Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 6. వ.భాగమ్
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి
1990 జనవరి 25వ.తారీకున బాబా ఆయనకు ఒక సందేశం ఇచ్చారు. రాబోయే ఆదివారం ఫిబ్రవరి, 4, 1990 నీజీవిత చరమాంకం. దానికి తయారుగా ఉండు అని ఆయనకు ధ్యానంలో సందేశమిచ్చారు. ఆయన జాతకం ప్రకారం కూడా అది వాస్తవం. బాబా ఆయనను తన నామస్మరణ చేయమని, బిల్వపత్రాల రసం త్రాగమని సలహా ఇచ్చారు. బాబా ఇచ్చిన ఈ సందేశం దగ్గరి బంధువులందరికీ ఒక్కసారిగా తీవ్రమయిన ఆఘాతం కలిగించింది. రాబోయే ఉపద్రవం గురించి బంధువులందరికీ తెలియపరిచారు.
మరలా జనవరి 28వ.తారీకున మరొక సందేశం ఇచ్చారు రావుగారికి. బంధువులందరినీ స్నేహితులను ప్రత్యేకంగా ఒకరోజు చెప్పి ఆరోజున వారినందరినీ రమ్మని వారందరినీ కూడా భక్తి శ్రధ్ధలతో వారి చేత నామజపం చేయించమని చెప్పారు.
ఫిబ్రవరి 3వ.తారీకు మధ్యాహ్నం బాబా ఆయనకు మరొక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో 7000 సంస్కృత శ్లోకాలు ఉన్నటువంటి శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన “గురు సంహిత” పారాయణ 3వ.తేదీ రాత్రికి ఏర్పాటు చేయమన్నారు. మరుసటిరోజు (ఫిబ్రవరి 4) దత్తహోమం చేయించమని చెప్పారు. ‘గురు సంహిత’ ఒక్కటే గ్రంధం ఉండటం వల్ల ఆయన సన్నిహితులందరూ ఆ ఏడువేల శ్లోకాలను అధ్యాయాల వారీగా కాపీలు తీయించారు. 3వ.తేదీ రాత్రికల్లా 7000 శ్లోకాలు పారాయణ పూర్తి చేయించడానికి సంస్కృత పండితులందరినీ ఏర్పాటు చేశారు. అందరికీ అధ్యాయాలవారీగా కాపీలు ఇచ్చారు.
అదృష్టవశాత్తు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీబోధానంద స్వామిగారు కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి, రావుగారి ఇంటికి వచ్చారు. ఆయన మరుసటిరోజు ఉదయం వరకూ అక్కడే ఉన్నారు. 3వ.తేదీ రాత్రి మొత్తం 7000 శ్లోకాల పారాయణ పూర్తయింది. 4వ.తేదీ ఉదయం అందరూ గ్రూపులవారీగా నామజపం మొదలు పెట్టారు. నామజపం జరుగుతుండగా హోమం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఒక భక్తునికి లలితాసహస్రనామ పారాయణ కూడా పదకొండు సార్లు చేయాలనే సంకల్పం కలిగి పదకొండు సార్లు పారాయణ చేసారు.
ఎలాగయితేనేమి ఎటువంటి ప్రయత్నం చేయకుండానే 400 మందికి పైగా భక్తులు వచ్చారు. బాబా అంకిత భక్తుడయిన డా.రాఘవరావుగారు కూడా వచ్చారు. బాబా అనుగ్రహాన్ని కోరుతూ అందరూ బాబాని ప్రార్ధించసాగారు. మధ్యాహ్నం రెండు గంటలకి రావుగారి బి.పి.పడిపోయింది. నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. మానవ ప్రయత్నంగా ఆయనని బ్రతికించుకోవాలనే ఆశతో ఆయన కుమారుడు ఆక్సిజన్ సిలెండర్ తెచ్చి ఆక్సిజన్ పెట్టడానికి ప్రయత్నించాడు. కాని సిలెండర్ మూత పగిలిపోయి ఆక్సిజన్ పెడదామనుకున్నా లాభం లేకపోయింది.
కొంతసేపటి తరువాత బి.వి.రావు గారు మెల్లగా ఏదో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన నోటివెంట “బాబా, బాబా” అనే మాటలు వెలువడ్డాయి. అక్కడికి వచ్చిన భక్తులలో ఉన్న డాక్టర్స్ ఆయన నాడి పరీక్షించి నాడి చక్కగా కొట్టుకుంటోందని చెప్పారు. ఆవిధంగా బాబా తన అద్భుతమయిన లీలను ప్రదర్శించి రావుగారిని ఆపద నుంచి కాపాడి ఆయన జీవితాన్ని నిలబెట్టారు.
ఇదంతా జరుగుతున్నంత సేపు రచయిత కూడా అక్కడే ఉన్నారు. దీనికంతా ప్రత్యక్ష సాక్షి ఆయన. ఆవిధంగా రావుగారికి జీవితకాలం ఒక సంవత్సరం పొడిగింపబడింది.
ఇదే విధంగ బాబా ఆయన జీవితకాలాన్ని ఒక్కొక్క సంవత్సరం చొప్పున పదిసార్లు పెంచుతూ వెళ్ళారు. ప్రతిసారి బాబా ఆయనను ముందుగానే హెచ్చరిస్తూ సందేశం ఇచ్చేవారు. బాబా చెప్పిన ప్రకారం బి.వి.రావుగారు, బంధువులు, భక్తులు నామ జపం, పారాయణ నిర్వహిస్తూ వచ్చారు.
బాబా తన అనుగ్రహాన్ని, దయను బి.యు.రావు గారిపై కురిపించి ఆయన జీవిత కాలాన్ని 1990 నుండి 11 సార్లు ప్రతి సంవత్సరం పొడిగిస్తూ వచ్చారని చెప్పడానికి ఈ సంఘటనే సాక్ష్యం. ప్రతిసారి బాబా ఆయన జీవితకాలాన్ని ఒక్కొక్క సంవత్సరం పొడిగిస్తూ వచ్చారు. రావుగారికి గండం ఉందన్న రోజున విషయం తెలిసిన వెంటనే భక్తులందరూ, రావుగారు ఆయన బంధువులు పిలవకుండానే తమంత తాముగా ఆయన ఇంటికి వచ్చేవారు.
ప్రముఖ సాయి భక్తుడయిన డా.కె.వి.రాఘవేంద్రరావు గారు కూడా బి.వి.రావుగారి ఇంటికి వస్తూ ఉండేవారు. ఆ సమయంలో జరిగే సంఘటనలన్నీ గమనించేవారు. బాబా సూచించిన ప్రకారమే నామజపాలు, పారాయణలు అన్నీ యధాప్రకారం జరుగుతూ ఉడేవి. అవన్నీ ఆవిధంగా జరుగుతు ఉండటం వల్లనే రావుగారి జీవితకాలం ప్రతిసంవత్సరం పొడిగింపబడుతూ వస్తొందని చెప్పడానికి ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి. తను జీవించడానికి కారణభూతులు బాబాయేననే ధృఢ విశ్వాసంతో తన మిగిలిన 11 సంవత్సరాల జీవిత కాలమంతా బాబాసేవలోనే గడిపి తరించారు.
రేపు తరువాయి బాగం……
తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 5 వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 3 వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 4 వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 8. వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 7. వ.భాగమ్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments