Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
ఇంతకు ముందు సాయి భక్తులయిన శ్రీభారం ఉమామహేశ్వర రావు గారి గురించి చదివారు. అటువంటి సాయి భక్తులను గురించి వ్రాసిన శ్రీ బొండాడ జనార్ధన రావు గారు కూడా సాయి భక్తులే. ఈ రోజు నుండి ఆయన గురించి కూడా తెలుసుకుందాము.
రచయిత శ్రీ బొండాడ జనార్ధన రావు గారు సాయిబాబా గురించి ఇంకా సాయి భక్తుల గురించి ఎన్నో వ్యాసాలను వ్రాసారు. ఆయన తన బ్లాగులో 61 మంది సాయి భక్తులను గురించిన సమాచారం ఇచ్చారు.
ఆయన తల్లిదండ్రులు శ్రీ కోటయ్య , శ్రీమతి సత్యవతమ్మ గార్లు. ఆయన తాడేపల్లి గూడెంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఆయన స్టేట్ బ్యాంక్ గ్రూప్ లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగంలో ప్రవేశించారు. ఆ తరువాత జోనల్ మానేజర్ గా ను, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి సి.ఇ.ఓ. గాను పని చేసారు. ఆయన ఆహోదాలో బ్యాంక్ ప్రతినిధిగా బ్యాంక్ లకు సంబంధించి కొన్ని అధ్యయనాలను చేయడానికి విదేశాలను కూడా సందర్శించారు.
ఆయన శ్రీ భారం ఉమామహేశ్వరరావు, మణిల పెద్ద కుమార్తె నీరజను వివాహమాడారు. ఆయనకు ముగ్గురు అబ్బాయిలు, ఒక కుమార్తె. అందరూ కూడా ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలలో మంచి హోదాలో స్థిరపడ్డారు. శ్రీ భారమ్ ఉమామహేశ్వర రావు గారు పోలీసు శాఖలో ఉన్నత హోదాలో పనిచేసి, పదవీ విరమణ తరువాత షిరిడీ సాయిబాబాకు అంకిత భక్తులయారు.
ఆయన సాయిబాబా మీద ఎన్నో పుస్తకాలను రచించారు. తన జీవితాన్నంతా బాబా (బాబాచే పొడిగింపబడ్డ జీవిత కాలంతో సహా) సేవలోనే గడిపి తరించారు. బాబా గురించి ఆయన తత్వాన్ని గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. ఆయన తరచూ షిరిడి వెళ్ళి వస్తూ ఉండేవారు.
ఆయన భార్య శ్రీమతి మణి ఉమామహేశ్వర రావు కూడా సాయిబాబా గురించి కొన్ని పుస్తకాలను రచించడమే కాక ఆవిడ తన భర్త చేసే రచనలలో కూడా సహాయ పడ్డారు. అంతే కాదు భర్త చేసే సాయి సేవలో కూడా సంపూర్ణ సహాయాన్ని అందించారు. శ్రీ ఉమామహేశ్వర రావుగారికి ఎన్నో దివ్యదర్శనాలను ప్రసాదించారు సాయిబాబా. ఆయనకు బాబా వల్ల అధ్బుతమైన స్వీయానుభూతులు కూడా కలిగాయి.
(బాబా ఆయన జీవితాన్ని ప్రతి సంవత్సరం పొడిగించిన అధ్భుత సంఘటనలు, ఆయన ధ్యానంలో ఉన్నపుడు ఆయనకు బాబా చేసిన గుండె ఆపరేషన్) ఇవన్నీ కూడా ప్రచురింపబడ్డాయి. బి.జె. రావు గారు ఆయన భార్య ఇద్దరు కూడా బాబా భక్తులే. ముఖ్యంగా శ్రీమతి నీరజ ప్రతిరోజు బాబాకు పూజలు చేస్తూ, బాబాపై ఎంతో నమ్మకాన్ని పెంపొందించుకొంది.
ఒకసారి 37 సంవత్సరాల క్రితం, 1980 వ. సంవత్సరంలో జనార్ధనరావు గారు షిరిడీ వెళ్ళినపుడు సమాధి మందిరంలో ఆయన తన కెమెరాతో బాబా ఫోటో తీసారు. (ప్రక్కన ఇచ్చిన చిత్రం ) చూడండి).
విచిత్రమేమంటే కెమెరాలో ఫ్లాష్ ఉపయోగించకపోయినా ఫొటోలో బాబా శిరస్సు పైన ఒక తెల్లని కాంతి పడింది. ఆయన ఆ ఫోటోని అతి భద్రంగా దాచుకొన్నారు. బాబా ఆయనని ఆయన కుటుంబానికి నిరంతరం తన సహాయాన్ని అందిస్తున్నారనడానికి కొన్ని సంఘటనలను రేపటి భాగంలో వివరిస్తాను.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 3వ. భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 4వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 5వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 2వ. భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 5 వ.భాగమ్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments