సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

తరచూ డబ్బును అతని వద్ద భద్రపరచమని బాబా ఇచ్చేవారు. బాపూసాహెబ్ డబ్బును సురక్షితంగా ఉంచేవారు, ఎందుకంటే అది బాబా డబ్బు అని అతనికి తెలుసు. అవసరమైనప్పుడు బాబా ఆ డబ్బు నుంచి కొనుగోలు చేయమని చెప్పేవారు. బాబా తరచూ అతనికి వంద రూపాయలు ఇచ్చేవారు. కొన్నిరోజుల తర్వాత బాబా సరదాగా, “బాపూసాహెబ్, కొన్నిరోజుల క్రితం నీకు నూట ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాను. వెళ్లి తీసుకొనిరా” అనేవారు.

అప్పుడు జోగ్ బాబాతో, “బాబా మీరు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇచ్చారని” చెప్పేవారు. ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత, బాపూసాహెబ్ కోపంతో, “బాబా, మీ డబ్బు లావాదేవీలతో నాకు సంబంధం వద్దు. మీ డబ్బుని వేరే ఎవరి వద్దయినా ఉంచుకోండి” అన్నారు. అప్పుడు బాబా, “బాపూసాహెబ్, కోపం తెచ్చుకోవద్దు! నేను పొరపాటు చేశాను, అవి వంద రూపాయలే, సరేనా!” అని చెప్పారు.

ఒకసారి ఒక భక్తుడు బాబాకి ఒక గినియా ఇచ్చాడు. బాబా దానిని బాపూసాహెబ్ కి ఇచ్చి, “ఇది ఏమిటి?” అని అడిగారు. అతను బాబాతో అది ఒక గినియా అని, అది పదిహేను రూపాయలకు సమానమని చెప్పారు. బాబా, “ఇది ముప్ఫైరూపాయల విలువైనది. దీనిని నీ వద్ద ఉంచి, నాకు ముప్ఫైరూపాయలు ఇవ్వు” అన్నారు.

1912 జనవరి 19న బాబా భక్తుడైన మేఘ మరణం తరువాత 1918లో సాయిబాబా మహాసమాధి చెందేవరకు బాబాకు ఆరతి ఇచ్చే గౌరవం జోగ్ కే ఇవ్వబడింది. అప్పటినుండి బాబాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఇతనే చూసుకునేవారు. మశీదు మరియు చావడిలో ఆరతి పూజను రోజుకు మూడుసార్లు చొప్పున బాబా మహాసమాధి పర్యంతం జోగ్ చేసేవారు. బాబాకు పూజతో పాటు, అతను ఒక ప్రసిద్ధ సంస్కృత పండితుడు కావడం వలన యాత్రికులు, సందర్శకుల కోసం ప్రతిరోజూ సాఠేవాడాలో జ్ఞానేశ్వరి మరియు ఏకనాథ భాగవతం పఠించేవారు.

మేఘ చేసిన అన్ని సేవలూ బాపూసాహెబ్ జోగ్ భుజస్కందాలపై పడ్డాయి – ద్వారకామాయిలో బాబా ఆరతులు, సాయంత్రం దీక్షిత్ వాడాలో మరియు గురుస్థాన్ వద్ద ఆరతి వంటివి. బాపూసాహెబ్ తన విధులను బాధ్యతగా తీసుకున్నారు. సాధారణంగా ఆరతికి గణనీయమైన సంఖ్యలో భక్తులు ఉండేవారు. ఏదేమైనప్పటికీ, ఆరతికి ఎవరున్నా, లేకపోయినా పట్టించుకోకుండా అతను మాత్రం భక్తితో ఉత్సాహంగా బాబాకి ఆరతి నిర్వహించేవారు.

బాపూసాహెబ్ మరియు తాయిబాయి కాఠిన్యమైన జీవితాన్ని కొనసాగించారు. వారు ఉదయాన్నే 3 గంటలకి  లేచి, దీక్షిత్ వాడా వద్ద ఉన్న బావి దగ్గర చల్లటి నీటితో స్నానం చేసి,  వారి గృహదేవతలకు మతపరమైన ఆచారాలతో కడు నిష్ఠగా “పూజ” చేసిన తరువాత గ్రంథపఠనం చేసేవారు.

అప్పుడు వారు బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళేవారు. బాపూసాహెబ్ బాబా ప్రక్కన ఉండి అవసరమైన అన్ని పనులను చేసేవారు. తాయిబాయి ఇంటికి వెళ్లి ఆరతి కోసం నైవేద్యం సిద్ధం చేసేవారు. బాబా తమ వద్దకు పంపిన అసంఖ్యాకమైన అతిథులకు కావలసిన అవసరాలు చూసేవారు.

(Source: Baba’s Rinanubandh and Baba’s Vaani by Vinny Chitluri

http://www.saiamrithadhara.com/mahabhakthas/bapu_saheb_jog.html

http://bonjanrao.blogspot.in/2012/08/bapusaheb-jog.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles