సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 5 వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి –   5 వ.భాగమ్

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి

శ్రీ సాయి సత్ చరిత్ర 39వ అధ్యాయంలో బాబాకు సంస్కృత పరిజ్ఞానమ్ ఉందన్న విషయం మనం గమనించవచ్చు. నానా చందోర్కర్ కి “తత్విధ్ధి ప్రణిపాతేన….” భగద్గీత శ్లోకానికి చక్కని వివరణ ఇచ్చి తనకు సంస్కృత  పరిజ్ఞానం కూడా కలదని నిరూపించారు.  ఇప్పుడు మీరు చదవబోయే భాగంలో బాబాకి సంస్కృతంలో సంపూర్ణమయిన పరిజ్ఞానం కలదని నిరూపించే సంఘటనలు సజీవ సాక్ష్యాలు.

1988 లో ఆయన కొంతమంది భక్తులతో కలిసి నాగపూర్ దగ్గర పరడసింగ వెళ్ళారు.  అక్కడ అవధూతయిన అనసూయ మాతని దర్శించుకున్నారు.  ఆవిడ వారందరినీ ఒక మాతృ మూర్తిగా ఆహ్వానించి తన ఆశ్రమానికి తీసుకునివెళ్ళారు.

ఆయన ధ్యానంలో కూర్చున్నపుడెల్లా బాబా ఆయనకి సందేశాలను ఇవ్వసాగారు.  1989 జనవరి ఒకటవ తారీకున ఆయన షిరిడీలో ఉన్నారు.  ఆరోజున బాబా తాను ప్రసాదించిన సందేశాలన్నిటిని సామాన్య ప్రజల ఉపయోగార్ధం ఒక పుస్తక రూపంలో ప్రచురించమని ఆదేశించారు.  అప్పటికే బాబా ఆయనకు సందేశాలన్నిటినీ తెలుగులోనే ఇచ్చారు.  మూడు సందేశాలను మాత్రం ఆంగ్లంలో ఇచ్చారు.

బాబా ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన తనకు తెలుగులో ప్రసాదించిన సందేశాలన్నిటిని పుస్తక ప్రచురణ కోసం ఆంగ్లంలోకి తర్జుమా చేసారు.  తెలుగులో ఇవ్వబడ్డ సందేశాలను తెలుగులో ‘సాయి తత్వ సందేశాలు”  అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

ఎవరయినా కష్టాలలో ఉన్నపుడు వారి క్షేమం కోసం వారి తరపున కూడా ప్రార్ధన చేయమని బాబా ఆయనని నియమించారు.  బాబా బి.వి.రావు గారికి ఇచ్చిన సందేశాలన్నిటినీ ఆయన భార్య మణిగారు ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో వ్రాస్తూ ఉండేవారు.  బాబా ఆయనకు ధ్యానంలో 350 కి పైగా సందేశాలను ఇచ్చారు.  మణిగారు వాటినన్నిటిని ఉన్నదున్నట్లుగా రాసారు.  అవన్నీ కూడా పుస్తకరూపంలో ప్రచురింపబడ్డాయి.  ఈ సందేశాలన్ని ప్రతిఒక్కరి ఉపయోగార్ధం “సాయి తత్వ సందేశ్’ అనే పేరుతో ఆంగ్ల పుస్తకంలో కూడా ప్రచురింపబడ్డాయి.  ఇవన్నీ బాబా మనకందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపే అమూల్యమయిన సందేశాలు.

ఆయన ధ్యానంలో కూర్చున్నపుడు బాబా ఆయనకు సంస్కృతంలోకూడా సందేశాలను ఇస్తూ ఉండేవారు.  ఒక్కొక్కసారి బాబా ఆయనకు సంస్కృత శ్లోకాలను కూడా ప్రసాదిస్తూ ఉండేవారు. రావుగారికి సంస్కృతం రాదు.  ఒకసారి బాబా ఆయన నోటివెంట ఒక సంస్కృత శ్లోకాన్ని పలికించారు.  ఆయన భార్య ఆ సంస్కృత శ్లోకాన్ని యధాతధంగా రాసారు.  ఆయనకు కొంతమంది బాబా భక్తులు స్నేహితులు.  వారిలో కొంతమంది సంస్కృత పండితులు కూడా ఉన్నారు.

బాబా ఆయన నోటివెంట పలికించిన సంస్కృత శ్లోకాలన్నిటికి అర్ధాలు హైదరాబాదులో ఉన్న సంస్కృత పండితులందరినీ సంప్రదించి తెలుసుకుంటూ ఉండేవారు.  ఒకసారి ఒక సంస్కృత శ్లోకానికి అర్ధం హైదరాబాదులోని ఏ ఒక్క సంస్కృత పండితుడూ చెప్పలేకపోయాడు.  ఎంతో మందిని అడిగినా ఎవ్వరూ దాని అర్ధం విడమరచి చెప్పలేకపోయారు.   రావుగారు, ఆ శ్లోకానికి అర్ధం, వ్యాఖ్యానం తెలియకపోవడం వల్ల తాను రాస్తున్న భాగాన్ని అక్కడితో ఆపేశారు.  రచన ఇంక ముందుకు సాగలేదు.  అపుడు బాబా ఆయనకి ఒక సందేశం ఇచ్చారు.

“బెంగళూరులోని మైసూరు రోడ్డులో ఉన్న శ్రీరాజ రాజేశ్వరి దేవాలయ ఆశ్రమంలో ఉన్న స్వామీజీని కలుసుకో. ఆయన నీకు ఆ శ్లోకానికి అర్ధం చెబుతారు”   

అపుడాయన బెంగళూరుకు బయలుదేరి వెళ్ళారు.  ఆయన బెంగళూరు వెళ్ళినపుడు రచయిత (శ్రీ బొండాడ జనార్ధనరావుగారు) బెంగళూరులోనే ఉన్నారు.  ఆయన రావుగారిని పూజ్యశ్రీ రత్నపురి స్వామీజీగారి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు.  స్వామీజీ రావుగారు ఇచ్చిన సస్కృత శ్లోకాన్ని చదివి ఎంతగానో సంతోషించారు.  ఆయన తన శిష్యులనందరినీ సమావేశపరిచి దాని అర్ధం, ఆ శ్లోకం  ఏ వేదంలో ఏభాగంలో ఉన్నదో విశదంగా తెలియచేసారు.

అది చాలా ముఖ్యమయిన శ్లోకం.  దురదృష్టవశాత్త్లు రచయిత ఆ శ్లోకం, దాని అర్ధం మర్చిపోయారు.  ఇది 1990 వ.సంవత్సరంలో జరిగింది.

రేపు తరువాయి బాగం……

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles