టుండేదామె. ఇది ఎప్పటి అనుబంధమో!

ఆ సోదరి ఒకనాడు ఆసుపత్రిలోనికి వస్తూ ఒక సాయి భక్తుని వెంట తీసుకు వచ్చింది.

ఆ సాయి భక్తుడు జేమ్స్‌ను చూస్తూనే ”మీరేమీ భయపడకండి.  షిరిడీ సాయి బాబా భగవంతుడు.

ఆయనను మనసారా వేడుకోండి. ఈ సాయి విభూతిని సేవించండి.

కొద్ది సేపట్లోనే మీకు శస్త్ర చికిత్స అవసరం లేకుండానే మూత్రపిండాలను బాగు చేయగల సామర్ధ్యం ఆయనకు, ఆయన విభూతికి ఉన్నది” అని చెప్పాడు.

మొక్క నవసరం లేని రూపి సాయి.

జన్మతః జేమ్స్‌ క్రైస్తవ మతానికి చెందిన వాడగుటవలన, బైబిలులోని ఏసుప్రభు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్ధనను సాయిబాబా పరంగా మలచి, వ్రాసిన చీటీని ఆ సాయి భక్తుడు జేమ్స్‌కు ఇచ్చి వెళ్ళాడు.

మరునాడు కూడా విభూతిని, షిరిడీ తీర్ధాన్ని కూడ జేమ్స్‌కు ఆ నర్సు ద్వారా పంపాడు ఆ సాయి భక్తుడు.

ఇక జేమ్స్‌ను పరీక్షించానికి డాక్టర్లు రాసాగారు. ప్రతి అర గంటకు పరీక్ష చేయసాగారు.

మూడవ నాటికి అతని వ్యాధి జాడే లేదు. డాక్టర్లందరూ గుమిగూడి ”ఇంత పూర్తిగా దెబ్బ తినిపోయిన మూత్రపిండాలు అవి మరల బాగై తిరిగి రోగి జీవించిన సందర్భం ఈ ఆసుపత్రి చరిత్రలో ఇదొక్కటే.

ఇంకా మాకు తెలిసినంత వరకు ఇటువంటి ఉదంతం మరే ఆసుపత్రి చరిత్రలోనే లేదు” అని ఎంతో ఆశ్చర్యంతో చెప్పారు.

ఇక జేమ్స్‌, సోదరి లెస్లీ సంగతి చెప్పనక్కర లేదు.

కెనడాకు, షిరిడీకి ఎంతో దూరం. కృతజ్ఞతా పూర్వకంగా ఆయన ఫిబ్రవరి 23, 1979న షిరిడీని, సింహాసనాశీనుడైన సాయిని దర్శించాడు.

సాయికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!

ప్రేమ ఒక్కటి చాలు సాయికి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles