షిరిడీ తోటలోని వాటర్ ఫాల్ లో సాయి దర్శనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

షిరిడీ తోటలోని వాటర్ ఫాల్ లో సాయి దర్శనం

సాయి భక్తులారా ! ఈ రోజు నెల్లూరునించి సుకన్య గారు పంపిన బాబా దర్శనం అందిస్తున్నాను.

బాబా ఎపుడూ చెబుతూ ఉండేవారు, సబ్ కా మాలిక్ ఏక్ హై అని. అది అక్షరాలా నిత్య సత్యం. అంటే దాని అర్ధం మీరు భగవంతుడిని (సాయి) ని వినాయకునిగా తలిస్తే ఆయన వినాయకుడు, సుబ్రహ్మణ్యేస్వరునిగా తలిస్తే ఆయన సుబ్రహ్మణ్యేస్వరుడు, జీసస్ గా తలిస్తే జీసస్, అల్లా గా తలిస్తే అల్లా.

సాయి మతాలన్నిటికీ అతీతుడు.  మీది ఏమతమైనా గానీ, మీరు ఏ విధంగా పూజించినా గానీ మీ ప్రార్థనలన్నీ కూడా ఆయనకి చేరతాయనడంలో ఎటువంటి సందేహము లేదు.

బాబా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. యిందు గలడందు లేడని సందేహము వలదు. బాబా లేని ప్రదేశాన్ని మనం చూపించలేము. ఆయన సర్వత్రా నిండి ఉన్నాడు. సర్వాంతర్యామి. దానికి సాక్ష్యమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రింద ఇవ్వబడిన ఫొటో.

ఈ ఫోటో షిరిడీలో ఒక సాయి భక్తుడు షిరిడీ గార్డెన్ కాంప్లెక్స్ తోటలో ఉన్న వాటర్ ఫాల్ ని తన సెల్ కెమెరాలో తీసినప్పుడు కనిపించిన దృశ్యము. కొంతమంది సాయి భక్త బృందం షిరిడీ వెళ్ళి అక్కడి వాటర్ ఫాల్ ని ఫొటోలు తీసినప్పుడు ఒక ఫోటోలో బాబా వాటర్ ఫాల్ లో కనిపించారు. సాయి ఎప్పుడూ,  ఎల్లప్పుడూ  మనతోనే ఉంటారు, ఉన్నారు.

సాయిని చూచిన కనులే కనులు, సాయిని ప్రార్థించిన మనసే మనసు, సాయిని గానం చేసిన గానమే గానము, సాయిని పూజించిన కరములే కరములు, సాయి లీలలను విన్న కర్ణములే కర్ణములు, సాయి లీలలను చరిత్రను చదివిన బ్రతుకే ధన్యము.

సాయి భక్తులందరికీ, మరియూ, ఈ అద్భుత దృశ్యాని వీక్షించే అవకాశాన్నిచ్చిన సుకన్య గారికి బాబా వారి అనుగ్రహము లభించుగాక!

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles