మరల సాయి సన్నిధికి…..సాయి@366 సెప్టెంబర్ 11…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయి మహా సమాధి అనంతరం వియోగ బాధను మహల్సాపతి అనుభవించాడు. ఇక ఆ వియోగం చాలుననుకున్నాడు.

తన తండ్రి ఆబ్దీకం నాడు తన శరీరాన్ని వదలి వేస్తానని అందరకూ చెప్పాడు. వారు నమ్మారు.

తన తండ్రి ఆబ్దీకం భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఆ సంవత్సరం  ఆయన తద్దినం సెప్టెంబరు 11 (1922)న వచ్చింది.

ఆ రోజు ఖండోబా భక్తులకు పవిత్రమైన రోజు. ”ఆబ్దీకానికి ఏర్పాట్లు, వంటలు త్వరగా కానివ్వండి ఈ రోజు నేను వెళ్ళి పోవాల్సి ఉన్నది” అన్నాడు మహల్సాపతి కుటుంబ సభ్యులతో.

తద్దినం యధావిధిగా పెట్టాడు. భోక్తలు భోజనం చేశారు. కుటుంబ సభ్యులు భోజనం చేశారు. కానీ మహల్సాపతి భోజనం చేయలేదు.

వడ్డించిన పళ్లెమును పైకెత్తి, ముక్కుకు తాకించి వాసన చూచి క్రింద పెట్టాడు.

ఒక బట్టను చించి నడుముకు బిగించుకొని, మిగిలినది కౌపీనంగా ధరించాడు. ”నేను దీక్ష తీసుకున్నాను” అన్నాడు మహల్సాపతి.

అక్కడే ఉన్న బాలాగురవే, రామచంద్ర కోతే మొదలైన వారిని నామ సంకీర్తన చేయమని కోరాడు. వారు నామ సంకీర్తన మొదలు పెట్టారు.

నామ సంకీర్తన వింటూ మౌనంగా, నిశ్చలంగా ఉండిపోయాడు. అక్కడ ఉన్నవారంతా మహల్సాపతి తనువు చాలించాడని అనుకున్నారు.

కొంచెంసేపు అయిన తర్వాత మహల్సాపతి కళ్ళు తెరిచాడు. ”నేను పోవటానికి ఇంకా సమయం ఉన్నది. రేపు పోతాను” అన్నాడు మహల్సాపతి. ఆ రాత్రి అందరూ అక్కడే ఉండిపోయారు.

ఉదయం నాలుగు గంటలయింది. మహల్సాపతి కుమారుని లేపి ”సమయం ఎంతైంది?” అని అడిగాడు. ”సుమారు నాలుగు గంటలు” అన్నాడు మర్తాండ్‌  తండ్రితో.

మహల్సాపతి బాలాగురవేను పిలచి ”మల్‌హరి మహత్యం” పారాయణ చేయించుకుని విన్నాడు.

తరువాత భక్తులందరూ భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు.

మహల్సాపతి భగవన్నామం ఉచ్ఛరిస్తూ తుది శ్వాస విడిచాడు. సాయికి నామకరణం చేసిన మహల్సాపతి ఇక లేడు.

సాయితో యాభై సంవత్సరాలకు పైగా గడిపిన మహల్సాపతి సాయి లేని లోటు అనుభవించాడు. ఇక సాయి చెంతకు చేరుదామని నిశ్చయించుకున్నాడు. సాయి చెంతకు ‘భగత్‌’ వెళ్ళాడు.

మహల్సాపతి వంటి భక్తి అందరకూ అలవడు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles