Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు తన ”సాయి బాబా జీవిత చరిత్ర” రచనను ముగించే సమయంలో ఉన్నారు.
ముగింపు మాటలు ఏమి వ్రాయాలి? అది తేలాలి. తేల్చవలసింది బాబాయే గాని, ఇతరులు కాదు, చివరకు బి.వి. నరసింహ స్వామి గారు కూడా కాదు.
అహ్మదాబాదులో శ్రీ సి.సి. మంకేవాలా అనే ప్రఖ్యాత న్యాయవాది ఉండేవాడు. ఒకసారి ఆయనకు అనారోగ్యం కలిగింది.
అది జలోదరం. రక్తం వాంతులుగా వచ్చేది. 136 కేజీల బరువు ఉన్నాడు. సుప్రసిద్ధ డాక్టర్లు వైద్యం చేసేవారు.
ఆ డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఇక రెండు రోజులే జీవితం అన్నారు. స్నేహితులు, బంధువులు వచ్చి సాయిబాబాను శరణు కోరమన్నారు.
మంకేవాలా ఇంటి ఎదురుగానే సాయి మందిరం ఉన్నది. ఆయన చిత్రంలోని సాయికి శరణుజొచ్చాడు.
బుద్ధి సాయి వైపు లాగుతోంది. మనసు ముస్లిం అయిన సాయిబాబానా ప్రార్ధించేది అని వెనకకు లాగుతోంది. సాయి ఆకర్షణ నుండి తప్పుకోలేక పోతున్నాడు.
సాయంకాలం 6 గంటలైంది. సాయి దర్శన మిచ్చాడు. ”నేను ఫకీరును కాను. నేను దత్తాత్రేయుని అవతారమే. నాలో 9 అవతారాలు ఉన్నాయి” అని చెప్పారు సాయి.
ఆయనకు నమ్మకం కలిగింది. మరునాడు గుజరాతీ భాషలో సాయిపై గ్రంథాలను ఎవరో ఇచ్చారు. వాటిని పఠించాడు.
డాక్టరు వచ్చాడు. ఇంకా కొన్ని గంటలే జీవిస్తాడు అన్నాడు. మరల సాయంకాలం 6 గంటలకు ఆయనకు, ఆయన తల్లి గారికి కూడా ఒకేసారి దర్శనమిచ్చాడు సాయి.
”వ్యాదిని నేను తీసుకున్నాను” అని అదృశ్య మయ్యాడు. మంకేవాలా మరణిస్తాని, ఆయన కర్మ కాండ జరిపేందుకు కుమారుడుండాలి కాబట్టి కుమారుని రమ్మని కబురు పంపారు.
ఆ వచ్చిన కుమారుని షిరిడీ పంపారు. డాక్టరుకు ఇదంతా నచ్చలేదు. జీవించేది కొన్ని గంటలే అన్నాడు.
అతని కుమారుడు షిరిడీలో కాలు మోపిన క్షణం నుండి మంకేవాలా వ్యాధి తిరో ముఖం పట్టింది. గుండె, నాడి సక్రమమయ్యాయి.
బరువు తగ్గాడు. రక్తపు వాంతులు లేవు. డాక్టరు ”ఇది కేవలం బాబా లీల” అన్నాడు.
ఆగస్టు 23, 1954న మంకేవాలాకు ప్రత్యక్షమైన సాయి ”నేను నా భక్తుల ఎదుట ఎప్పుడూ ఉన్నాను. ఈ విషయాన్ని బి.వి. నరసింహ స్వామికి తెలియ చేయి” అన్నాడు.
ఎప్పటికైనా సాయి సాహిత్యములో తుది పలుకు ”నేను నా భక్తుల ఎదుట ఎప్పుడూ ఉన్నాను’‘ అనేదే.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నేనున్నాను …..సాయి@366 డిసెంబర్ 31…Audio
- పరీక్షలు – పొరపాట్లు …..సాయి@366 జూన్ 23….Audio
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- నాస్తికులకు సాయే శరణం…..సాయి@366 ఆగస్టు 14….Audio
- పుట్టిన రోజు(న) పండుగ…..సాయి@366 ఆగస్టు 20….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నేనున్నాను…! …..సాయి@366 ఆగస్టు 23….Audio”
ఆచార్య గిడ్డి వెంకట రమణ
August 23, 2020 at 10:13 amసాయి లీలలు అద్భుతం,వర్ణనాతీతం