Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణి గారు మరొక అద్భుతమైన అనుభవాన్ని పంపించారు. మనసులో అనుకున్న వెంటనే బాబా ఆమె అనుకున్న దానిని ఏ విధంగా నెరవేర్చారో చూడండి. బాబా మీద అచంచలమయిన భక్తి, ప్రేమ ఉంటే చాలు ఆయన అనుగ్రహిస్తారు. కఠిన ఉపవాసాలు చేయనక్కరలేదు, నాకు షోడశోపచారాలతో పూజలు చేయనక్కరలేదు కేవలం భక్తి ఉంటె చాలునని చెప్పారు. ఇక్కడ మనం గ్రహించవలసినది, పూజలు అక్కరలేదంటే, మనకి సమయం ఉన్నా పూజలు చేయకుండా, ఖాళీగా కూర్చుని భక్తితో సాయిరామ్ సాయిరామ్ అని అనుకోమని కాదు. పూజలు చేసే సమయం ఉన్నప్పుడు భక్తితో పూజలు చేయాలి. సమయం కుదరనప్పుడు భక్తితో ఒక పుష్పం సమర్పించి మనస్పూర్తిగా ఆయనని భక్తితో వేడుకోవాలి. ఆయ్యో ఆయనకి నేననుకున్నట్టుగా సేవ చేయలేకపోయానే అని మనసుకి బాధ కలిగినప్పుడు ఆయన మన మనోవేదనని ఏవిధంగా దూరం చేస్తారో మనం ముందర గ్రహించలేము. గ్రహించుకున్న తరువాత బాబా ఎంత దయాళువో మనకి అర్ధమయి ఆయన మీద మనకి ప్రేమ, భక్తి రెట్టింపు అవుతుంది.
శ్రీమతి కృష్ణవేణిగారికి ఈ అనుభవం 2016, ఏప్రిల్ ఒకటవ తారీకున జరిగింది. ఆవిడ పంపిన అనుభవాన్ని యధాతధంగా అందిస్తున్నాను.
ఈ రోజు రాత్రికి చపాతీలు చేశాను. మొదటి చపాతీ బాబాకు పెడదామనుకున్నాను. కాని, పెద్ద పాప ఆకలిగా ఉందని అడగటంతో మర్చిపోయి పాపకు చపాతీ తినిపించేశాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. అయ్యో ! మొదటి చపాతీ బాబాకు పెట్టెలేదే అని బాధ పడ్డాను. అపుడు మనసులో ఇలా అనుకున్నాను. “మీకు ముందుగా చపాతీ నైవేద్యం పెట్టడం మర్చిపోయి పాపకు తినిపించేశాను. కాని మీరు, మేము తినే ముందుగా చపాతీ ఎలా తింటారో చూడాలని ఉంది”.
ఇంతలో మా ఇంటికి మా మామయ్య గారి స్నేహితులు వచ్చారు. ఆయన సాయి భక్తులు. ఆయన మా మామయ్యగారితో మాట్లాడుతూ కూర్చున్నారు. మా అత్తగారు చపాతీలు తీసుకుని వచ్చి టిపిన్ తినండి అనగానే ఆయన చపాతీ తిన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏమీ తీసుకోరు మంచినీళ్ళు తప్ప. అలాంటి ఆయన టిఫిన్ తీసుకోండి అని అడిగిన వెంటనే తనడం ఆశ్చర్యమే కదా. ఆయన కేవలం ఒక్క చపాతీ మాత్రమే తిన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడూ మొదటి చపాతీ మాత్రమే బాబాకి నైవేద్యంగా పెడుతున్నాను. కనక మా అత్తగారు అడిగిన వెంటనే ఒక్కటి మాత్రమే చాలు అన్నారు. అది కూడా ఆయన మేము తినబోయే ముందు బాబా గారి రూపంలో వచ్చారు. ప్రొద్దుటే మా అత్తగారు “రాత్రి ఆయన చపాతీ తినడం చాలా ఆశ్చర్యంగా ఉంది” అన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా 5 లేక 10 నిమిషాలు ఉంటారు. ఒక్కొక్కసారి బయటి నుండే పలకరించి వెళ్ళిపోతారు. చాలా మొహమాటస్థులు. సాయంత్రం 6 గంటలకే వచ్చారు. మా మామయ్యగారితో మాట్లాడుతూ కూర్చున్నారు. మా అత్తగారు యోగా క్లాసులకి వెళ్ళారు. ఆయన రాత్రి 8.30 వరకు ఉన్నారు. మా అత్తగారు రాగానే టిపిన్ తింటారా అని అడిగారు. ఆయన ఒక్క చపాతీ మాత్రమే తిన్నారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి పాము, కుక్క రూపాలలో దర్శనం
- చెక్కు కనపడలేదు అన్న బాధలో ఉన్న నాకు…. బీరువాలో గులాబీ రంగు ఫైలులో 6 వ పేజీలో చూడు అని చెవిలో చెప్పిన బాబా వారు…. G. A రాజ్యలక్ష్మి
- మూలాన్ని చూడు…. మహనీయులు – 2020… సెప్టెంబరు 7
- బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio
- నిజ జీవితంలో బాబా లీలలు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments