Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీ షిరిడీసాయి వైభవమ్ – పూర్ణబ్రహ్మ – పరబ్రహ్మ
బాబా తనకు ప్రతిరోజు దక్షిణగా వచ్చిన సొమ్ములోనుండి రూ.800/- ఇంకా ఎక్కువగా కూడా అందరికీ పంచిపెట్టేస్తూ ఉండేవారు. ఆఖరికి ఆయన వద్ద కొద్ది నాణాలు మాత్రమే మిగిలి తిరిగి సాయంత్రానికల్లా ఫకీరయిపోయేవారు. ఆయన దాతృత్వం గురించి సాధులకు, జ్ఞానులకు, భజనలు, పాటలు పాడేవారందరికి నలుదిశలా వ్యాప్తి చెందింది.
కొంతమంది బ్రాహ్మలు కుంభకోణం నుండి బొంబాయి వచ్చి వేదాంతంమీద ఉపన్యాసాలను ఇస్తూ, దాని వల్ల వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి బాబా కీర్తి, దాతృత్వం, ఆయన భారీగా ఇచ్చే సంభావనల గురించి తెలిసింది. బాబా నించి ఎక్కువ మొత్తంలో ధనం సంపాదించ వచ్చనే ఆశతో షిరిడీ వద్దామనుకున్నారు. కాని వారు బాబా ఒక ముస్లిమ్ అవలియా అని భావించారు. అందుచేత ఆయనకి నమస్కారం చేయడమెలాగా, అంతే గాక ఆయనకి వేదాంత సారం గురించి ఏవిధంగా వివరించగలమని వారిలో ఒక పెద్ద చిక్కు ప్రశ్న తలెత్తింది. వారిలో వారే సంప్రదించుకొని పూర్ణబ్రహ్మకు ఏవిధంగా నమస్కరిస్తామో ఆవిధంగానే ఆయనకు నమస్కరించి ఎంతో ధనం స్వీకరించవచ్చని తలిచారు. వారంతా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని ఆయన ముందు వినయంగా నిలబడ్డారు. బాబా ఒక్కసారి వారివైపు చూసి మీకేమి కావాలని అడిగారు. “మీ సమక్షంలో వేదాంతాన్ని గురించి వ్యాఖ్యానం చెప్పి మీనుండి సంభావన పొందుదామనే ఉద్దేశ్యంతో వచ్చాము” అన్నారు. బాబా ‘అలాగా! అయితే సరే మరి ప్రారంభించండి” అన్నారు. వెంటనే వారు ఎంతో అత్యుత్సాహంతో వేదాంతం గురించి చెప్పడం మొదలు పెట్టారు. కాని ఆ వెంటనే తామేమి చెప్పదలచుకున్నారో అంతా మర్చిపోయారు. ఎంత ప్రయత్నించినా నోటంబట ఒక్క అక్షరం ముక్క బయటకు రావటల్లేదు. బాబా కొంత సేపు ఓపికగా ఎదురు చూసి మొదలు పెట్టండి అన్నారు. వారు బాబా వైపు తెల్లమొహం వేసుకుని చూశారు. తమ శాయశక్తులా ఎంత ప్రయత్నించినా తరువాత చెప్పదలచుకున్నది అస్సలేమీ గుర్తుకు రాలేదు. వారెక్కడయితే చెపుతూ ఆగిపోయారో, అక్కడినుండి బాబా ప్రారంభించి కొంతసేపు చెప్పారు. ఆ తరువాత ఆ బ్రాహ్మణులు పూర్తి చేశారు. పూర్తయిన తరువాత ఆయనకు నమస్కరించేటప్పుడు ఆయనని పూర్ణబ్రహ్మ అని సంబోధించి, నమస్కారం చేస్తున్నది బాబా కు కాదు పూర్ణబ్రహ్మకు నమస్కారం చేస్తున్నాము అనే భావంతో తలవంచి నమస్కరించారు. తరువాత వారు బాబా నుండి సంభావన ఎప్పుడు తీసుకుందామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అపుడు బాబా వారితో “మీరు పూర్ణ బ్రహ్మకే నమస్కారం చేశారు కాబట్టి మీకు సంభావన కూడా ఆ పూర్ణబ్రహ్మే ఇస్తాడులే” అన్నారు. బాబా నుండి ఈ సమాధానం విని ఆశ్చర్యపడి వారు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా వారికి సంభావన ఇచ్చారు. వారు ఎంతో తృప్తిగా సంభావనందుకుని వెళ్ళారు. బాబా పూర్ణబ్రహ్మకంటే అధికులు. వాస్తవానికి ఆయన పరబ్రహ్మ.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ తన భక్తుని బాధను బాబా అనుభవించుట
- శ్రీ షిరిడీసాయి వైభవమ్ – నన్ను నమ్ముకున్నవారిని నవ్వులపాలు కానివ్వను
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్ ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత మొదటి అనుభవం
- శ్రీషిరిడీ సాయి వైభవమ్ – నిర్ణయాధికారి బాబాయే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments