Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
నవరాత్రులలో మూడు రాత్రులు గడచిపోయాయి. విజయదశమి దగ్గర పడుతోంది. పండుగ వాతావరణమే లేదు షిరిడీలో.
అంతా బాబా ఆరోగ్యం గురించే ఆందోళన చెందుతున్నారు.జ్వరంతో బాబా బాగా నీరసించిపోయారు. అతి కష్టమ్మీద గద్దె మీద కూర్చుంటున్నారు. కూర్చుంటే లేవ లేని స్థితి. లేస్తే కూర్చోలేని స్థితి. ద్వారకామాయినే అంటి పెట్టుకుని ఉండిపోయారు బాబా.
ఆయన పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నాడు మహల్సాపతి.‘‘దేవా! నీ చల్లని చూపు చాలు, ఎందరి ప్రాణాలో నిలబడ్తాయి. నీ స్పర్శ చాలు, ఎంతటి దీర్ఘరోగాలయినా ఇట్టే నయమయిపోయాయి. నీ చేత్తో ఇచ్చే ఊదీ సంజీవని లాంటిది. పెట్టుకుంటే పాపాలు సైతం పటాపంచలవుతాయి. అలాంటి నీకా ఇంతటి అనారోగ్యం? నిజం చెప్పు బాబా, కావాలనే ఈ రోగాన్ని నువ్వు భరిస్తున్నావు, అవునా? ఎవరి కోసం ఈ త్యాగం? ఎందుకీ అవస్థ?’’ ప్రశ్నించాడు మహల్సాపతి.
సమాధానంగా కళ్ళు చెమర్చుకున్నారు బాబా. అది గమనించాడు శ్యామా. ఇలా అన్నాడు.
‘‘మహల్సాపతి మాటలకి నీ దగ్గర జవాబు ఉన్నా నువ్వు చెప్పవు. పైగా కన్నీరు పెట్టుకుంటావు. ఎందుకా కన్నీరు? ఎవరిని ఉద్ధరించడానికి? మమ్మల్ని అనాథల్ని చెయ్యొద్దు బాబా! చేతులెత్తి దండం పెడుతున్నాను, మమ్మల్ని కాదని వెళ్ళిపోకు.’’నెత్తి కొట్టుకున్నాడు శ్యామా.
అతనలా పిచ్చివాడిలా నె త్తి కొట్టుకుంటుంటే చూసి తట్టుకోలేకపోయారు బాబా. కోపం తెచ్చుకున్నారు.‘‘నీదీ మాదీ జన్మ జన్మల బంధమంటావు. నేను లేనిదే మీరు లేరు, మీరు లేనిదే నేను లేనంటావు. అన్నీ కబుర్లకే పరిమితమా? ఎందుకు తెంచుకుంటున్నావు ఈ బంధాన్ని?’’ అడిగాడు శ్యామా. ఏడుస్తూ అడిగాడది.
‘‘పిచ్చెక్కిందా నీకు?’’ కసురుకున్నారు బాబా. మహల్సాపతి ఆయన్ని వారించబోయాడు. వినిపించుకోలేదు బాబా. శ్యామాని ఎర్రగా చూస్తూ అరిచారిలా.
‘‘అసలు నీకు నేనెలా కన్పిస్తున్నాన్రా? జన్మలంటావు, బంధాలంటావు, ఏవేవో అంటగట్టాలని చూస్తున్నావు! వద్దు, ఎక్కువ మాట్లాడకు. నువ్వు చెబితే నేను వినాలనేం లేదు. అలాగే నేను చెబితే పైవాడు వింటాడనుకోకు. జరగాల్సింది జరుగుతుంది. నోర్మూసుకో.’’లేని శక్తిని కూడదీసుకుని బాబా అలా అరిచేసరికి అందరూనిశ్శబ్దమయిపోయారు.
కన్నీరుని కళ్ళల్లో దాచుకున్నారు. బాధని గుండెల్లో దాచుకున్నారు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. మవునం వహించారంతా.‘‘బంధాల గురించి ప్రశ్నించడం కాదు, ఆలోచించడం నేర్చుకో.’’ అన్నారు బాబా. శ్యామాని దగ్గరకు రమ్మన్నారు. వచ్చాడతను. శ్యామా తల మీద సున్నితంగా చరిచారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘కంగారు పడకు. నువ్వు సహకరిస్తే ఈ దేహాన్ని విడిచి మూడు రోజుల పాటు నేను సమాధి స్థితిలో ఉండాలనుకుంటున్నాను.
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
- ‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’
- ‘‘ఇక మీదట నేను మాట్లాడను. నా సమాధి మాట్లాడుతుంది.’’
- ‘‘దేహాన్ని ధరించినప్పుడు దేవుడికయినా బాధ తప్పదు.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments