సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 7. వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి –  7. వ.భాగమ్

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి

బాబాతో ఆయన సహవాసం చాలా సన్నిహితంగాను, దాదాపుగా క్రమం తప్పకుండా జరుగుతూ ఉండేదివారిద్దరి మధ్య ఉన్న అన్యోన్య సంబంధం ఎంత బలీయంగా ఉందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య  ఉన్న అనుబంధంలా  ఉండేది.

బాబా అనుగ్రహం వల్ల ఆయనకు 1987 లో దైవాలందరి దర్శనం లభించింది. అంతే కాదు సిధ్ధపురుషులయినటువంటి ఆదిశంకరాచార్య, నృసింహసరస్వతిస్వామి, శ్రీరాధాకృష్ణస్వామీజీ, శ్రిపాద వల్లభస్వామి, ఇంకా మరికొందరి దర్శనాలు లభించాయి.  అయనకు స్వప్నంలో కొంతమంది దేవీ, దేవతలు దర్శనమిచ్చారు.  ఆయనకు స్వప్నంలో ప్రత్యంగిరదేవి కూడా దర్శనమిచ్చింది.

ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు.  ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన సామాన్యుడిలాగానే జీవించారు.  సాయి తత్వాన్ని ప్రచారంలోకి తీసుకునిరావడంలో ఎంతగానో శ్రమించారు.  సాయి తత్వ ప్రాచారకునిగా ప్రసిధ్ధి చెందారు.

1991 వ.సంవత్సరం మే 6 వ. తేదీ సాయంత్రం ఆయన తీవ్రమయిన ధ్యానంలో ఉన్నారు.  ఆధ్యానంలో ఆయనకి వింతయిన, అసాధారణమయిన దృశ్యాలు, సంఘటనలు గోచరించాయి.  ఆ దృశ్యంలో ఒక పవిత్ర స్త్రీ మూర్తి ఒక యోగివలె తెల్లని దుస్తులు ధరించి దర్శనమిచ్చింది. ఆమె తన కురులను తలపై ముడివేసుకుని ఉంది.  మెడలోను, చేతులకి రుద్రాక్షమాలలు ధరించి ఉంది.  ఆమె రావుగారిని కొండలలోనుంచి, అరణ్యాలు తదితర ప్రదేశాల గుండా తీసుకుని వెడుతూ ఉంది. 

దారిలో ఆయనకు దివ్య పురుషులు, రాక్షసులు కనిపించారు.  ఆయన వారి గురించి ఆ స్త్రీమూర్తిని ప్రశ్నించారు.  అది నీకనవసరమయిన విషయం అని చెప్పింది ఆమె.  ఆయన ఆమెతో కలిసి వెడుతున్నపుడు దారిలో సమస్త దేవుళ్ళు, దేవీ దేవతలు కన్పించారు. ఆయన వారందరికీ తన ప్రణామాలు అర్పించబోతే ఆమె వద్దని వారించింది. 

వారిద్దరూ నడిచే దారి నడవడానికి చాలా కఠినంగా ఉంది. నడవటానికి ఏమాత్రం అనువుగా లేదు. హటాత్తుగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురవడం మొదలయింది.  వాతావరణం చాలా భయంకరంగా ఉంది.  ఆవాతావరణానికి రావుగారిలో ఎటువంటి భయం లేకపోవడం గమనించింది ఆ స్త్రీమూర్తి.  ఆఖరికి ఆమె ఆయనను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. 

ఆప్రదేశమంతా వజ్రం నుండి వెలువడే దివ్యమయిన తెల్లని కాంతిలా తళతళా మెరిసిపోతూ ఉంది. ఆ కాంతి మిరుమిట్లు గొలుపుతూ కళ్ళు పోతాయేమోనన్నంత ప్రకాశవంతమయిన వెలుగు.  ఆ వెలుగుకి తన కళ్ళు దెబ్బ తింటాయేమేనని వెంటనే  కళ్ళు మూసుకున్నారు రావుగారు. 

ఆతరువాత కళ్ళు తెరచి చూడగానే, లోపల పెద్ద సింహాసనం దానిపైన లలితా త్రిపుర సుందరీదేవి కనిపించింది.  ఆమె నుంచి దేదీప్యమానంగా ప్రకాశవంతమయిన కిరణాలు ఎన్నో వెలువడుతూ ఉన్నాయి.  ఆ దేవి విలువయిన ఆభరణాలెన్నిటినో ధరించి ఉంది.  హస్తాలలో ఆయుధాలను ధరించింది.

అప్పుడు ఆ దేవికి సాష్టాంగనమస్కారం చేసుకోవడానికి అనుజ్ఞ ఇచ్చింది ఆ పవిత్ర స్త్రీమూర్తి.  ఆవిధంగా ఆయనకు ‘మణిద్వీప’ దర్శనం లభించింది.  ఆదేవి అనుగ్రహం లభించింది.  బాబా అనుగ్రహం వల్లనే తనకటువంటి దివ్యదర్శనం లభించిందని ఆయన ఎంతగానో పొంగిపోయారు.

1992వ.సంవత్సరంలో ఆయన బాబాపై తీవ్రమయిన ధ్యానం చేస్తున్నారు.  ఆధ్యానంలో బాబా తనకు దర్శనమివ్వాలనే సంకల్పంతో ఉన్నారు. ధ్యాన సమయంలో తన ముందు బాబా భిక్షాటన చేస్తున్నటువంటి ఫొటో పెట్టుకున్నారు.

అపుడు బాబా ఆయనతో “నువ్వు ఒక అజ్ఞానివి.  నాదర్శనం నీకు లభిస్తే నానుంచి వెలువడే దివ్యకాంతిని చూసి నువ్వు తట్టుకోలేవు.  ఆకాంతి వల్ల నీకళ్ళు కూడా పోతాయి” అన్నారు.  కాని ఆయన బాబా చెప్పిన హెచ్చరికని లక్ష్యపెట్టక రోజంతా ధ్యానంలోనే గడిపారు. 

మొదటి 5 రోజులు కేవలం ద్రవాహారమే తీసుకుని ధ్యానం కొనసాగిస్తూ వచ్చారు.  6వ.రోజు నుండి ద్రవాహారాన్ని కూడా తీసుకోవడం మానేసి 12 రోజులదాకా ధ్యానంలోనే కూర్చున్నారు. 12 వ.రోజున బాబా ఆయనకు దర్శనమిచ్చారు. తన సహజమైన దేదీప్యమానమయిన దేహంతో కాక,  రావుగారి నేత్రాలకు హాని కలుగని రీతిలో బాబా దర్శనమిచ్చారు.  రావుగారు తన ముందర పెట్టుకున్న ఫొటోలో ఉన్నట్లుగా దర్శనం లభింపచేసారు.  ఆవిధంగా తనకు బాబా దర్శన భాగ్యం లభించినందుకు ఆయన ఎంతగానో సంతోషించారు.

(రేపటి సంచికలో : శ్రీ భారం ఉమామహేశ్వరరావుగారు గత జన్మలో ఎవరు? ఎదురు చూడండి)

రేపు తరువాయి బాగం……

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles