శ్రీషిరిడీ సాయి వైభవమ్ – నిర్ణయాధికారి బాబాయే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీషిరిడీ సాయి వైభవమ్ – నిర్ణయాధికారి బాబాయే

బాపూ సాహెబ్ జోగ్ తన భార్య బంధువుకి 1,400/- రూపాయలు అప్పుగా ఇచ్చాడు.  అ రోజుల్లో అతనికి నెలకు 2,000/- రూపాయలు జీతం లభిస్తూ ఉండటం వల్ల అప్పు ఆనందంగా ఇచ్చాడు.  అసలుకు ఎంత వడ్డీ ఇవ్వాలన్న విషయాలన్నీ లెక్కలు వేసుకున్నారు.  కాల చక్రం తిరిగిపోతున్నా అప్పు పుచ్చుకున్న బంధువు నుండి మాటా మంతీ ఏమీ లేవు.

ఇలా ఉండగా జోగ్ పదవీ విరమణ చేశాడు.  జోగ్, అతని భార్య ఇద్దరూ షిరిడీ వచ్చి అక్కడే స్థిరపడ్డారు.  జోగ్ బాబాకు అత్యున్నతమైన పూజలు,  సేవలు  చేసుకుంటూ ఉండేవాడు.  జోగ్ గురించిన ప్రస్తావన సత్ చరిత్రలో అనేక చోట్ల తెలపబడింది.  ముఖ్యంగా మనకి శ్రీ సాయి సత్ చరిత్ర 37వ.అధ్యాయం చావడి ఉత్సవంలో మనం చూడవచ్చు.

జోగ్ తన బంధువుకు అప్పు తీర్చవలసిందిగా ఉత్తరం వ్రాశాడు.  కాని అతని వద్ద నుండి ఎటువంటి సమాధానం రాలేదు.  ఇక ఆఖరికి అతని వద్దకు స్వయంగా వెళ్ళి అడిగినా ఇచ్చిన అప్పు వడ్డీతో సహా వసూలు కాకపోతే, కోర్టులో కేసువేద్దామనే ఉద్దేశ్యంతో, దానికి అనుమతి కోరదామని బాబా వద్దకు వెళ్ళాడు.  అప్పుడు బాబా “డబ్బెక్కడికి పోతుంది?  అది నీ ఇంటి తలుపు తట్టి మరీ వస్తుంది.  ఎందుకంత తొందర” అన్నారు.  బాబా మాటలకి జోగ్ నిరాశపడి ఇలా అన్నాడు “ 12 నుండి 14 సంవత్సరాలు గడిచిపోయాయి.  కాని, అతని వద్దనుంచి ఒక్క పైసా కూడా రాలేదు.  ఇప్పుడు అతను  నాఇంటికి వచ్చి ఇచ్చిన అప్పు తీరుస్తాడా”.

జోగ్ మాటి మాటికి ఇదే విషయాన్ని బాబాని అడుగుతూ ఉండేవాడు.  బాబా సమాధానం కూడా ఎప్పటిలాగే ఉండేది.  ఇక తను ఇచ్చిన అప్పు ఎప్పటికీ తిరిగి రాదని తనకు తానే సమాధాన పరచుకుని మిన్నకుండిపోయాడు.  కొన్ని రోజుల తరువాత అప్పు తీసుకున్న అతని బంధువు ఇద్దరు స్నేహితులను వెంట బెట్టుకుని షిరిడీ వచ్చాడు.  వారంతా జోగ్ ఇంటికి వెళ్ళారు.  వాళ్ళని చూసి జోగ్ చాలా ఆశ్చర్యపోయాడు.  అతని బంధువు అసలు 1,400/- రూపాయలు తీసుకుని వచ్చాడు.  కాని వడ్డీ మాత్రం తీసుకుని రాలేదు.  అందుచేత అతను జోగ్ భార్య సహాయం తీసుకోదలచాడు. తను వడ్డీ ఇవ్వలేనని, అసలును తీసుకుని తనను ఋణవిముక్తుణ్ణి  చేయమని జోగ్ తో చెప్పి ఒప్పించమని ఆమెని అభ్యర్ధించాడు.  మొదట జోగ్ భార్య ఈ విషయంలో కల్పించుకోవడానికిష్టపడలేదు.  కాని అతను జోగ్ భార్యని సహాయం చేయమని బ్రతిమాలాడు.  అతనితో వచ్చిన స్నేహితులు కూడా, వడ్డీ అడగకుండా అసలు తీసుకోమని జోగ్ ని వేడుకొన్నారు.  కాని జోగ్ వడ్డీ వదలుకోవటానికి ఇష్ట పడక వడ్డీతో సహా ఇవ్వలసిందే అని మొండి పట్టు పట్టాడు.  ఆఖరికి వాళ్ళిద్దరూ బాబా వద్దకు వెళ్ళి ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉండటానికి నిర్ణయించుకున్నారు.  వారు ద్వారకామాయికి వెళ్ళి బాబా కి అంతా వివరించి చెప్పారు.  బాబా జోగ్ తో అసలు తీసుకోమని చెప్పారు.  బాబా చెప్పినదానికి జోగ్ అంగీకరించాడు.   ఇచ్చిన అప్పే అసలు తిరిగి రాదనుకుంటే వడ్డీ రాకపోయినా అసలు వచ్చిందని తృప్తి పడి,  ఇక కోర్టుకేసులు, దాని వల్ల వచ్చే తలనొప్పి వ్యవహారాలన్నీ తప్పిపోయినందుకు సంతోషపడి తన బంధువుని ఋణవిముక్తుడిని చేశాడు.  వసూలయిన  మొత్తమంతా బాబా చేతిలో పెట్టాడు.  బాబా కొద్ది మొత్తం మాత్రం తీసుకుని మిగిలినది జోగ్ కి ఇచ్చారు.

*******

ఈ వైభవాన్ని చదివిన పాఠకులకి అనుమానం  వచ్చి ఉండవచ్చు.  ఈ వైభవంలో బాబా వారి లీల , చమత్కారం ఏమి ఉన్నాయని.  నాకు వచ్చిన ఆలోచన మీముందు ఉంచుతాను.  జోగ్, అతని స్నేహితుడు బాబా ఏది చెప్పినా  ఆయన  మాట జవదాటకుండా దానికే కట్టుబడి ఉందామనుకున్నారు.  బాబా అసలు మాత్రమే తీసుకోమని చెప్పగానే జోగ్ ఏమాత్రం బాధ పడకుండా వెంటనే అసలు తీసుకోవడానికి సంతోషంగా అంగీకరించాడు.  14 సంవత్సరాలుగా ఎదురు చూసినా వసూలుకాని డబ్బు బాబా దయ వల్ల అయన చెప్పినట్లే ఇంటి తలుపు తట్టి మరీ వసూలయింది.  తరువాత వసూలయిన మొత్తమంతా బాబా చేతిలో పెట్టాడు.  బాబా చాలా కొద్ది మొత్తం తను  ఉంచుకుని, ఇచ్చిన మిగతా సొమ్మును ఆనందంగా తీసుకున్నాడు.  ఇక్కడ మనం గ్రహించుకోవలసినది మన సద్గురువు అయిన మన బాబా మీద అచంచలమయిన భక్తి, విశ్వాసం ఉన్నపుడె మనం ఆనందంగా జీవిస్తాము.  మనకేది మంచిదో ఆయనకు మాత్రమే తెలుసు.  జోగ్  కి బాబా మీద అంత భక్తి ప్రపత్తులు ఉన్నాయి కాబట్టే బాబా అనుగ్రహాన్ని పొందాడు. మనకేది కావాలో ఆయనకే బాగా తెలుసు.  సాయి భక్తులందరూ బాబా మీద ప్రగాఢమయిన భక్తిని నిలుపుకుంటే మన యోగక్షేమాలు ఆయనే చూస్తారు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles