Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
నామ స్మరణ ప్రాశస్త్యమును గూర్చి వర్ణించుచు దాసబోధలో సమర్ధ రామదాసు తెలిపాడు.
ఇక సాయిబాబాకు అనంత నామములున్నవి. ఏ నామమునకు ఆ నామమే సాటి. సాయి కూడా షిరిడీలో నామ స్మరణను ప్రోత్సహించాడు.
‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ అను నామమును షిరిడీలో ఏకధాటిగా 10 జూన్, 1982 నుండి 17 జూన్ 1982 వరకు నిర్విఘ్నంగా జయప్రదంగా నిర్వహించారు.
దానిని కీ.శే. ఎం. జగన్నాధం, కీ||శే|| డి. శంకరయ్య మొదలైన వారు జరిపారు.
అది ఒక అపూర్వ ఘట్టము. అందుకు నాందిగా ఖైరతాబాదులో కీ||శే|| డి. శంకరయ్య గారి గృహంలోనే సాయి నామ సంకీర్తన 1982 సంక్రాంతి రోజున చేయటం జరిగింది.
షిరిడీలో ఈ నామ సప్తాహ భజన కార్యక్రమము పాత ఎంక్వయిరీ ఆఫీసులో జరిగింది. భక్తులు గ్రూపులు, గ్రూపులుగా ప్రతి 4 లేదా 6 గంటల కొకసారి మారుతూ సాయి నామ సంకీర్తనం చేశారు.
అందరికి వసతి, అన్న పానీయాలను సాయి నామ సప్తాహ నిర్వాహకులే తగిన విధంగా ఏర్పాటు చేశారు.
అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు సాయి దర్శనానికి షిరిడీకి వచ్చారు.
ఈ కార్యక్రమము దిగ్విజయముగా సాగుటకు శ్రీ శివనేశన్ స్వామీజి మరియు అనసూయ మాత (పారాడ్‌సింగా) ఆశీస్సులు లభించాయి.
సాకోరీ గోదావరి మాత తమ శిష్య బృందంతో సప్తాహంలో పాల్గొన్నారు.
ఆమెకు సాయినాథుని మెమెంటోని బహుకరించారు. ఇక షిరిడీలో జరిగిన ఈ నామ సంకీర్తన ఒక ప్రోత్సాహకర సంఘటనగా మారి భక్తులు ఆ నామాన్ని శ్రద్ధతో చేయటం ప్రతి చోట కనిపించే దృశ్యమయింది.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ ఏ ఒక్కరి వల్లనో పుట్టి, ఏ ఒక్కరి వల్లనో ప్రచారం జరగలేదు.
శ్రీ సాయి అనుగ్రహంతో పుట్టి విశ్వమంతా జపిస్తున్న ద్వాదశాక్షరీ మహా మంత్రం.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- గుజరాతీ జరీ శాలువ …..సాయి@366 ఆగస్టు 10…Audio
- సాయి స్పీడ్ పోస్ట్…..సాయి@366 జూన్ 27…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments