Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయి బంధువులు అందరికి సాయిరాం.
నేడు నేను మీతో శ్రీ సాయితో నా అనుభవాన్ని పంచుకుంటాను. అది 1991లో జరిగినది. నేను సాయిబాబా యందు నమ్మకం పెంచుకుంటున్న తోలి రోజులలో జరిగినది ఈ సంఘటన. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తు హాస్టల్లో ఉంటున్నాను. నేను ఒకప్పుడు దగ్గరలో ఉన్న చోట జరిగే ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. నాలుగు రోజుల్లో కళాశాలకు తిరిగి రావలసి ఉంది.
దురదృష్టవశాత్తు, ఫంక్షన్ లో నాకు కండ్లకలక సోకింది. అది ఒక అంటువ్యాధి కూడా అందువలన నేను ఫంక్షన్ మధ్యలో ఉన్నప్పుడు హాస్టల్లోకి తిరిగి రావలసి వచ్చింది. మరుసటిరోజు ఉదయానికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నా రూమ్మేట్ కి కూడా కండ్లకలక సోకింది. నా రూమ్మేట్ చాలా అమాయికురాలు, బలహీనమైనది మరియు సున్నితమైనది.
నేను ఆమెను చాలా ఇష్టపడతాను. నేను ఎల్లప్పుడు ఆమెను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాను. నావలననే ఆమెకు ఈ కష్టం వచ్చిందని నేను చాలా బాధ పడ్డాను. ఈ కండ్లకలక వ్యాది ఎలాంటి మందు వాడినప్పటికీ కనీసం నాలుగు రోజులు ఉంటుంది. డానికి తోడు నా స్నేహితురాల చాలా బలహీమైనది అందువలన ఆమె నొప్పి భరించలేదని నేను భావించాను.
నేను ఉదయం 10 గంటలకు కళాశాలకు బయలుదేరుతుండగా, ఆమె తన కళ్ళలో చాలా నొప్పిగా మరియు దురదగా ఉన్నాయని చెప్పింది. నావలన తనకెంత కష్టం వచ్చిందని నేను చాల భాధ పడి నా బాబాకు ప్రార్థన చేసి ఆమె నుదుటి మీద ఊధి పెట్టి, ఆమెతో నిద్ర పొమ్మని చెప్పాను.
తరువాత నేను కాలేజీ కి వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్నం భోజన కోసం నేను వచ్చినప్పుడు ఆమె కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తాన్నయని, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమి జరిగిందో తెలుస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
నా స్నేహితురాలికి సాయిబాబాపై ఎటువంటి నమ్మకం లేదు కానీ, ఆ రోజు ఆమెకు నిద్రలో బాబా కనిపించి, తన వద్దకు వచ్చి అయన తమ చేయి ఆమె నుదిటిపై ఉంచి తరువాత వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆమె కూడా బాబాను నమ్మటం ప్రారంభించారు.
ఇదంతా బాబా నాకోసమే చేసారని నేను చాలా ఆనందించాను, ఎందుకంటే క్లాసు రూమ్ లో కూడా నా స్నేహితురాలి గురించి నేను చాలా బాధపడి నేను బాబాను ప్రార్థిస్తునే ఉన్నాను. ఆయన నా ప్రార్ధన మన్నించి ఆమెకు నయం చేసారు.
ఈ విధంగా నా బాబా ఎల్లప్పుడూ నాతో ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన అక్కడ సాయి యందు భక్తీ వలన ఆయన ఉనికిని నేను ఎల్లప్పుడూ గుర్తించాను. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. బాబా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అని చాలా బాగా తెలుసు. సాయిదేవా! నా జీవితంలో ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి మార్గనిర్దేశం చేయండి.
నవిత
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పోలియోని నయం చేసిన బాబా–Audio
- ఆరోగ్యం బాగోలేని నా తమ్మునికి , స్వయంగా బాబా వారే ఆపరేషన్ చేసి జబ్బును నయం చేసిన వైనం …రవి కుమార్
- మందులతో నయం కాని భక్తురాలి బాధను, షిరిడీకి రప్పించుకుని నయం చేసినా బాబా వారు….Audio
- హంసరాజ్ యొక్క ఉబ్బసం వ్యాధిని నయం చేసిన బాబా వారి లీల—Audio
- ”నీ కామెర్లు ని బాబా గారు తీసేసుకున్నారు. నీకు నయం అయిపోయింది .”
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments