కెనడాలో సాయిధామం లో బాబా దివ్య దర్శనం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కెనడాలో సాయిధామం లో బాబా దివ్య దర్శనం

2014 సంవత్సరం కెనడాలో  సాయిధామం పరివారందరు కూడా అఖండ రామనవమి ఉత్సవాలను ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు జరుపుకొంటున్నాము.

అదే రోజు మేము వచ్చిన ప్రతివారికి వారం రోజులపాటు ఉదయం అల్పాహారము మధ్యాహ్న్నం భోజనాలు ఏర్పాటు చేశాము.

బాబా వారు చెప్పిన ప్రకారం ఎవరూ కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడనే సూత్రాన్ని పాటించి అందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశాము.

ఆరోజు కార్యక్రమమంతా కూడా చాలా బాగా జరిగింది.   శేజ్ ఆరతి పూర్తవగానే బాబా ముందు ఉన్న రెండు తెరలను వేసేశాము.  ఇక మూడవ తెర దించుతుండగా కొంతమంది భక్తులు తెర దించవద్దని చెప్పారు.

శుభ్రా ముఖర్జీ అనే భక్తురాలితో గోడపై బాబా సజీవంగా కనపడుతున్నారని చెప్పారు.  మొట్టమొదటగా చూసిన వ్యక్తి నవీన్.  మొదటగా అది తన భ్రమేమో అనుకున్నాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.

తనప్రక్కనే ఉన్న ఇద్దరు భక్తులతో వారికి కూడా బాబా కనిపిస్తున్నారా అని అడిగాడు.  వాళ్ళు కూడా తమకి బాబా కనిపిస్తున్నారని చెప్పారు.

ఆర్గనైజేషన్ కో-ఫౌండర్ అయిన శుభ్రా ముఖర్జీ తో అదే విషయాన్ని చెప్పారు.  ఆమె ఇక మూడవ తెరను దించడం ఆపివేసి అక్కడున్నవారందరికి బాబా ని చూసే అదృష్టాన్ని కల్పించారు.

ఆరోజు రాత్రంతా భక్తులందరూ వేకువజాము 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు.  మరుసటి రోజు కూడా బాబా గారు కనిపించారు.

ఇక్కడ కెనడాలో  సాయిధాం లో బాబా వారు సజీవంగా కనిపించారు. ఈ సంఘటనను తోటి భక్తులందరికీ కూడా పంపించి వారందరికి బాబా అనుగ్రహం కల్పించమని కోరుతున్నాము.

(కెనడా సాయిధామం లో బాబావారి దర్శనం  చిత్రంలో చూడవచ్చు)

 జై సాయిరాం
శుభ్రా ముఖర్జీ
ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles