అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘మరి నివార ణోపాయం?’’

‘‘దేహత్యాగం’’ అన్నారు బాబా.‘స్వామీ’’ ఆందోళనాశ్చర్యాలతో వణికిపోయాడు మహల్సాపతి.

‘‘ఈ వ్యాధికి సరయిన చికిత్స దేహత్యాగమే’’ అన్నారు బాబా. నిల్చుని ఉన్న మహల్సాపతిని కూర్చోమన్నారు.కూర్చున్నాడతను.కూర్చున్న మహల్సాపతి ఒడిలో తల పెట్టుకున్నారు బాబా.

‘‘బాబా’’ కంగారుపడ్డాడు మహల్సాపతి.‘‘కంగారు పడకు. నువ్వు సహకరిస్తే ఈ దేహాన్ని విడిచి మూడు రోజుల పాటు నేను సమాధి స్థితిలో ఉండాలనుకుంటున్నాను.

ఈ మూడు రోజులూ నన్నిలాగే నీ ఒడిలో ఉండనీ! నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తిరిగి వస్తాను. ప్రాణం పోసుకుంటాను. ఒకవేళ తిరిగి రాని పక్షంలో, ప్రాణం పోసుకోని పక్షంలో ఏం చెయ్యాలో తెలుసా?’’ ఆగారు బాబా.

కన్నీరు పెట్టుకుని వింటున్నాడంతే మహల్సాపతి. సమాధానం లేదు అతని దగ్గర్నుంచి.‘

‘ఏం చేస్తావంటే…ద్వారకామాయికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నా దేహాన్ని సమాధి చెయ్యి. చేసి, గుర్తుగా రెండు జెండాలు అక్కడ పాతు.’’ అన్నారు బాబా.