Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 4 వ.భాగమ్
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి
బాబా మనపై ప్రతిక్షణం అన్ని విషయాలలోను తమ అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారనడానికి, మనకు మార్గదర్శకులుగా ఉన్నారని చెప్పడానికి రావుగారికి కలిగిన అనుభవాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
ఆయనకు రాబోయే ఆపదలను బాబా ముందుగానే తెలియచేస్తూ ఉండేవారు. 1987 వ.సంవత్సరం జనవరి 4వ.తారీకున తెల్లవారుఝామున ఆయనకు బాబా కలలో దర్శనమిచ్చి, జనవరి 4 (అదే రోజు) ఉదయం 10.30 తరువాత నుంచి ఆయనకు ఆరోజు మంచిది కాదని చెప్పారు. బి.యు.రావు గారు తన కుటుంబసభ్యులతో, తనను ఆస్పత్రిలో చేర్పించ వద్దని ముందుగానే చెప్పారు.
బాబా సూచించిన సమయానికి సరిగ్గా ఆయనకు సుస్తీ చేసి తెలివితప్పింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. చాలా సీరియస్ అయింది. ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆయనను దగ్గరలోనే ఉన్న హైదరాబాద్ లోని మహావీర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడి డాక్టర్స్ ఆయనను పరీక్షించి ఆయనకు సెరిబ్రల్ హెమరేజ్ వల్ల పూర్తిగా పక్షవాతం వచ్చిందని, బ్రతికే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళిపొమ్మని చెప్పారు. ఆయనని మధ్యాహ్నం 1.30 కు సికిందరాబాదులోని గాంధీ ఆస్పత్రిలొ చేర్పించారు. అక్కడి డాక్టర్స్ కూడా ఆయనకి సెరిబ్రల్ హెమరేజ్ అని నిర్ధారించి వెంటనే ఆయనను ఐ.సి.యు. లోకి తీసుకునివెళ్ళారు. ఆయనకు వైద్యం జరుగుతుండగా ఆయన భార్య, ఆయన తలవద్ద బాబా దీవిస్తున్నట్లుగా ఉన్నఫొటో, ఆయన చొక్కా జేబులో ద్వారకామాయి ఫోటో ఉంచారు. నుదిటి మీద బాబా ఊదీ రాసారు.
అక్కడ డాక్టర్స్ లో ఒకాయన బహుశ నాస్తికుడయి ఉండచ్చు, ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఇదంతా గమనించి, ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, బాబాయే కాదు ఎవ్వరూ కూడా ఆయనని బ్రతికించలేరని చెప్పాడు. కొంతసేపటి తరువాత ఆయన శరీరంలో కాస్త కదలిక వచ్చింది. కాని ఆయన శరీరభాగం కుడివయిపు మొత్తం పక్షవాతం వల్ల కదలిక లేకుండా ఉంది. కొంతసేపటి తరువాత బాబా అనుగ్రహం వల్ల ఆయన శరీరంలో కుడివైపున కూడా కదలిక వచ్చింది.
రాత్రివేళ ఆయనకు తెలివి వచ్చింది. తనని ఆస్పత్రిలో చేర్పించినందుకు అందరినీ కేకలేసారు. ఆరాత్రే తను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పారు. అంత అర్ధరాత్రివేళ వెళ్ళడం మంచిది కాదని ఆయనకు నచ్చ చెప్పారు. రచయిత (శ్రీబొండాడ జనార్ధనరావు) ఆసమయంలో మైసూరులో ఉన్నారు. శ్రీరావుగారికి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిన విషయం ఆయనకు మైసూరులో ఉండగా తెలిసింది. విషయం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాదు చేరుకున్నారు. వెన్వెంటనే ఆయన రావుగారిని చూడటానికి ఆస్పత్రికి వచ్చారు.
ఆయన ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి వైద్యం ఇంకా జరుగుతుండగానే డిశ్చార్జి చేసేసినట్లు చెప్పారు డాక్టర్స్. ఒక సీనియర్ గవర్నమెంట్ డాక్టర్ అయిన శ్రీ ఎ.ప్రభాకరరావు గారి నుండి, మరొక బంధువు నుండి లిఖితపూర్వకంగా కాగితం వ్రాయించుకుని వారి సమక్షంలో డిస్చార్జి చేసామని చెప్పారు డాక్టర్స్.
షిరిడీ సాయిబాబా శక్తి వల్లే తనకు నయమవుతుందని, ఆ నమ్మకం తనకుందని అందువల్ల తనకి ఏ ఆస్పత్రిలోను వైద్యం చేయించుకోవడం ఇష్టం లేదని అన్నారని డాక్టర్స్ చెప్పారు. ఆయన విపరీత ప్రవర్తనకి ఆయనకి సేవ చేసిన నర్సులు కూడా చాలా ఆశ్చర్యపోయారని చెప్పారు. ఆ తరువాత రావుగారు పూర్తిగా ఆరోగ్యవంతులయారు.. బాబాకు అసాధ్యమన్నది ఏదీ లేదు.
రేపు తరువాయి భాగం……
తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 3 వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 2 వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 6. వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 8. వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 5 వ.భాగమ్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 4 వ.భాగమ్”
సాయినాథుని ప్రణతి
June 26, 2017 at 6:17 amఉదయానె ఈ లీల చదివేను సాయి ఎంతో ఆనందంగా అనిపించింది . నా ఆనందాని చెబుతాను గత 6 నెలల నుంచి చాలా ఇబందులు పడుతునాం సాయి .శిరిడీ వెలోచాకా చాలా సంతోషించం.అలాగె మా అత్తగారి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకునాను .అనుకోకుండ మాఅత్తగారు సచ్చరిత్ర పారాయణ మొదలు పెటారు 7 రోజు చదువుతానానారు అదేరోజు నా చిన్న తల్లి( నా చిన్న బిడ్డకు) బాబా కల్లలో దర్శనం ఇచ్చరాట .ఎంత ఆనందించిందో తను.తనక్కోక్కటే కాదు మా అందరికి మోతం కుటుంబానికి బాబా దర్శనం ఇచ్చినట్లు కల్ల వచిందని చెపింది సాయి.ఎంతో ఆనందించాను .ఇక మా అందరి సమస్యలు బాబా చుసుకుంటారు అని చాలా ఆనందం కలిగింది సాయి.నిన్న సత్సంగంలో గురువుగారి దర్శనంతో చాలా సంతోషించాను.నిజంగా బాబా సశరీరులుగా దర్శించిన వాలు మాత్రమే కాదు మనం కూడ ఎంత అదృష్టవంతులం ఇంలాంటి ఆనందాని మనస్సార ఆస్వదించగలుగుతున్నాం అనిపించింది సాయి .
Sai Suresh
June 26, 2017 at 12:57 pmమీ అనుభూతి చాలా బాగుంది సాయి