సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

జోగ్ ఉదయాన్నే బాబాకు జరిపే కాకడ ఆరతికి హాజరయ్యేవారు. బాబా లెండీబాగ్ కి వెళ్ళే సమయంలో అతను బాబాతో పాటు వెళ్ళేవారు. అలా వెళ్ళనప్పుడు బాబా లెండీబాగ్ నుంచి తిరిగి వచ్చేవరకు ఇంట్లో భగవద్గీత వంటి మతగ్రంథాలను అతను చదివేవారు. తరువాత అతను దేవుడికి నైవేద్యం తయారుచేయడంలో నిమగ్నమయ్యేవారు. తన దైవమైన బాబా ఏది కోరుకుంటే ఆ నైవేద్యం అందించేవారు.

మధ్యాహ్నం మశీదులో బాబాకు ఆరతి చేసేవారు. తరువాత, బాబా అతనిని తరచూ కొంతమంది భక్తులతో భోజనానికి ఇంటికి పంపేవారు. భక్తులు బాబాకు స్వీట్స్(తీపి పదార్ధాలు) మరియు పండ్లు ఇచ్చినప్పుడల్లా ఆ మొత్తం బుట్టను బాబా అతనికి అప్పగించేవారు. బాబా తన ఇంటికి పంపించే అతిథులను తీసుకుని జోగ్ భోజనానికి ఇంటికి వెళ్ళేవారు.

మధ్యాహ్నం సుమారు 3-30 గంటలకు అతను మసీదుకు వచ్చి సాయంత్రం వరకు ఏకనాథ భగవతం చదివేవారు. రోజు విడిచి రోజు బాబా చావడిలో ఉన్నప్పుడు, అతను రాత్రి 9-30 గంటలకు ఆరతికి హాజరయ్యేవారు. ఆ విధంగా ఏడు సంవత్సరాలపాటు జోగ్ నిరంతరాయంగా భక్తితో ఈ విధులు నిర్వర్తించారు. 1912 జనవరి నుంచి మసీదులో మరియు చావడిలో బాబా మహాసమాధి వరకు జోగ్ బాబాకు ఆరతి ఇచ్చేవారు. అతను బాబాకు గొప్ప భక్తుడు.

చావడి ఉత్సవంలో బాపూసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్య పాద్యములర్పించి, చేతులకు గంధము పూసి, తాంబూలమునిచ్చేవారు. చావడి ఊరేగింపులో ఇతను బాబా శిరస్సుపై ఛత్రమును పట్టుకొనేవారు. ఆఖరికి వేడుక పూర్తి అయ్యే సమయములో సర్వలాంఛనములతో కర్పూర హారతినిచ్చేవారు.

గతంలో ఒకప్పుడు జోగ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు తన భార్య తరఫు బంధువులకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. కాని ఆ వ్యక్తి 14 సంవత్సరాలు గడిచినా డబ్బు తిరిగి చెల్లించలేదు. షిరిడీ వచ్చిన తరువాత ఒకసారి జోగ్ తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆ వ్యక్తి నుంచి డబ్బును తిరిగి వసూలు చేయడానికి ఔరంగాబాద్ వెళ్లాలని అనుకున్నారు. అవసరమైతే చట్టపరంగానైనా డబ్బు తిరిగి రాబట్టాలని అనుకున్నారు.

ఔరంగాబాద్ వెళ్ళడానికి అనుమతి కోసం బాబా వద్దకు వెళ్లారు. కానీ బాబా అతనిని వెళ్ళవద్దని చెప్పి, అనుమతిని తిరస్కరించి, ఋణగ్రహీత స్వయంగా త్వరలో షిరిడీకి వస్తాడని, దాని గురించి ఆందోళన చెందక, ఓర్పు కలిగి ఉండాలని సూచించారు. జోగ్ కోపంతో, “నేను వెళ్తేనే ఇవ్వనివాడు, దావా వేయకపోతే ఎలా యిస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చేయాలి?’ అన్నారు.

బాబా అనుమతి ఇవ్వకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నారు. ఈ విషయంలో బాబా అనుమతి పొందకపోవడంపై జోగ్ సంతోషంగా లేకపోయినప్పటికీ, అతను నిస్సహాయంగా షిరిడీలోనే ఉన్నారు. తరువాత అకస్మాత్తుగా ఋణగ్రహీత షిరిడీకి వచ్చి, జోగ్ ని కలుసుకొని, అసలు మొత్తాన్ని ఇచ్చాడు. కాని జోగ్ వడ్డీ గూడ ఇస్తేనే గాని ఆ పైకం ముట్టనని పట్టుబట్టారు. కాని, వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పారు.

వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందనీ ఋషులు కూడా చెప్పారు. వడ్డీ పొందలేకపోవటంతో జోగ్ ప్రారంభంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ, బాబా సలహా మీద వడ్డీ లేకుండానే అంగీకరించారు.

జోగ్ ఆ పైకం తీసుకొని బాబాకు అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది అతనికే యిచ్చారు. నోటు గడువు దాటిపోయినా, తనవైపు నుండి ఎలాంటి ప్రయత్నం లేకుండానే తన సొమ్ము తనకి వచ్చినందుకు జోగ్ సంతోషించారు. ఇది నిజంగా గొప్ప అద్భుతం.

(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri

http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html

http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles