Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అహ్మదాబాద్ నివసితులైనా శ్రీ చందూలాల్ మరియు శ్రీమతి చందూలాల్ కి బాబా స్వయంగా వ్యక్తమయి అందించిన సహాయం
1953 ఫిబ్రవరి నెలలో నా భార్య శ్రీమతి. మనుబాయ్ తన స్నేహితులతో కలిసి తెర్కాన్ భువన్ లో ఉన్న శ్రీ సాయిబాబా మందిరానికి వెళ్ళింది. ఆమె స్నేహితులు కులం, మతం, మతాచారలతో సంబంధం లేకుండా బాబా తన భక్తుల కోరికలను నెరవేరుస్తారని ఆమెతో చెప్పారు.
మరుసటి గురువారం, నా భార్య మా చిన్న కుమారుడు ఒక కొబ్బరికాయ తీసుకోని సాయంత్రం ఆరతి సమయంలో అదే మందిరానికి వెళ్ళారు. ఆరతి తరువాత ఆలయం పూజారి వివిధ రకాల ఆహార పదార్థాలను కలిగి ఉండే ప్రసాదాన్నిపంపిణీ చేశారు.
నా భార్య కొన్ని వేరుశనగ గింజలను ప్రసాదంగా అందుకుంది; కానీ కొందరు పేఢాలు ప్రసాదంగా పొందారు కనుక ఆమె సంతోషంగా లేదు. ప్రత్యేకించి కొందరు ఎంపిక చేయబడ్డ వారికీ మాత్రమే పేఢాలు ఇవ్వడం జరిగిందని ఆమె అనుకుంది.
తరువాత ఆమె కవీశ్వర్ పోల్ నాకా మీదగా ఇంటికి తిరిగి వస్తుండగా ఒక తెలియని వ్యక్తి తన చేతిలో ఒక సంచితో ఆమెను కలిసి, “మీ భర్త ఈ ప్రసాదం పంపాడు. దయచేసి మీ సంచిలో ఉంచండి!” అని అతను ఆమె సంచిలో ప్రసాదము పెట్టి, అతను వెళ్ళిపోయాడు.
ఆ సమయంలో నేను ఆఫీస్ లో ఉన్నాను. నేను ఇంటికి చేరినప్పుడు, నా భార్య నేను తెలియని వ్యక్తి ద్వారా పంపిన ప్రసాద్ గురించి చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను, నాకు దాని గురించి ఏమీ తెలియలేదు. నా భార్య యొక్క కోరికను నెరవేర్చడానికి అది బాబా చేసిన లీలా అని మేము గ్రహించాము. ఈ సంఘటన తర్వాత మేము సాయి భక్తులు అయ్యాము.
1948 లో, నేను మా అన్నయ్య శ్రీ నవీన్ ఎం. మెహత వివాహాన్ని జరిపించాను, దీనికి నేను రూ. 50,000 / – అప్పు తీసుకున్నాను. ప్రతి నెల నా జీతం నుండి కొంత అప్పు తిరిగి చెల్లిస్తూ ఉన్నాను. అతనికి సంపాదన లేని కారణంగా ఎవరూ వారి కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా లేరు. అందువలన అతను నాకన్న ముందు వివాహం చేసుకోలేదు.
నా భార్యకు గుజరాతీ జన్సట్టా వార్తాపత్రికలో క్రాస్వర్డ్ పజిల్ పరిష్కరించడము అలవాటు. 1953 ఏప్రిల్ లో ఆమె 6వ నెంబర్ పజేల్ ను పరిష్కరించింది. ఎప్పటిలాగే ఆ సమయంలో నేను తీసుకున్న 50 రూపాయల అప్పుకి ఆ నెల రూ. 3,333 / – చెల్లించాల్సి ఉంది. బాబా యొక్క దయ వలన నా భార్యకు ఆ పజేల్ ద్వారా ఒక రూపాయి ఎక్కువ గాని, తక్కువ గాని కాకుండా సరిగ్గా రూ. 3,333 / – బహుమతి వచ్చింది. నా ఋణం నుండి నాకు ఉపశమనం కలిగించడానికి శ్రీ సాయిబాబా చేసిన అద్భుతం కాదూ ఇది?
1953 భాద్రపదమాసములో నా తండ్రి మరియు మామయ్యల ఇద్దరి సంవత్సరికం ఒకే రోజున వచ్చాయి. నేను ఆఫీస్ కి హాజరు కావలసి ఉండటం వలన, నా అత్తయ్య గారి ఇంటికి నేను ఆ రోజున వెళ్ళలేకపోయాను. నా పిల్లలు స్కూల్ లో ఉన్నారు. సుమారు సాయింత్రం 4 గంటలకు మా మామయ్యగారి పోలికలతో ఉన్న ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి, నా భార్యకు ఒక ఖాకీ రంగులో ఉన్న బ్యాగ్ ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆ బ్యాగ్ లో కొన్ని కూరగాయలు, ఊధి మరియు రూ. 1.25 / – ఉన్నాయి. నేను ఇంటికి వచ్చిన తరువాత నా భార్య నాకు ఈ విషయం చెప్పింది. 1950 లో జైపూర్ లో చనిపోయిన మా మామయ్యగారు 1953 లో అహ్మదాబాద్ లో ఉన్న మా ఇంటిని ఎలా సందర్శించగలరని నేను ఆశ్చర్యపోయాను! ఇది బాబా యొక్క అద్భుతమైన లీలా కాదు కదా? అనుకున్నాను.
1954లో నేను నా కుటుంబంతో ఒక రోజు షిర్డీ లో ఉండి తిరిగి వచ్చేయాలని ఉద్దేశ్యంతో షిర్డీ వెళ్ళాను. కానీ భారీ వర్షాల కారణంగా నేను షిర్డీలో మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. నేను అహ్మదాబాద్ తిరిగి వచ్చిన తర్వాత, బాబా యొక్క సన్నిహిత భక్తుడైన సాయి శరణానంద గారిని కలుసుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. నేను అప్పుడప్పుడు ఆయన్ని సందర్శిస్తూ త్వరలోనే ఆయనకీ ధృడమైన భక్తుడిని అయ్యాను. నా భార్య స్వామిజీకి రోజు భిక్షా (ధర్మం) ఇచ్చేది.
శ్రీ చందూలాల్ మరియు శ్రీమతి చందూలాల్ గార్ల మరికొన్ని అనుభవాలు రేపు ….
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- తమ భక్తుల షిర్డీ రాకకై తామే స్వయంగా టికెట్లు అందించిన అద్భుత లీల
- సాయిబాబా వారి భక్తుల కోసం పరిగెత్తుకు వచ్చారు
- భక్తుల పట్ల బాబాకు ఉండే ప్రేమపూర్వకమైన శ్రద్ధ
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నిజ భక్తుల కోసం బాబా స్వయంగా వ్యక్తమవుతారు”
Maruthi
August 9, 2017 at 11:04 amSaiBaba…SaiBaba