Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియదు మానవులకు. సాయి పరమాత్మ ఏ భక్తుణ్ణి ఏ తల్లి గర్భాన జనియింప చేయాలో ముందే నిర్ణయిస్తాడు.
పుట్టబోయెడి వారలకు మాతాపితరులెవరో తానే నిర్ణయిస్తానని సాయియే స్వయంగా పలికారు అనేక సందర్భాలలో.
సాయి భక్తుడు మహల్సాపతికి ఆడ సంతానమే. సాయి అరే! భగత్! అక్షర సత్యములగు ఈ ఫకీరు పలుకులను విశ్వసించు.
”నీవు ఇక్కడ నిద్రించు చున్నావు. ఇంట నిద్రింపవు. నీకు ఆడబిడ్డలు మువ్వరున్నను మగ బిడ్డ లేడు. ఇకనుండి నీవు ఇంట నిద్రించుము. నీకు సుతుడు జనించును” అని పలికారు.
శ్రీకృష్ణ జన్మదినం నుండి (1896) ఇంట నిద్రించుట మొదలుపెట్టాడు మహల్సాపతి.
1897 కృష్ణాష్టమినాడు అంటే ఆగస్టు 20 శుక్రవారంనాడు పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డడు జన్మించిన దినమే పండుగ దినము. అదే పుట్టిన రోజున పుట్టినాడు మహల్సాపతి వంశోద్ధారకుడు.
ఆ పసివానిని పురిటి స్నానమయిన తరువాత సాయి చేతులందు ఉంచాడు ఆ విరాగి అయిన మహల్సాపతి.
”నీవు ఈ బిడ్డను 25 సంవత్సరములు కనిపెట్టుకుని ఉండుము. నీ పని ఆ మాత్రమే” అన్నారు సాయి.
మహల్సాపతి వెంటనే ”బాబా! ఈ బిడ్డను నేను కాపాడగలనా? నీవే రక్షింపవలయును. సర్వ రక్షకుడవు నీవే!” అన్నాడు సాయితో.
సాయి ప్రోఢముగా సమాధానమిచ్చినాడు ”భగత్ నీవు నిమిత్త మాత్రము వర్తింపుము” అన్నాడు. సాయిబాబా ఇచ్చిన ఈ సందేశము మహల్సాపతికి మాత్రమే కాదు ప్రతి తల్లితండ్రులకును.
మానవుడు ఏ కార్యమునైనను తన విధిగా, తన ధర్మముగా నిర్వర్తించ వలయును. ఆశలను, కోర్కెలను ఆపాదించుకుని బిడ్డలను సాకరాదు. మన ధర్మము మనము నిర్వర్తించిన, సాయి తనవంతు నిర్వహించును.
ధర్మ మార్గమున మహల్సాపతిని నడిపినాడు సాయి. తనకు అన్య దైవములకు తేడా లేదని మహల్సాపతి గ్రహించేటట్లు చేశాడు.
అటులనే మార్తాండ మహల్సాపతికి కూడా విశేష అనుభవములు ఇచ్చినాడు సాయి.
మార్తాండుడు ఖండోబా ఆలయ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. సాయి ఖండోబా మందిరం వైపు వస్తుంటే లేచి నిలబడ్డు నవ్వుతూ.
సాయిబాబా కూడా నవ్వుతూ ఖండోబా విగ్రహం వైపు వెళ్ళి లీనమైనాడు. విగ్రహం అన్ని వైపులా చూసినా మార్తాండుకు ఎవరూ కనిపించలేదు.
బాబా మరల నవ్వుతూ బయటకు వచ్చి వెళ్ళిపోయినాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మరల సాయి సన్నిధికి…..సాయి@366 సెప్టెంబర్ 11…Audio
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
- నమ్మకానికి కిరీటం ….సాయి@366 డిసెంబర్ 11….Audio
- భక్త మహల్సాపతి 1వ బాగం..
- ‘‘కంగారు పడకు. నువ్వు సహకరిస్తే ఈ దేహాన్ని విడిచి మూడు రోజుల పాటు నేను సమాధి స్థితిలో ఉండాలనుకుంటున్నాను.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments