సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 3 వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి –  3 వ.భాగమ్

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి

శ్రీ  షిరిడీ సాయిబాబా దయాసముద్రుడు.  ఆయన ప్రేమని మనం చాలా సులభంగా పొందగలం.  ఈ విషయం మన సాయి భక్తులందరికీ అనుభవమే.  ఉమామహేశ్వరరావుగారు తమకు కలిగిన అనుభూతులు, అనుభవాల ద్వారా మన సాయిభక్తులందరికీ బాబాను మరింత దగ్గరకు చేర్చారు.  సాయి తత్వప్రచారానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసారు.  ఆయనకు బాబాతో పాటుగా ఇతర సత్పురుషులు, దేవీ దేవతల దర్శనానుభూతులు కలిగాయి.  అయినా ఆయన చాలా సామాన్యుడిలాగే, ఎటువంటి గర్వం, అహంకారం లేకుండా జీవితాన్ని గడిపారు.  అందరికీ ఆధ్యాత్మికంగా ఎటువంటి సహాయం చేయడానికైనా తయారుగా ఉండేవారు.  ఆవిధంగా ఆయన ఎంతో వినయ సంపన్నుడిగా ప్రసిధ్ధి గాంచారు.

పదవీ విరమణ చేసిన తరువాత ఆయన గడిపిన జీవితం అతి ముఖ్యమయినదనే చెప్పాలి.  ఆకాలంలోనే ఆయన ఆధ్యాత్మికంగా ఎంతగానో ఉన్నత స్థితిని పొందారు.  1978లో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమయి దశలవారీగా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కసాగారు.  ఆధ్యాత్మిక ప్రగతిలో సర్వోన్నత స్థాయికి చేరుకున్నారు.  పోలీసు శాఖలో అత్యున్నత పదవిలో ఉన్నా గాని, ఆతరువాత బాబా సేవలో తానెక్కువ ఆనందాన్ని పొందినట్లు చెప్పారు.

పదవీ విరమణ చేసి గడుపుతున్న రోజులలోనే ఆయన సాయితత్వ ప్రచార బాధ్యతలను చేపట్టారు.  1985 లో బాబా ఆయనకు కలలో కనిపించి ఒక మాసపత్రికను ప్రారంభించి  తత్వప్రచారం చేయమని ఆదేశించారు.  అదేరోజు రాత్రి మరొక భక్తుడయిన శ్రీయూసఫ్ ఆలీ ఖాన్ కు కూడా కలలో దర్శనమిచ్చి శ్రీ బి.యు.రావుగారికి పత్రిక ప్రారంభించడానికి కావలసిన సహాయం చేయమని ఆదేశించారు.  అంతేకాదు, ప్రారంభింపబోయే మాసపత్రికకు ‘సాయిప్రభ’ అని పేరుపెట్టమని కూడా సూచించారు.

పత్రిక ప్రారంభించడానికి కావలసిన ఆర్ధిక వనరుల విషయాన్ని బాబాకే వదిలేసి, పత్రిక ప్రారంభించడానికి ఇద్దరూ ఉద్యుక్తులయ్యారు.  1985 విజయదశమి రోజున ‘సాయిప్రభ’ ప్రత్యేక సంచిక వెలువడింది. ఆతరువాత శ్రీ వి. నారాయణరావుగారు కూడా సహాయం చేసారు.  ఆవిధంగా బాబా ఆదేశాల ప్రకారం ఆయన మార్గదర్శకత్వంలో బి.యు.రావుగారు మాసపత్రికను విజయవంతంగా ప్రచురించసాగారు.

1985 లో ఆయన షిరిడీ వెళ్ళినపుడు బాబా అంకిత భక్తుడయిన మహల్సాపతి కుమారుడయిన శ్రీమార్తాండ్ మహరాజ్ ను, మనుమడయిన శ్రీ అశోక మహల్సాపతిలను కలుసుకున్నారు.

1985లో విజయవాడలో 49 రోజులపాటు బాబా నామసప్తాహం జరిగినపుడు అందులో రావుగారు కూడా పాల్గొన్నారు.  ఆసమయంలో ఒక రోజు బాబా ఆయనకు కలలో కన్పించి ధ్యానంలో కూర్చోమని ఆదేశించారు.  సప్తాహం చివరి రోజున ఆయన ధ్యానంలో కూర్చొన్నారు.  ధ్యానంలో ఆయనకు శ్రీదత్తాత్రేయ, జీసస్ క్రైస్ట్, శ్రీరామకృష్ణ పరమహంసల దర్శన భాగ్యం కలిగింది.

1986వ.సంవత్సరంలో ఒక రోజున ఆయన మూత్ర విసర్జనకై వేకువజామున లేచారు.  అపుడాయన హైదరాబాదులో తన ఇంటిలోనే ఉన్నారు.  లేచి డ్రాయింగ్ రూములోకి వచ్చారు.  అక్కడ సోఫాలో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించాడు.  గాభరాగా “ఎవరది” అని గట్టిగా అరుస్తు సోఫా వద్దకు వచ్చారు.  అప్పుడాయనకు తళుక్కుమని మెరుపులాగ బాబా రూపం స్పష్టంగా కనిపించింది.  ఆవెంటనే బాబా అదృశ్యమయ్యారు.

1987వ.సంవత్సరంలో ఆయనకు ద్వారకామాయిలో బాబా నుంచి మొట్టమొదటి సందేశం వచ్చింది.  బాబాపై ఆయనకున్న నమ్మకం ఎన్నోరెట్లు పెరిగింది.  బాబా అనుగ్రహం వల్ల ఆయనకు అత్యధ్భుతమయిన అనుభవాలు, దివ్యదర్శనాలు కలగడం ప్రారంభమయ్యాయి.

ఆయనకు జీవతంలో ఎన్నో అనుభవాలు కలిగాయి.  ఆయనకు కలిగిన ఆ దివ్యానుభవాలను దగ్గరుండి వీక్షించిన ఆయన దగ్గరి బంధువులందరూ ఎంతో అదృష్టవంతులు.  ఆయనకు కలిగిన అనుభూతులన్నిటినీ వివరించి చెప్పడం సాధ్యంకాదు.

రేపు తరువాయి బాగం……

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles