Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 4వ.భాగమ్
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీ సాయిబాబా చావడి ఉత్సవానికి వెడుతున్నపుడు ఆయన కుడిప్రక్కన ఒక చిన్న పిల్లవాడిని చూడండి. (ప్రక్కన ఇచ్చిన చిత్రంలో). ఆ బాలుడు టోపీ ధరించి, చేతిలో రాజదండంతో కనపడుతున్నాడు. ఆ బాలుడు శ్యామ్ రావు జయకర్ కుమారుడు (అయిదు సంవత్సరాల వయస్సు. పేరు సురేంద్ర కావచ్చు).
బాబాగారికి ఎడమవైపున ఇంకొక బాలుడు నుంచుని ఉన్నాడు. అతను కూడా తలపై టోపీ పెట్టుకుని చేతిలో పళ్ళెంలో పూజాద్రవ్యాలు పట్టుకుని ఉన్నాడు. ఆ బాలుడు మోరేశ్వర్ ప్రధాన్ కుమారుడు ఛోటా సాయినాధ్’ . ఇతనే బాపూ.
చావడి ఉత్సవంలో బాబాతో నడుస్తున్న ఆ బాలుర గురించి నిశ్చయంగా తెలీదు. కుడివైపున నుంచున్న బాలుడు ఉద్ధవరావు లేక గణేష్ (వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉన్నవాడు) అని, ఎడవవైపున నుంచున్న బాలుడు బాబాకు అంకిత భక్తుడయిన లక్ష్మణ్ మామా జోషీ ఏకైక పుత్రుడయిన బప్పిజీ అని కొంతమంది అభిప్రాయం. ఏమయినప్పటికి పైన మొట్టమొదటగా చెప్పిన విషయమే సరియైనదనిపిస్తుంది.
బప్పిజీ, బాబా మహాసమాధి చెందేంతవరకు 12 సంవత్సరాలపాటు బాబాతో చాలా సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతుడు. ఇతడు మంచి కీర్తనకారుడు, గాయకుడు. ఆధ్యాత్మిక గ్రంధాలను బాగా అధ్యయనం చేశాడు. శ్యామా కుమారుడు ఉద్దవరావు తన చిన్నతనం నుంచి బాబా చావడి ఉత్సవానికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా వెడుతూ ఉండేవాడు. అతను చాలా సంవత్సరాలు సాయి సంస్థానంలో పూజారిగా పని చేసి 1998 లో బాబాలో ఐక్యమయాడు.
చావడి ఉత్సవం ఫోటో మనకందరికి చాలా సులభంగానే లభ్యమవుతుంది. అందులో ఉన్న ఇద్దరు బాలురను మనం సులభంగా గుర్తుపట్టగలం.
(కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడి వెళ్ళినపుడు శ్యామా కుమారుడయిన ఉద్దవరావు దేశ్ పాండే గారిని కలుసుకునే భాగ్యం కలిగింది. …. త్యాగరాజు)
శ్రీజనార్ధనరావు గారికి తన అత్తమామలు, భార్య సహవాసం వల్లనే, పదవీ విరమణ తరువాత బాబా అనుగ్రహంతో సాయిభక్తులందరి గురించి ప్రపంచానికి తెలియచేద్దామనే ప్రేరణ కలిగింది. బాబా జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన చేసిన అధ్భుతాలను గురించి చారిత్రక ఆధారాల గురించి పరిశోధన చేశారు.
మొట్టమొదటగా ఆయనకు బాబా గురించి ఈ వ్యాసాలు రాద్దామని గాని, పుస్తకాలు రాద్దామని గాని ఎటువంటు ఉద్దేశ్యం లేదు. ఆయనకు ఎటువంటి నిశ్చయమైన అభిప్రాయం లేకుండానే బాబా గురించి, అప్పటి సాయిభక్తుల గురించి రాయాలనే సంకల్పం బాబా కలిగించారు. చారిత్రక ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని సంకలనం చేసి వ్రాయమని బాబా ఆజ్ఞగా ఆయన భావించి ఉండవచ్చు.
బాబా అనుగ్రహం వల్ల రచయిత ఎన్నో పుస్తకాలను, మాసపత్రికలను, వారపత్రికలను అన్నిటిని పరిశీలించడం జరిగింది. జరిగిన సంఘటనలు ఏసంవత్సరంలో ఎప్పుడు జరిగాయో తేదీలతో సహా నిర్ధారించుకోవటానికి అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించారు. ఇది కష్టసాధ్యమయినప్పటికీ బాబా అనుగ్రహం వల్ల రచయితకి పెద్ద భారమనిపించలేదు.
ఎంతో పట్టుదలతో ప్రయత్నించినప్పటికి, కొన్నికొన్ని సంఘటనలకు మాత్రం అవి ఏసమయంలో ఎప్పుడు జరిగాయన్నదానికి చారిత్రక సమాచారం లభించలేదు. అందుచేత ఆయన తన శ్రమకి పూర్తిన్యాయం చేయలేకపోయారు. అయినప్పటికి బాబా దయవల్ల ఆయన చేపట్టిన ఈ సాహస కార్యక్రమం పూర్తిచేయగలిగినందుకు ఆయన బాబాకు శతకోటి నమస్కారాలు అర్పించుకుంటున్నారు.
2014 వ.సంవత్సరం జూన్, 25వ. తారీకున ఆయన కుటుంబంలో ఒక అధ్భుతమయిన సంఘటన జరిగింది. శ్రీజనార్ధనరావుగారు 10 కేజీల బియ్యం కొని బెంగళూరు జె.పి.నగర్ లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళారు. అక్కడ మందిరంలో పూజారి గారికి ఆ బియ్యాన్ని అన్నదానంకోసం సమర్పించారు. ఆలయ అధికారులు జూన్ 28న జరగబోయే ధుని పూజకు రమ్మని టిక్కెట్ ఇచ్చారు.
ఆయన పెద్దకుమారుడు మురళీకృష్ణ బెంగళూరు, కనకపురా రోడ్డులో ఒక స్కూలును నిర్వహిస్తున్నాడు. జనార్ధనరావుగారు స్కూలుకు వెళ్ళి తన కుమారుడికి ఆ టిక్కెట్ ఇచ్చారు. 28వ. తారీకున అతని పుట్టినరోజు సందర్భంగా ఆరోజున అతనిని ధునిపూజకు వెళ్లమని చెప్పారు. మురళీకృష్ణ కూడా గతంలో సాయిభక్తుడే. అయినప్పటికి 28వ.తారీకున జరిగే ధుని పూజకు వెళ్లడం తనకిష్టంలేదని చెప్పాడు.
జనార్ధనరావుగారు ఇంటికి వచ్చి భార్యకు జరిగినదంతా చెప్పారు. ఇక చేసేదేమీ లేక ఆయన ఆటిక్కెట్ ను తన భార్యకు ఇచ్చి ధునిపూజకు వెళ్ళి ఆమెను పూజచేయించమని చెప్పారు. ఆమె సరేనని చెప్పింది. ఇంటిలో పూజా కార్యక్రామాలన్నీ పూర్తయిన తరువాత ఆవిడ తన కొడుకుకు ఫోన్ చేసి “28 తారీకున ధుని పూజకు వెళ్ళు. బాబాని ప్రార్ధించుకో. నీ సమస్యలన్నిటినీ బాబా పరిష్కరిస్తారు” అని చెప్పింది.
తల్లి బలవంత పెట్టిన కూడా తను ధుని పూజకు వెళ్ళేది లేదని నిష్కర్షగా చెప్పాడు. ఆ సమయంలో అతను జయనగర్ లో ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక ఫోన్ పెట్టేసింది ఆమె. మురళీకృష్ణ ఒక బాబా ఫోటోకు ఫ్రేమ్ కట్టించి ఇంటిలో గోడకి తగిలించాడు. ఆమె ఆఫోటో ముందు నిలబడి బాబాని ప్రార్ధించింది.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 1వ. భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 5వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 3వ. భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 2వ. భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 8. వ.భాగమ్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments