సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 2 వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి –  2 వ.భాగమ్

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి సాయి

1968వ. సంవత్సరము నుండి ఆయనకు హృద్రోగ సమస్య ఉన్నా గాని, తన కుటుంబ బాధ్యతలను మాత్రం నిర్లక్ష్యం  చేయలేదు. భక్తి పూర్వకమయిన, ఆధ్యాత్మికమయిన జీవితాన్ని గడిపారు.  తనకు సంబంధించిన ప్రతి ఒక్కరి శ్రేయస్సుకోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. ఆయనకున్న హృద్రోగ సమస్య ‘ఆర్టరిక్ స్టెనోసిస్ రిగర్జిటేషన్’ గా గుర్తించి బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు.

(Aortic valve stenosis — or aortic stenosis — occurs when the heart’s aortic valve narrows. This narrowing prevents the valve from opening fully, which obstructs blood flow from your heart into your aorta and onward to the rest of your body.

When the aortic valve is obstructed, your heart needs to work harder to pump blood to your body. Eventually, this extra work limits the amount of blood it can pump and may weaken your heart muscle.

If you have severe aortic valve stenosis, you’ll usually need surgery to replace the valve. Left untreated, aortic valve stenosis can lead to serious heart problems.

Aortic valve regurgitation — or aortic regurgitation — is a condition that occurs when your heart’s aortic valve doesn’t close tightly. Aortic valve regurgitation allows some of the blood that was just pumped out of your heart’s main pumping chamber (left ventricle) to leak back into it.

The leakage may prevent your heart from efficiently pumping blood to the rest of your body. As a result, you may feel fatigued and short of breath.

Aortic valve regurgitation can develop suddenly or over decades. Once aortic valve regurgitation becomes severe, surgery is often required to repair or replace the aortic valve)

నాడి బలహీనంగా ఉండటం, సక్రమంగా కొట్టుకోకపోవడంవంటి సమస్యల వల్ల  చాలా సార్లు ఊపిరి అందక ఆయన సొమ్మసిల్లి పడిపోతూ ఉండేవారు.  1983లో ఆయనకు తీవ్రమయిన గుండె నొప్పి వచ్చినపుడు, బాబా ఆయనకు కలలో కనిపించి ఆయన నుదిటి మీద ఊదీని రాసారు. ఆ తరువాత ఆయనకు మెలుకువ వచ్చి చూడగా ఆయన నుదిటి మీద ఊదీ కనిపించింది.  ఆ ఊదీ వల్ల ఆయనకు ఉపశమనం కలిగింది.

ఆ తరువాత నవంబరు, 1983వ. సంవత్సరంలో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు బాబా ఫోటో నుండి తెల్లని దివ్యమైన కాంతి వచ్చి ఆయన గుండె వద్ద చర్మాన్ని చీల్చుకుని వెళ్ళినట్లుగా ఆయనకు అనుభవమయింది. వెంటనే ఆ ప్రదేశంలో ఆయనకు మంట పుట్టి ఆ కాంతి చర్మాన్ని తాకిన చోట వృత్తాకారంలో కాలిన మచ్చ కూడా పడింది. కాలిన చోట నుండి రక్తం స్రవించడం మొదలయింది.  ఆయన స్పృహ తప్పి పడిపోయారు.

ఆయనను మంచం మీద పడుకోబెట్టారు.  కాలినట్లుగా ఉన్న గుర్తులు ఆపరేషన్ అయిన తరువాత కుట్లు వేసినట్లుగా కుట్లు కనిపించాయి.  ఆ తరువాత ఆయనకు ఛాతీలో బరువుగా ఉండటం, తెలివితప్పి పడిపోవడంలాంటి సమస్యలన్నీ వెంటనే తగ్గిపోయాయి. ఆతరువాత  పూర్తిగా కోలుకున్నారు.

డాక్టర్స్ ఆయనకు అన్ని పరీక్షలు చేసారు.  రావు గారి పరిస్థితి సంపూర్ణంగా సాధారణ స్థాయికి వచ్చిందని, గుండె పనితీరు కూడా మెరుగ్గ ఉందని గమనించారు.  ఇది ఎలా జరిగిందో వారికి అర్ధం కాలేదు.  వారంతా అయోమయానికి గురయ్యారు. 

ఈ సంఘటన జరగడానికి నాలుగురోజుల ముందు ఆయన భార్యకి కలలో బి.వి.రావుగారు చనిపోయినట్లు, ఆయనను నలుగురు మనుషులు మోసుకుని వెడుతూ ఉండటం కనిపించింది.  ఆమెకు ఇది ఒక పీడకల, దుశ్శకునం.  ఏ విపత్తు సంభవించకుండా బాబా నివారించారు.  బాబా వైద్యులలోనే ఘనమయిన వైద్యునిగా శ్రీ బి.వి.రావుగారికి శస్త్ర చికిత్స చేసారు.

భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా దేవతలందరి తరఫున దివి నుండి భూవికి దిగి వచ్చిన ప్రత్యక్ష దైవం.  ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు.  ఆయన మన కళ్ళముందు సంచరించే ఒక ఆధ్యాత్మిక శక్తి.  ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుంచి కులమత భేదాలు లేకుండా ప్రజలందరినీ తనవైపుకు ఆకర్షించుకుంటున్న కారుణ్యమూర్తి.  ప్రజలను ఈతిబాధలనుండి, భయాలనుండి, బయటకు లాగి మానవ జాతిని ఉద్దరించడానికి వచ్చిన దయాసాగరుడు.  ఆయన ఈ భూమిపై నడిచేదైవం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

రేపు తరువాయి బాగం……

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

source: శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగు

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles