భక్తుల పట్ల బాబాకు ఉండే ప్రేమపూర్వకమైన శ్రద్ధ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

నా భార్య 43సంవత్సరాల వయస్సులో తల్లి కానున్నది. అప్పుడు మేము విజయనగరంలో ఉన్నాము. ఒక్కసారి ఒక డాక్టర్ దగ్గరకి వెళ్ళడం తప్ప, నాకు వైద్యసంబంధమైన ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మేము ఎవరిని సలహాకోసం సంప్రదించల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించలేదు. బాబా ఎప్పుడూ తన భక్తుల సంక్షేమం కోసం అప్రమత్తంగా ఉంటారు అవసరమైనప్పుడు సహాయం అందిస్తారు అని మా దృఢ విశ్వాసం.

ఆగస్టు చివరినాటికి, నా భార్యకు కాన్పు నొప్పులు మొదలైయ్యాయి. నొప్పులు రోజు రోజు కి పెరుగుతూ  4 నుండి 5 రోజులు గడిచింది. అయినప్పటికీ, వైద్య సలహా కోరడం అవసరమనే ఆలోచనే మాలో ఎవరికి రాలేదు. కాన్పు సమయానికి మాత్రమే నేను ఒక మంత్రసానిని పిలిచాను. మూడు గంటల కంటే ఎక్కువ సమయం నొప్పులుతో భాదపడిన తరువాత నా భార్య ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది .

అంత కష్టం మీద గండం గడిచినందుకు మేము బాబాకు కృతజ్ఞత చెప్పుకున్నాము. అంతలోనే మంత్రసాని గర్భంలో మరొక బిడ్డ ఉందని బాంబు వేసింది. నా భార్యకు అది నాలుగవసారి గర్భం అందువలన మేము కవలల గురించి కలగనలేదు. మేము ఎటు తోచని స్థితిలో పడ్డాము. మేము ఒకసారి సంప్రదించిన వైద్యుడు కూడా కవలలు పుట్టే అవకాసం ఉందని ఏమి చెప్పలేదు.

అప్పటికే నా భార్య పురిటి నొప్పులు భరించి భరించి నిరాశ చెంది ఉంది. మళ్ళి కాన్పు అంటే ఇక నేను బ్రతకను అని అన్నది. కొత్తగా జన్మించిన శిశువుకు హాజరైన తర్వాత మంత్రసాని మరో బిడ్డ జన్మించడానికి మరొక ఆరు లేదా ఏడు గంటలు తరువాత మాత్రమే కుదురుతుంది అందువలన నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. నేను పూర్తిగా కలవరపడ్డాను. పొరుగు వారు మినహాయించి ఇంట్లో ఏ ఇతర సహాయం లేదు.

అప్పుడు నా భార్య నన్ను పిలిచి బాబా ఊధి అడిగింది. అది విని నేను యెంత తెలివి తక్కువ వాడిని నాకు అసలు ఆలోచన రాలేదు అనుకున్నాను. వెంటనే షిర్డి నుండి చాలా దూరంలో ఉన్న నానా సాహెబ్ చందోర్కర్ కుమార్తె కాన్పు నొప్పులు పడుతున్నపుడు బాబా ఊధితో బాపుగిర్ ను ఎలా పంపించారు?  ఆ ఊధి వలన ఆమె వెంటనే తన బిడ్డను సులభంగా ప్రసవించిన బాబా లీలను ఆమెకు చెప్పాను. 

అప్పుడు గొప్ప ఆశతో,  ధైర్యం తో, నేను ఊధి మంత్రసానికి ఇచ్చి నా భార్య నోటిలో వేయమని, అలాగే ఆమె గర్భంపై పూయమని చెప్పాను. ఆమె అలానే చేసింది. అప్పుడు అద్భుతం జరిగింది. దాదాపు ఒక క్షణకాలంలో కనిపించని చేతులతో ఆమె గర్భంపై ఎవరో నిదానంగా ముందుకు తోస్తున్నట్లుగా అనిపించి వెంటనే రెండవ బిడ్డ జన్మించింది.

ఇంతకన్నా మరేమీ రుజువు కావాలి, తన భక్తుల పట్ల బాబాకు ఉండే ప్రేమపూర్వకమైన శ్రద్ధను వివరించడానికి.

source: DIVINE MIRACLES OF SHRI SHIRDI SAI BABA – DR.P.S.RAMASWAMI

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles