Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాపూసాహెబ్ జోగ్ అలియాస్ సఖారాం హరి 1856లో జన్మించారు. ఇతను పూణే నివాసి. ఇతను ప్రభుత్వ పి. డబ్ల్యూ. డిపార్టుమెంటులో సూపర్వైజర్ గా పనిచేశారు. 1909లో అతను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత భార్య శ్రీమతి తాయిబాయితో కలిసి షిరిడీకి వచ్చారు. వీరికి పిల్లలు లేరు. వారు తమకు వచ్చే పింఛనుతో సౌకర్యవంతంగా జీవించేవారు.
బాపూసాహెబ్ యొక్క దగ్గర బంధువులలో ప్రముఖమైన సత్పురుషులు విష్ణుబువా జోగ్ (పవిత్ర శ్రీసాయిసచ్చరిత్ర 43, 44 వ అధ్యాయం ప్రకారం). జోగ్ షిరిడీ సందర్శించే ముందు సాధు సఖారాం మహరాజ్ కు కృతజ్ఞతలు చెప్పటానికి కబాద్ సందర్శించారు. జోగ్ ఆయన సేవ చేస్తూ కొంతసమయం గడిపారు.
జోగ్ షిరిడీలో కొద్దిరోజులు గడిపి, తిరిగి కబాద్ కు వచ్చి తన మిగిలిన జీవితాన్నిఅక్కడ సేవ చేసుకుంటూ గడపాలని అనుకున్నారు. కానీ బాబాకి అతని విషయంలో వేరే ప్రణాళికలు ఉన్నాయి. షిరిడీలోని సాఠేవాడాలో జోగ్ దిగారు. ఇతర భక్తులు అతనికి ఇష్టంలేని విషయాలు చెప్పినప్పుడు అతను కబాద్ వెళ్ళిపోతానని బెదిరించారు.
అప్పుడు బాబా జోక్యం చేసుకుని, “వాడా ఏమైనా సాఠే తండ్రిదా? మీకు ఇబ్బంది కలిగించవద్దని దాదాకేల్కర్ తో చెప్తాను. మీరు నిశ్చింతగా అక్కడే ఉండండి. సరేనా!” అని చాలా మధురంగా మాట్లాడారు. అప్పుడు జోగ్ షిరిడీలో ఉండటానికి ఇష్టపడ్డారు. అప్పటినుండి జోగ్, తాయిబాయి ఇద్దరూ అత్యంత భక్తి, విశ్వాసాలతో బాబాను పూజించారు.
బాపూసాహెబ్ జోగ్ ఒక ‘చిత్పావన్ కొంకణి బ్రాహ్మణుడు’. ఈ బ్రాహ్మణ తెగ చాలా సనాతనమైనది. వారు ఖచ్చితంగా కర్మలను అనుసరించేవారు. అతను వ్యవహారాలలో న్యాయంగా, నిజాయితీగా, సూటిగా ఉండేవారు. అతని భార్య తాయిబాయి ఇదే స్వభావాన్ని కలిగి ఉండటంచేత వారు ఇరువురూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అనే విధంగా ఉండేవారు. బాబా ఆమెను ‘ఆయీ’ అని పిలిచేవారు.
బాపూసాహెబ్ ఒక ‘దత్త ఉపాసకుడు’, దత్త సాంప్రదాయ ఆచారాలను అనుసరించేవారు. అతను తన సాధన మౌనంగా చేసుకుంటూ ఉండేవారు. తన ఇంట్లో ఉన్న పూజాగదిలో అన్ని దేవతల విగ్రహాలు ఉండేవి. ప్రతి సంవత్సరం దత్తజయంతి సందర్భంగా అతను దత్తాత్రేయునికి నివేదనతోపాటు ఒక కఫ్నీని కూడా సమర్పించుకునేవారు. ఒక సంవత్సరం షిరిడీలో దత్తజయంతి రోజున బాబాకు కఫ్నీ సమర్పించుకోవాలని అతనికి బలమైన కోరిక కలిగింది.
అందువల్ల, అతను బాలాషింపీకి ఒక కఫ్నీ కుట్టమని చెప్పారు. దత్తజయంతినాడు కఫ్నీని తీసుకుని మశీదుకు వచ్చారు. బాబాకు పూజ చేసిన తర్వాత అతను కఫ్నీని ఆయనకు సమర్పించారు. బాబా అతడిచ్చిన కఫ్నీ స్వీకరించి, అతనికి తమ కఫ్నీని ప్రసాదంగా ఇచ్చారు.
అతను సంతోషంగా కఫ్నీ తీసుకొని దానిని భద్రంగా దాచుకున్నారు. సాయంత్రంవేళలో అతను కఫ్నీ ధరించి, తల చుట్టూ తెల్లటి వస్త్రాన్ని కట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళేవారు. అతను దీనిని “దర్బారీ పోషక్” (కోర్టు దుస్తులు) అని పిలిచేవారు. ఇతర సమయాల్లో అతను సాధారణ దుస్తులు ధరించేవారు.
బాపూసాహెబ్ దయగల మనసుతో, మంచి వ్యక్తిగా ఉండేవారు. కానీ తన అధికారం వల్ల మరియు తోటి ఉద్యోగస్థులతో వ్యవహరించే తీరు వల్ల, కొంత కఠినంగా ఉన్నట్లు కనిపించేవారు. అతను త్వరగా నిగ్రహాన్ని కోల్పోయేవారు. బాబా నెమ్మదిగా జోగ్ యొక్క ఈ వైఖరిని మార్చారు.
అతను తాను ఆదా చేసిన కొంచెం డబ్బుతో పొదుపుగా జీవించేవారు. బాబాకి జోగ్ తన సంపద వలన అహంభావంతో ఉన్నాడని తెలుసు. బాబా అతని పొదుపు మొత్తం అయిపోయేంతవరకు తిరిగి తిరిగి దక్షిణ అడిగేవారు. నిదానంగా బాపూసాహెబ్ ఒక విలువైన పాఠం నేర్చుకున్నారు. ప్రతినెలా అతను కోపర్గాఁవ్ నుండి పెన్షన్ తెచ్చుకొని, దుకాణదారులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించి, మిగిలిన సొమ్ము తెచ్చి బాబా ముందు ఉంచేవారు. బాబాకు అతని పట్ల చాలా నమ్మకం.
రేపు తరువాయి భాగం…..
(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri)
http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html
http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – అరవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఐదవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఏడవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments