Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ షిరిడీసాయి వైభవమ్ – తన భక్తుని బాధను బాబా అనుభవించుట
ఇప్పుడు ప్రచురిస్తున్నది కాస్త చిన్నదయినా ఇందులో బాబా చూపించిన మహత్యం అద్భుతం. బాబా తన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటిని నివారిస్తూ ఉండేవారు. ఆఖరికి ఒక్కొక్కసారి తన భక్తులకు వచ్చే అనారోగ్యాలను కూడా ఆయన స్వీకరించి తన భక్తులను కాపాడేవారు. అంతే కాదు ఆయన చేసే వైద్యం కూడా చాలా విచిత్రంగా ఉండేది. అటువంటి సంఘటన గురించి ఈ రోజు తెలుసుకుందాము. బాబా తన భక్తులపై చూపించే ప్రేమకు సాటి మరొకటి లేదు.
1915 వ.సంవత్సరంలో బాపూసాహెబ్ బుట్టీ 105 డిగ్రీల జ్వరంతో బాధ పడ్డాడు. జ్వర తీవ్రత వల్ల బాగా నీరసించిపోయి బాబా దర్శనానికి ద్వారకామాయికి కూడా వెళ్ళలేకపోయాడు. బాబా అతనిని ఎవరి సహాయంతోనైనా రమ్మని కబురు పంపించారు. నీరసంగాఉన్నా బుట్టీ మరొకరి సహాయంతో బాబా వద్దకు వచ్చాడు.
బాబా అతనిని కూర్చోమని చెప్పి పాయసం, బజ్జీలు, పప్పు, ఉసల్ (మహారాష్ట్ర వంటకం) అతని ముందు ఉంచారు. ఆపదార్ధాలన్నిటినీ తన సమక్షంలో తినిపించారు. భోజనం అయిన వెంటనే బుట్టీని తన బసకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నారు.
ఎటువంటి మందులు వాడకుండానే అతని జ్వరం తగ్గిపోయింది. అదే సమయంలో బాబాకు జ్వరం వచ్చింది. కాని బుట్టీకి నయమవగానే బాబాకు కూడా జ్వరం తగ్గిపోయింది. ఆవిధంగా బాబా బుట్టీకి వచ్చిన జ్వరాన్ని తాననుభవించి బుట్టీకి నయం చేశారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ – పూర్ణబ్రహ్మ – పరబ్రహ్మ
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ – నన్ను నమ్ముకున్నవారిని నవ్వులపాలు కానివ్వను
- శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్ ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత మొదటి అనుభవం
- బాబాయే తన భక్తుని మొర విని సమస్యను పరిష్కరించారు
- దొంగల బారినుండి తన భక్తుని, బాబా కాపాడిన లీల–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments