Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
తాయి ఒకరోజు ఉదయం నైవేద్యం తీసుకుని ద్వారకామాయికి వెళ్లినప్పుడు, బాబా ఆమెతో, “ఆయీ! నేడు నీ వద్దకు ఒక గేదె వస్తుంది. కాబట్టి పూరణ్ పొళీలు (బొబ్బట్లు) ఎక్కువగా చేసి, నెయ్యితో బాగా కాల్చి ఉంచు. వాటిని ఆ గేదెకు తినడానికి పెట్టు” అని చెప్పారు.
తాయీ వెంటనే అందుకు అంగీకరించి, “బాబా నేను ఖచ్చితంగా బాగా నెయ్యి వేసి చాలా పూరణ్ పోళీలు చేసి గేదెకు తినిపిస్తాను. కానీ ఆ గేదెను వెతుక్కుంటూ నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను దానిని ఎలా గుర్తించాలి?” అని అడిగారు.
అప్పుడు బాబా “ఆయీ! నీవు దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నావు? పూరణ్ పోళీలు సిద్ధం చేయటం ముగిసిన వెంటనే గేదె మీ తలుపు వద్దకు వస్తుంది” అని జవాబిచ్చారు.
తాయీ ఆశ్చర్యంతో, “బాబా మా ఇంటికి రెండు తలుపులు ఉన్నాయి. ప్రతిరోజు చాలా గేదెలు మా ఇంటి ముందున్న దారిలో వెళ్తూ ఉంటాయి. తరచూ నా తలుపు దగ్గర ఆహారం కోసం ఆగుతూ ఉంటాయి. నేను వాటికి ఆహారం పెడుతూ ఉంటాను” అని బదులిచ్చారు.
అప్పుడు బాబా, “ఆయీ, పూరణ్ పోళీలు సిద్ధం చేసి, వాటికి నెయ్యి రాస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన గేదె మీ ఇంటి వెనుక వైపుకు వచ్చి వేచి చూస్తుంది” అని వివరించారు.
బాబా ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందిన తాయీ ఇంటికి వెళ్లి శ్రద్ధతో, సమృద్ధిగా నెయ్యివేసి, రుచికరమైన పూరణ్ పోళీలు చాలా చేసింది. మధ్యాహ్నం 12:30 కి ఆమె వెనుక తలుపు తెరిచి చూసేసరికి అక్కడ బాబా చెప్పినట్లుగా ఒక గేదె వేచి ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. బాబా మాటలు సత్యమైనందుకు సంతోషించింది.
అప్పుడు ఆమె పూరణ్ పోళీలు పళ్ళెంనిండా తెచ్చి గేదెకు పెట్టింది. గేదె అన్ని పూరణ్ పోళీలూ తిని, ఆ తరువాత ఆమె కళ్ళముందే మరణించింది. విషాదభరితమైన ఆ సంఘటనకు తాయీ చాలా విచారించారు. ఆమె ఎటువంటి భయాందోళనలు చెందలేదు. గేదె మరణానికి తానే బాధ్యురాలినని ఆమె భావించారు.
ఆమె వంటగది లోపలికి వెళ్లి, వాటి తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థాన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. కానీ వాటిలో ఎటువంటి తప్పూ దొరకలేదు. ఆమె మనస్సు సంక్షోభంలో పడింది.
ఆమె తనలో తాను “నేను ఎంతో ప్రేమతో, ఆనందంతో ఈ పూరణ్ పోళీలు చేసాను. అటువంటప్పుడు ఇది ఎలా జరిగింది? ఎందుకు ఈ గేదె చనిపోయింది? నేను దీనిని చంపలేదు, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ దాని మరణానికి నన్ను బాధ్యురాలిని చేస్తారు. ప్రతి ఒక్కరూ ఏమి అనుకుంటారో, నా గురించి ఏమి చెప్పుకుంటారో? నేను కేవలం బాబా ఆజ్ఞను అనుసరించాను.
కాని, ఈ గేదె ఎవరిదో? ఆ యజమాని దీని గురించి తెలుసుకున్నప్పుడు అతను గేదెని నేను చంపానని అంటాడు. చెల్లింపు కోసం యజమాని అడిగినట్లయితే, ఆ గేదె ఎంత ఖరీదు వుంటుంది? ఒకవేళ అతను ఫిర్యాదును నమోదు చేస్తే ఏమి చేయాలి? దాని ఫలితమేమిటి? బాబా ఈ విశ్వం యొక్క సృష్టికర్త, నేను ఆయన ఆదేశాలను పాటించాను, ఫలితం చెడ్డది అయితే, ఆయన నన్ను క్షమిస్తారు” అని అనుకొని ఆమె తృప్తి పడింది.
తరువాత ఆమె బాబా వద్దకు వెళ్లి ఏమి జరిగిందో వివరంగా చెప్పింది. బాబా, “ఆయీ, భయపడవద్దు. ఏం జరిగిందో అది చెడు కాదు. ఇది ఎప్పటికైనా జరిగేదే. ఆ గేదెకు ఈ కోరిక (వాసన) మాత్రమే మిగిలిపోయింది. ఆ కోరిక సంతృప్తి పరచిన తరువాత ఈ జన్మ నుండి దానికి విముక్తి లభించింది. అది ఇప్పుడు మంచి పునర్జన్మను పొందుతుంది.
ఇప్పుడు నీవు భయం లేకుండా ఇంటికి వెళ్ళు. నీచజన్మ నుండి దానిని విముక్తి చేసినందునందువల్ల చెడుగాగానీ, విచారంగాగానీ భావించవద్దు. ఎద్దు జన్మ నుండి విముక్తి కలిగించి మంచిజన్మకి అవకాశం ఇచ్చినప్పుడు, ఎందుకు నీవు భాధ ఉండాలి?” అని ఆమెను ఓదార్చారు. అప్పుడు ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది.
సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగిచుసేది. ఫిబ్రవరి 26, 1912న చావడి ఉత్సవానికి మశీడుపై దీపాలు పెట్టడానికి పైకేక్కిన వాళ్ళను ఆయన తిట్టారు. ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్ పై సటకా విసిరారు. చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని, “ఆరతి ఎందుకు ఇచ్చావ్?” అని గద్దించారు. బాలషింపి, త్రయంబక్ లు అవి ఆశీస్సులని తలచి సాయికి సాష్టాంగనమస్కారం చేసారు.
(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri)
http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html
http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – అరవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఐదవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఏడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments