సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఏడవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

జోగ్ చాలా సంవత్సరాల పాటు బాబాకి సేవ చేసారు. అయినప్పటికీ అతని మనస్సు శాంతిని, సంతృప్తిని పొందలేదు. ఆయన ఆధ్యాత్మికతను కూడా సంపాదించలేదు. ఒకరోజు జోగ్, “బాబా, రోజూ మీ సేవ చేస్తున్నప్పటికీ, మశీదులో, చావడిలో ఆరతులు ఇస్తూ పూజలు చేసినప్పటికీ నాకు మానసిక శాంతి రాలేదు. బాబా! మీ ఆశీస్సులు, మానసిక శాంతి నాకు ఎప్పుడు లభిస్తాయి? మీరు ఎప్పుడు నాకు సన్యాసం ఇస్తారు?” అని అడిగారు.

అప్పుడు బాబా, “బాపూసాహెబ్! పూర్వపు జన్మలలోని పాపభరితమైన చర్యల కర్మఫలాలను అనుభవించటం పూర్తిచేయాల”ని చెప్పారు. తర్వాత మళ్ళీ బాబా, “కోపాన్ని, కోరికలను జయించడం, సర్వబంధాల పట్ల నిర్లిప్తంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నీవు నీ లౌకిక బాధ్యతల నుండి విముక్తుడవై, భిక్షువై జీవించాలి. అప్పుడు మాత్రమే నా ఆశీర్వాదానికి అర్హుడవవుతావు. అప్పుడే శాశ్వతమైన శాంతి సాధించగలవు” అని చెప్పారు.

బాబా మహాసమాధి అనంతరం జోగ్ భార్య చనిపోయారు. అప్పటినుండి అతనిలో ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి పోయి వైరాగ్యం పెంపొందింది. తరువాత అతను సన్యాసం తీసుకొని, జీవనం కోసం కావాల్సిన ఆహారాన్ని భిక్షమెత్తుకొనేవారు. బాపూసాహెబ్ అన్ని బాధ్యతల నుండి విముక్తుడైన తరవాత కొన్ని సంవత్సరాల పాటు షిరిడీలో ఉంటూ బాబా యొక్క సమాధికి సేవలు చేసుకున్నారు. బాబా చెప్పిన ప్రకారమే కాలక్రమంలో అతను పూర్తిగా లౌకిక బంధాల నుండి స్వేచ్ఛను పొంది, చివరికి ఈ ప్రక్రియలో ఆధ్యాత్మిక ఆనందాన్ని, మోక్షాన్ని పొందారు.

కాకాసాహెబ్ దీక్షిత్ మరణానంతరం ఇతర భక్తులు షిరిడీని విడిచిపెట్టారు. చాలా ఒంటరిగా ఉండటం వలన, బాపూసాహెబ్ సాకోరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అతను కఫ్నీ ధరించి, సన్యాసం తీసుకున్నారు. అయినప్పటికీ సాకోరిలో అతను బాబాకు చేసిన విధంగా భక్తితో ఉపసానీకి చేసేవారు.

తాయి భక్తికే ప్రతిరూపం. ఆమె అంత గొప్ప భక్తురాలు. ఆమె బాబాను అత్యంత భక్తితో ఆరాధించేవారు. ఆమెకు  ‘గురువు’ పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. బాబా సమాధి చెందిన తర్వాత ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయింది. షిరిడీ వీధులలో ఆమె తన గురువైన బాబా కోసం వెతుకుతూ ఉండేవారు. అంతటి ప్రేమ ఆమెకు బాబాపై ఉండేది. ఆమెకు చుట్టుప్రక్కల ధ్యాసే ఉండేది కాదు, ఆమె ముఖంపైన ఒక రకమైన శూన్యత కనిపించేది. అలా ఆమె రెండు నెలల గడిచిన తరువాత మరణించారు.

బాబా యొక్క మహాసమాధి తరువాత, జోగ్ సాకోరి చేరి ఉపసానీ బాబాకు పూజారిగా మారారు. చివరగా అతను 1926 లో 70 సంవత్సరాల వయస్సులో శాంతియుతంగా మరణించాడు.

బాపూసాహెబ్ జోగ్ సమాధి చెందడానికి ఆరునెలల ముందు ఒక సంఘటన జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ 1926లో జ్యేష్ఠమాసము ఏకాదశి రోజున సమాధి చెందారు. సరిగ్గా ఆరునెలల తరువాత బాపూసాహెబ్ సమాధి చెందారు. ఈ విషయమై ఒక భక్తునికి ఒక స్పష్టమైన కల వచ్చింది.

కలలో భక్తుడు బాబా ముందు కూర్చున్న భక్తులను చూశాడు. ఆ భక్తులు కళ్ళు తెరచుకుని ఉన్నారు. వారికి పక్కన కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చునివున్నారు. అతను ధ్యానంలో ఉన్నట్లు కళ్ళు మూసుకుని ఉన్నారు. దీక్షిత్ ప్రక్కనే ఖాళీగా ఒక స్థలం ఉంది.

కలలోనే ఆ భక్తుడు బాబాని ఎందుకు కాకా ప్రక్కన స్థలం ఖాళీగా ఉందని అడిగాడు. ఎందుకు కాకా కళ్ళు మూసుకొని ఉన్నారని కూడా అడిగాడు. అప్పుడు బాబా, “దీక్షిత్ క్రొత్తగా వచ్చిన వాడు, ఆ ఖాళీ స్థలం ఆరునెలల తరువాత రానున్న మరొక ప్రియమైన భక్తుడి కోసం కేటాయించబడింది” అని సమాధానమిచ్చారు. ఈ విధంగా జోగ్ మరణాన్ని బాబా ముందే సూచించారు.

బాపుసాహేబ్ జోగ్ ఒక సన్యాసిలా జీవనం సాగిస్తూ సమాధి చెందారు. అతని సమాధి సాకోరి లోని ఉపాసనీ ఆశ్రమం ముందు ఉంది.

అతను సాయిబాబాకు, ఆ తరువాత ఉపసానీబాబాకు తన చివరి శ్వాస వరకు సేవ చేశాడు.

సమాప్తం…

(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri

http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html

http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles