Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఒకసారి బాబా జోగ్ ని దక్షిణ అడిగారు. అతని వద్ద డబ్బు లేదని ఆయనకి బాగా తెలుసు. అతడు, “బాబా, నా వద్ద ధనం లేద”ని చెప్పారు. అయినా ప్రతి పది, పదిహేను నిమషాలకి బాబా దక్షిణ అడిగారు. చివరికి అతను విసిగిపోయి, “నా వద్ద ధనం లేదంటుంటే” అని గొంతు చించుకుని అరిచారు. అప్పుడు బాబా, “బాపూసాహెబ్! కోపం తెచ్చుకోకు, నిగ్రహాన్ని కోల్పోవద్దు. నీ దగ్గర ధనం లేకుంటే లేదని నిదానంగా చెప్పు, అదీకాకుంటే ఊరుకో! అరుస్తావెందుకు?” అని అన్నారు.
ఒకసారి షిరిడీలో, అతని భార్య అనారోగ్యంతో ఉన్నారు, కాని బాబాపై విశ్వాసంతో ఆమె ఏ మందులూ తీసుకోలేదు. కానీ, ఆమె అనారోగ్యం తగ్గలేదు. ఆమె సహనం కోల్పోయి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని అనుకుంది. కానీ షిరిడీ నుండి బయలుదేరే సమయానికి, హఠాత్తుగా ఆమెకు నయమై షిరిడీని వదిలి వెళ్ళలేదు.
ఒకప్పుడు తాయిబాయికి కళ్ళకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రోజు రోజుకు పెరగసాగింది. తాను ఇంటి వైద్యం చాలా చేసింది. కాని ఎటువంటి ప్రయోజనం కనపడలేదు. అప్పుడు ఆమె బాబాను ప్రార్ధించింది. అప్పుడు బాబా ఆమెకు ఒక ఔషధం చెప్పి, “ఆ ఔషధాన్ని ఎవరికీ చెప్పకు. ఏ వ్యాధిగ్రస్తుని కళ్ళలోనూ వేయకు” అని చాలా స్పష్టంగా ఆదేశించారు. ఆ ఔషధం ఎంతో సులభమైనది. ఆమె ఆ ఔషధాన్ని ఉపయోగించి స్వస్థత పొందింది.
బాబా ఒకసారి తాయిబాయికి ఊరి బయట వేపచెట్టు ప్రక్కనున్న జాగా చూపి, “ఇది మా స్థలం. ఇక్కడొక భవనం లేస్తుంది. మేమక్కడే ఉంటాము. పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు” అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్ధం కాలేదు. కాని తర్వాత అదే స్థలంలో బూటీ వాడా నిర్మాణం జరిగింది.
ఒకసారి బాపూసాహెబ్ జోగ్ కు ఆరతి సమయంలో బాబా అక్కల్కోట మహరాజ్ గా దర్శనం ఇచ్చారు.
బాపూసాహెబ్ ఆహారం తీసుకునే విషయంలో చాలా సంప్రదాయబద్ధంగాను, కఠినంగాను ఉండేవారు. అతను ఏకాదశి మరియు ఇతర ఉపవాసం ఉండే రోజులు గమనించి, అటువంటి రోజుల్లో ఉల్లిపాయలను ముట్టుకునేవాడు కాదు. బాబా ఈ విషయాన్ని గౌరవించి అతనితో తినడానికి ఎన్నడూ బలవంతం చేసేవారు కాదు.
ఒక ఏకాదశి రోజున జోగ్ ఏ వంటకం చేయమంటారని బాబాని అడిగారు. “ఉల్లితో కిచిడి చేయమని” బాబా అన్నారు. జోగ్ కు ఏకాదశి రోజు ఉల్లి తినని నియమం ఉన్నప్పటికీ, బాబా చెప్పారని కిచిడి తయారుచేసి బాబాకు అర్పించారు. బాబా కొంచెం రుచి చూసి “బాగుంది, అందరికీ పంచి, నువ్వు కూడా తిను” అన్నారు. జోగ్ ఏకాదశి రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయినా సరే, బాబా ఆజ్ఞ ప్రకారం ఉల్లి కిచిడి తిన్నారు.
ఒకసారి రాత్రి సుమారు 8 గంటల సమయంలో బాపూసాహెబ్ జోగ్ ను తేలు కుట్టింది. అతను వెంటనే బాబా వద్దకు వెళ్లారు. మెట్లు ఎక్కుతుండగానే బాబా, “బాపూసాహెబ్, ఏమిటి?” అని అడిగారు. “బాబా! నన్ను తేలు కుట్టింది” అని జోగ్ చెప్పారు. “తగ్గిపోతుందిలే, వెళ్ళు!” అని బాబా చెప్పారు. బాపూసాహెబ్ అట్లాగే మెట్ల మీద నుండి వెనుకకు తిరిగారు. తాను మశీదు కాంపౌండ్ దాటి బయటకు వచ్చేసరికి తన వేదన పూర్తిగా తగ్గిపోయింది.
శ్రీమతి కశీబాయి కనిత్కర్ అనే భక్తురాలితో అంగోన్ కవాడ్ కి చెందిన శ్రీ సఖారాం మహరాజ్ అనే గొప్ప సాధువుతో కలసి కొంత కాలమున్నామని, ఆయన తమ గురుబందువని, అక్కడ ఆయనతో కలసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు.
జోగ్ ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్ కవాడ్ లోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిర్డీకి తీసుకు వెళ్ళాడు. కాని అది పచ్చిదని దారిలో రెండు మామిడి పండ్లు కొని బాబాకు సమర్పించాడు జోగ్. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద భాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి.
దానిని అటూ ఇటు త్రిప్పి చూచి “ఇది ఇంకా పండలేదు” అన్నారు. ఔనన్నాడు జోగ్. సాయి మరి కొద్దిసేపు దానిని తదేకంగా చూచి, దానిని కోయించి భక్తులందరికి పెట్టించారు. అదెంతో మధురంగా ఉండటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు.
(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri)
http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html
http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – అరవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మొదటి భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – ఏడవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments