Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఒకప్పుడు బాబా భీష్మను “ఐదు లడ్డులు ఇవ్వాలి” అని అడిగారు. అతనికి ఏమి అర్ధం కాలేదు. మరుగోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లుబికి వెంటనే రెండు పాటలు వ్రాసారు. కాని ఆ పై ఒక్కటి గూడా నడవలేదు. వాటిని బాబాకు సమర్పించగానే అతనినే పాడి విన్పించామన్నారు. అతడు పాడక అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు.
అతనికి మళ్ళి స్పుర్తికలిగి మరి మూడు పాటలు వ్రాసి ఆయయ్నకు వినిపించారు. అవే మొదటి షిర్డీ హారతులు. సాయి ఇలా కోరి, తమ తపశ్శక్తి దారపోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగణు, మాధవ్ లు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిర్డీ ఆరతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకోవడం ఎంతో శ్రేయస్సుకరం.
ఈ ఆరతి పాటలతో శ్రీ సాయినాథ సగుణోపాసన పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకంలో శ్రీ సాయిబాబాకి చెందిన ఆరతులలో పాడుతున్న పాటలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్ర పుష్పమ్, శ్రీ లక్ష్మీఅష్టోత్తరం వంటి హిందూ మత సంప్రదాయాల నుండి కొన్ని సంప్రదాయ శ్లోకాలు ఉన్నాయి. భక్తుల రోజువారీ ఆరాధన కోసం శ్రీ జి.ఎస్.ఖపర్దే 1922 వరకు ప్రచురణ యొక్క అన్ని ఖర్చులను భరించారు. బాబా
మహాసమాధి తరువాత, ఈ పుస్తకం సమాధి మందిరంలో అధికారిక ‘ది బుక్ ఆఫ్ డైలీ వర్షిప్’ గా రూపాంతరం చెందింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ 1923 నుండి సవరించిన ప్రచురణను చేపట్టింది.
శిరిడీ ఆరతి పుస్తకంలో మొత్తం ముప్పై పద్యాలు ఉన్నాయి. ఆ ముప్పైలో, కేవలం పదహారు మాత్రమే శ్రీ సాయిబాబా మీద కూర్చబడినవి. వేద శ్లోకం తప్ప మిగిలిన పద్నాలుగు సంప్రదాయ ఆరతిపాటలు మధ్యయుగానికి చెందిన మహారాష్ట్ర కవులు, సత్పురుషులు రచించినవి.
పద్నాలుగు సాంప్రదాయ పాటలలో ఐదు సంత్ తుకారమ్ మహారాజ్; సంత్ నామదేవ్ మరియు సంత్ జానబాయిలు ఒక్కొక్కరు రెండు పాటలు; శ్రీ రామజనార్ధన్ స్వామి మరియు శ్రీ రామేశ్వర్ భట్ ఇద్దరు చెరొక పాట; మిగిలిన మూడింటిలో, ఒక వేద శ్లోకం మరియు రెండు ఇతర సంప్రదాయ ప్రార్థనలు ఉన్నాయి.
శ్రీ సాయిబాబా పై ప్రత్యేకంగా వ్రాయబడిన పదహారు పాటలలో- తొమ్మిది, శ్రీ K.J. భీష్మ రచించినవి, మూడు శ్రీ దాసగణు మహారాజ్ వ్రాయగా మిగిలిన వాటిని శ్రీఉపసాని మహరాజ్, శ్రీమాధవ్ అడ్కర్, శ్రీమోహినిరాజ్ మరియు శ్రీB.V. దేవ్ ఒక్కొక్కటి రచించారు. భాషాపరంగా ముప్పై అరతి పాటలలో ఇరవై ఐదు మరాఠీలో, హిందీలో రెండు, సంస్కృతంలో రెండు మరియు ఒక పాట మరాఠీ, సంస్కృత ద్విభాషా సంపుటిలోని ప్రార్థన ఉన్నాయి.
ఇందులో బాబాను గురించి వ్రాయబడిన 16 పాటలు:
భీష్మ గారు వ్రాసినవి 9 పాటలు:
కాకడారతిలోని
- 3వ పాట ఉఠా ఉఠా శ్రీ సాయినాధ గురు చరణ కమలదావా
- 5వ పాట ఘేఉని పంచారతీ కరూ బాబాంచి ఆరతి.
- 6వ పాట కాకడా ఆరతి కరీతో సాయినాధ దేవా.
- 9వ పాట పభాతసమయీ నభా శుభరవి ప్రభా ఫాకలి.
- 13వ పాట శ్రీ సద్గురుబాబాసాయి.
మధ్యాహ్న అరతిలోనివి
- 3వ పాట జయదేవ జయదేవ దత్తా అవధూత.
శేజహరతి లోనివి
- 4వ పాట జై జై సాయినాధ ఆతాపహుదావేమందిరీ హో.
- 5వ పాట ఆతాస్వామి సుఖే నిద్రా కరా అవధూతా
- 8వ పాట సాయినాధమహారాజ్ అతనా కృపాకరోగురు రాజా. (ప్రస్తుతం ఇది శేజారతి లో లేదు)
దాసగాణు మహారాజు గారు వ్రాసిన 3 పాటలు
- సాయి రహమ్ నజర్ కరనా
- రహమ్ నజర్ కరో అబ్ మోర్ సాయి
- షిర్డీ మాఝే పండరీపుర సాయిబాబా రామావర
ఉపాసనీ మహారాజ్ గారు వ్రాసిన ఒక పాట
- సదాసత్స్వరూపం (1911 లో వ్రాయబడినది)
మాధవ్ అడ్కర్ గారు వ్రాసిన ఒక పాట
- ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవా
మోహిని రాజా గారు వ్రాసిన ఒక పాట
- అనంత తులాతే కసేరేస్తవావే
బి. వి. దేవ్ గారు వ్రాసిన ఒక పాట
- రూసో మమ ప్రియంబికా
ఇతరులు వ్రాసిన 14 పాటలు
తుకారం వ్రాసిన 5 పాటలు
- జోడునియా కర చరణి
- భక్తీచియా పోటీ బోద్ కాకడా జ్యోతి
- శేజారతి లో ఓవాళు ఆరతి మాఝ్యా సద్గురునాధ
- పాహే ప్రసాదా చీవాట
- పావలా ప్రసాద ఆతా విఠో నిజావే
నామదేవ్ ప్రాసిన 2 పాటలు
- ఉఠా పాండురంగా ఆతా దర్శనద్యాసకళా
- ఉఠా ఉఠా సాధు సంత సదా అపులాలేహిత
జానాబాయి వ్రాసిన రెండు పాటలు
- ఉఠాపాండురంగా ప్రభాత సమయోపాతలా
- తుజకాయ దేఉ సావళ్యా మిభాయాతరీయో
రామజనార్ధన గారి ఒక పాట
- ఆరతి జ్ఞాన రాజా మహా కైవల్య తేజా
రామేశ్వర భట్ వ్రాసిన ఒక పాట
- ఆరతి తుకారమా స్వామి సద్గురుధామా
మిగిలిన పాటలు
- వేద సంబంధమైన మంత్రపుష్పం
- సంప్రదాయ ఆరతి పాటలు – భజన మొదలగు ఇతర పాటలు (హరేరామ రామరామ హరే, కర చరణ మొదలైనవి.)
పై పాటలన్ని సాయి ఆరతుల పుస్తకం సాయి సగుణోపాసన లో ప్రచురించబడినవి.
ఈ సగుణోపాసనకు మూలకర్త శ్రీ కృష్ణ జోగేశ్వర భీష్మ. ఈ హరతులకు భీష్మ రూపకల్పన చేయగా, వాటిని సక్రమంగా నిర్వహించుటకు కృషి చేసిన వారు రాధాకృష్ణమాయి. సాయిని సేవించుటకు సాయి తత్త్వంలో ఈ అరతులకు మించినదిలేదు. సాయి భక్తులు, సాయి మందిర నిర్వాహకులు ఈ అరతులకు ప్రాధాన్యతను గుర్తించి వాటిలో పాల్గొని సాయి కృపకు పాత్రులగుదురుగాక!
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- షిర్డీ సాయి హారతులు – రెండవ భాగం
- షిర్డీ సాయి హారతులు – మొదటి భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
- షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం – మూడవ భాగం–Audio
- షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 2వ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments