సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – అరవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

ఒకసారి పార్వని పవిత్రమైన సమయములో బాపూసాహెబ్ జోగ్, అతని భార్య తాయిబాయి కోపర్గాఁవ్ వద్ద గంగలో స్నానం చేయాలని అనుకున్నారు (బాబా గోదావరి నదిని ‘గంగ’ అని పిలిచేవారు). అందువల్ల మిగిలిన భక్తులు కూడా అదే విధంగా అనుకున్నారు. బాబా అనుమతికోసం జోగ్ వెళ్ళగా, బాబా “బాపూసాహెబ్, బఘు త్యాచ విచార్ ఉదియ సకాలి (బాపూసాహెబ్ చూడు, మనం దాని గురించి రేపు ఆలోచిద్దాం)” అని అన్నారు.

అప్పుడు బాపూసాహెబ్ ఇలా సమాధానమిచ్చారు: “బాబా! ఆ పవిత్రమైన సమయము ఉదయం ఏడు గంటలకి. ఆ సమయానికి మేము కోపర్గాఁవ్ చేరుకోవడానికి ఉదయం సుమారు నాలుగు గంటలకి మేల్కొనవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే సమయానికి గంగలో స్నానం చేయగలుగుతాము”.

అయితే మళ్ళీ బాబా అవే పదాలు పునరావృతం చేసారు. అనేక విధాలుగా బాబాని చాలాసార్లు జోగ్ వేడుకున్నారు. కానీ బాబా, “రేపు చూస్తాం” అని మాత్రమే అన్నారు. జోగ్, అతని భార్య చాలా నిరాశకు గురయ్యారు. అలాంటి శుభసమయం జీవితకాలంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ ఫకేర్ కి ఏమి తెలుస్తుంది దాని విలువ అని ఏదేదో అనేశాడు నిరాశతో.

బాపూసాహెబ్ జోగ్ బాబా యొక్క పరమ భక్తుడు, అతడు బాబా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేరు. ఆ రాత్రి జోగ్ నిరాశ వలన  నిద్రపోలేదు. ఆ రాత్రి బాబా చావడిలో నిద్రించారు. ఉదయం అతను బాబాకి ఆచారం ప్రకారం కాకడఆరతి చేసారు. ఇలా ఆరతి ముగిసిందో, లేదో అంతలోనే గ్రామస్థులు పరుగు పరుగున అక్కడికి చేరారు. వారు, “గంగానది నీటి ప్రవాహంతో కాలువలు నిండుతున్నాయి” అని అరుస్తూ వచ్చారు. 

బాబా జోగ్ వైపు చూస్తూ, “తూ సాగ్లి రథ్ లేయే శివే డిలేయాస్, పాన్ దేవచే దయ, గంగా ఆప్లాపాషి అలే. జా అత  అన్గోలె కరుణ్ ఘేయే” (రాత్రంతా నన్ను నువ్వు నిందిస్తూ ఉన్నావు. కానీ దేవుని దయవలన గంగ మన దగ్గరకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళి దానిలో మునగండి) అని అన్నారు.

ఆరోజుల్లో గోదావరి నది నుండి షిర్డీకి ఒక కాలువ ఉండేది. ఆ కాలువ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పని పూర్తై నీళ్ళు రావడానికి ఇంకా 2, 3 నెలల సమయం ఉంది. కాని ఆనకట్ట తెగిపోవడం వలన గోదావరి నీళ్ళు సరిగ్గా పండగ రోజుకి షిర్డీ చేరాయి.

అప్పుడు బాపూసాహెబ్, అతని భార్య తాయిబాయి మరియు మిగిలిన గ్రామస్థులు గంగలో స్నానం చేసారు. బాపూసాహెబ్ కాలువలో ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా స్నానం చేసారు. అతని సంతోషాన్ని చూస్తూ బాబా, “అరే బాపూసాహెబ్, దేవుడు ఎంత దయగలవాడో చూడు. కానీ మనం అతనిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచము, మనము ‘సబూరి’ కలిగి ఉన్నామా?  సబూరి అంటే చెదిరిపోని కేంద్రీకృతమైన విశ్వాసం.”

“చీకట్లో అంత దూరం నడిచి వెళ్ళే కష్టం మాకు కలగకుండా, మా కోరికను తీర్చడం కోసం ఆ గోదావరినే మా వద్దకు తీసుకువచ్చిన సద్గురు సమర్ధతను తెలుసుకోకుండా బాబాను మూర్ఖంగా అడిపోసుకున్నానని” తరువాత రోజులలో జోగ్ వెక్కి వెక్కి ఎడ్చారని తర్కాడ్ తన స్మృతులలో చెప్పారు.

బాపూసాహెబ్ జోగ్ తల్లి షిరిడీలో మరణించింది. అతను అన్ని మతపరమైన ఆచారాలతో వేడుకలను నిర్వహించాలని అనుకున్నారు. అతను తన జాతి బ్రాహ్మణులు షిరిడీలో అందుబాటులో లేనందున నాసిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అతను బాబా వద్దకు వెళ్లి, ఆ తేదీలో బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారో, లేదో తెలుసుకోవడానికి నాసిక్ వెళ్ళడానికి అనుమతి కోరారు. కానీ బాబా అతన్ని నిలిపివేశారు.

బాపూసాహెబ్ మాట్లాడుతూ, “ఏం జరిగినా నేను ఈరోజు వెళ్ళాలి. ఇక్కడ నా కులం బ్రాహ్మణులు లేరు” అన్నారు. బాబా అతనితో, “సాయంత్రం ఈ విషయాన్ని మనం నిర్ణయిద్దాం” అని అన్నారు.

బాబా ఈ మాటలు చెప్పిన ఒక గంట లోపలే, జోగ్ కులానికి చెందిన వేద బ్రాహ్మణుడు బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప పండితుడు. ఊహించని రీతిలో ఆ ప్రత్యేకమైన రోజున వారి రాకకు జోగ్ చాలా సంతోషించారు. తరువాత అతనితో జోగ్ సంతృప్తికరంగా వేడుకను జరిపించారు. అందువల్ల అతను నాసిక్ వెళ్ళాల్సిన అవసరమే రాలేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా భక్తుల అవసరాల పట్ల బాబా శ్రద్ధ వహిస్తారని చూపించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

జోగ్ అనుమతి అడుగుతున్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే ఉన్నారు. అప్పుడు కాకా “బాబా, మనం – మీరు, బాపూసాహెబ్ మరియు నేను కలిసి వెళ్దాం. మనం నాసిక్ లో జోగ్ ని వదిలేసి, అక్కడి నుండి మీరు, నేను బొంబాయికి వెళ్దాం” అన్నారు. బాబా ఇలా సమాధానమిచ్చారు: “మీ కది కొన్నాల సూధర్ మనుష్ నాహి” (అర్థం: నేను ఎప్పుడూ, ఎవరినీ మధ్యలో విడిచిపెట్టే వ్యక్తిని కాదు). బాబా తన విలక్షణ పద్ధతిలో అసాధారణమైన సమాధానాన్ని ఇచ్చారు.

(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri

http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html

http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – అరవ భాగం

Sainathuni pranathi

Chala bagundi sai e leela. Naku e roju morning nanu dhasaganu charitra lo chadivina leelalu gurtuvachai .manasu antho happy ga anipinchindi. Dhasaganu leelalu Mali medwara gurthuchasukunanu sai happy sai.

Sainathuni pranathi

Dhasaganu maharaj baba pramanu anthaga aswadistaro sai .chala annandhanga chabutaru baba anubhavalu. Dhasaganu baba leelalu chabutunta ayana eyes nunchi anandha bhaspalu vachawata. E leela chadivinapudu naku Dhasganu charitra gurtochindi sai .happy ga vundhi.

Sai Suresh

నిన్ననే దాసగణు బుక్ వచ్చింది సాయి. ఈ రోజు మొదలు పెట్టాను. కేవలం ౩ పేజీలు  చదివాను. అవి చదువుతుంటే హ్యాపీ గా అనిపించింది సాయి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles