Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: సరిత
నివాసం: హైదరాబాద్
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ !
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా !
భావము: నీవే తల్లి, తండ్రి, బంధువు, సఖుడవు; నీవే విద్య నీవే ధనము
సాయిరాం…
నా పేరు సరిత. నేను మరో అద్భుతమైన లీలను మీ ముందుకు తేస్తున్నాను. ఈ లీల ద్వారా బాబా తన లీలామృతంను ఆస్వాదించమని మనకు అందిస్తున్నారు. సాయి బంధువులరా ఆ అమృతాన్ని ఆస్వాదించండి.
28 డిసెంబర్, 2008న ప్రొద్దున లేచి ఇల్లంతా శుభ్రపరచి బాబాకు పంచామృతంతో అభిషేకం చేసి, వేడివేడి పొంగల్ చేసి బాబాకు నైవేద్యంగా సమర్పించడం, దయగల బాబా పొంగలిని అయిదువేళ్ళతో తీసుకోవడం, వేళ్ళ గుర్తులను చూసి చాలా ఆశ్ఛర్యపోవడం జరిగింది.
మధ్యాహ్నం భోజనం పెట్టగా భోజనం తీసుకోవడం. నీళ్లు పెట్టగా గ్లాస్ ఖాళీ అవ్వడం, ఎక్కడ బాబాకు ఏది పెట్టి నా వేళ్ళ గుర్తులు కనిపించడం నిజంగా ఆ బాబా వారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయనే ఆనందం కలిగింది.
అలాగే అదేరోజు సాయంత్రం కలకండ ప్రసాదంగా పెట్టి నామజపం చేసి హారతి ఇవ్వగా కలకండ ముక్కను రుచి చూడడం అవధుల్లేని ఆనందాన్ని కలిగించింది.
తరువాత చపాతీ నైవేద్యంగా పెట్టగా చపాతీ కూడా బాబా గారు నైవేద్యంగా స్వీకరించడం జరిగింది. బాబా మీ చల్లని నీడలో మమ్మల్ని సేదతీరనివ్వండి.
బాబా మీ రాకతో మాఇల్లు పావనం అయింది.నీ ప్రేమను అందరం పొందేట్లు చేయండి.
బాబా నా బాధ్యతలు కూడా నీకు అప్పచెప్పాక, నాకు గాలిలో తేలినట్లుగా ఉంది.
ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. నీ ప్రేమ ముందు ఈ ప్రపంచం అంతా పిచ్చాసుపత్రి వలె కన్పిస్తుంది.
ఈ జన్మకు ఇది చాలు బాబా అని వేడుకున్నాను. ఇలా బాబా నేను పెట్టిన నైవేద్యం స్వీకరించి మరోసారి తన ఉనికిని చాటుకున్నారు.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“నన్నే త్రికరణశుద్ధిగా స్మరించే వారి యోగక్షేమాలు, నేను కనిపెట్టుకుని ఉంటాను”.
Latest Miracles:
- నా జీవితంలో 9 సంఖ్యతో బాబా యొక్క ఉనికి
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- బాలాజీ గారి జీవితంలో బాబా ప్రవేశం–Audio
- నిజ భక్తుల కోసం బాబా స్వయంగా వ్యక్తమవుతారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “నిజ జీవితంలో బాబా లీలలు”
maruthi
May 23, 2019 at 7:08 am“బాబా నా బాధ్యతలు కూడా నీకు అప్పచెప్పాక నాకు గాలిలో తేలినట్లుగా వుంది. ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా వుంటున్నాను” అనే ఈ పై బాబావారి లీలలోని మీ మాటలు … బాబాగారికి మన బాధ్యతలు అప్పగించాక ఎంత ఆనందంగా ఉండొచ్చో తెలుస్తుంది. Thank you mam.