రాయికర్ మరియు డాక్టర్ జావేరి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

మహారాష్ట్రలోని పూణే కి చెందిన సాయి భక్తుడు డాక్టర్ జావేరి డిసెంబరు 12, 1934 న జన్మించారు. డాక్టర్ జావేరికి ఇద్దరు కుమారులు.

బాబా మహాసమాధికి కొన్ని సంవత్సరాలకు ముందు ముంబైకి చెందిన శ్రీ రాయికర్ శిరిడీ సందర్శించి, ద్వారకామాయిలో 7 రోజులపాటు బాబాతో కలిసి ఉన్నారు. ఆ 7 రోజులలో అతను బాబాతో ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు కలిగాయి. రాత్రివేళలో బాబాతో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన మిరకిల్స్ కూడా చూసారు. తరువాత అతను ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడు.

శిరిడీ విడిచి వెళ్ళేటప్పుడు బాబా అతనికి తమ పాదముద్రలు కలిగివున్న ఒక వస్త్రాన్ని ఇచ్చి, “నా సమాధి అనంతరం 20 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక వ్యక్తిని కలుసుకుంటావు. అతనికి ఈ వస్త్రంతో పాటు నేను ఇప్పుడు చెప్పబోయే గురుమంత్రం ఇవ్వు” అని చెప్పి, అతని చెవిలో ఒక గురు మంత్రాన్ని చెప్పారు. “ఆ వ్యక్తిని కలుసుకున్నప్పటి వరకు నీవు ఈ మంత్రాన్ని మరిచిపోతావు” అని కూడా బాబా చెప్పారు.

బాబా స్పష్టంగా అరచేతిలో ఒక చేప ఉన్నట్లు స్కెచ్ గీసి అతనికి చూపించి, “ఆ వ్యక్తిని చేతిలో ఇదే ముద్రతో గుర్తించి, ఈ వస్త్రం మరియు మంత్రాన్ని అతనికి ఇవ్వాలి” అని రాయికర్ తో చెప్పారు. బాబా ఇంకా అతనితో, “రెండు జతల పాదుకలు – ఒకటి రాతితో, రెండవది ఇత్తడితో తయారు చేయించమని ఆ వ్యక్తికి చెప్పు. నేనిప్పుడు ఇచ్చిన వస్త్రాన్ని పాదుకల వద్ద ఉంచి, ప్రతిరోజూ 36 సంవత్సరాల పాటు గురుమంత్రం జపించమని చెప్పు” అని బాబా చెప్పారు.

రాయికర్ అందుకు సమ్మతించి అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి ఆసక్తిని కనబరిచారు. రాయికర్ తన చివరి రోజులలో ముంబైలో ఒక ఆసుపత్రిలో చేరి, అక్కడ డాక్టర్ జావేరిని కలుసుకొన్నారు. అతని చేతిని చూసినప్పుడు, (రాయికర్ చేయి చూడటంలో దిట్ట. స్వయంగా బాబాయే అతని జీవనం కోసం నేర్పారు) అతనే బాబా చెప్పిన వ్యక్తి అని గుర్తించారు.

బాబా ఇచ్చిన చేప బొమ్మ కలిగివున్న అరచేతి రేఖల స్కెచ్ అతనికి చూపారు. తన చేతిలో సరిగ్గా అటువంటి చేప ఆకారం ఉండటంతో డాక్టర్ జావేరి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికీ అతను నమ్మలేకపోయారు.

అప్పుడు శ్రీ రాయికర్ బాబా చెప్పినట్లు సమీపకాలంలో డాక్టర్ జావేరికి జరుగబోయే రెండు సంఘటనలను చెప్పారు. శ్రీరాయికర్ చెప్పినట్లు జరగడంతో డాక్టర్ జావేరి అతని మాటలను విశ్వసించి అతనిని కలుసుకున్నారు.

అప్పుడు రాయికర్ బాబా పాదముద్రలు కలిగిన పవిత్ర వస్త్రాన్ని మరియు గురు మంత్రాన్ని డాక్టర్ జావేరికి ఇచ్చారు. ఆ తరువాత రాయికర్ తుదిశ్వాసను విడిచి బాబాలో ఐక్యమయ్యారు. రాయికర్ కి బంధువులు ఎవరూ లేని కారణంగా డాక్టర్ జావేరి అతని అంతిమ సంస్కారాలు చేసారు.

తరువాత బాబా ఆదేశించినట్లు బాబా పాదముద్రలు కలిగిన పవిత్రవస్త్రం ఆధారంగా రెండు జతల పాదుకలు తయారుచేయించి, ఆ పాదుకల మీద వస్త్రాన్ని ఉంచి, గురుమంత్ర జపం మరియు ధ్యానము ప్రారంభించారు డాక్టర్ జావేరి. అతను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ వస్త్రం అదృశ్యమై, పాదుకలలో విలీనం అయిపోయింది.

ఆ తరువాత బాబా తనను ఆదేశించినట్లు అతను రోజూ అర్థరాత్రి వరకు గురుమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. నిద్రపోయి మేల్కొన్న తరువాత గురుమంత్ర జపం మొదలుపెట్టేవాడు. అప్పటినుండి ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ప్రతిరోజూ 36 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ఈ సేవ చేసిన తరువాత, బాబా చెప్పినట్లు ఆ పాదుకలు ప్రతి ఒక్కరి దర్శనార్థం ఉంచారు.

ఈ పాదుకలు చాలా పవిత్రమైనవి. పూజా సమయంలో  బాబా పటానికి వేసిన పూలదండ దానంతట అదే పొడవు పెరిగి బాబా ఫోటోపై నుండి క్రింద ఉన్న పాదుకల చుట్టూ కవర్ చేసేదట. డాక్టర్ జావేరి ఇలాంటి పలు అద్భుతాలను చూశారు.

డాక్టర్ జావేరి శనివారం, అక్టోబరు 1, 2016న చికున్ గున్యా కారణంగా శనివారం తన తుదిశ్వాసను విడిచారు.

శ్రీ సాయిబాబా యొక్క పవిత్రమైన ఈ పాదుకలు పూణేలో డాక్టర్ జావేరి క్లినిక్ లో దర్శనార్థం అందుబాటులో ఉన్నాయి. సాయిభక్తుల ప్రయోజనం కోసం ఆయన చిరునామా క్రింద ఇస్తున్నాను.

Shree Aushadhalaya.
Shop No.2,
Radhakrishna Apartment,
Bajirao Road,
Infront of Prabhat Cinema,
Shaniwar Peth,
Pune – 411030
Maharashtra`India ~

అలాగే,  మరాఠీ మరియు హిందీ భాషలలో “Woh Sunhere 21 Din అనే ఉచితంగా లభించే పుస్తకము కూడా ఉంది. ఆ పుస్తకంలో పైన చెప్పబడిన లీల గురించి వివరంగా తెలియజేయడంతోపాటు, Mr. రాయికర్ బాబాతో శిరిడీలో ఉన్న 21 రోజులలో జరిగిన రోజువారీ అద్భుతాల గురించి వివరిస్తుంది. ఈ పుస్తకము బాబా యొక్క మిరకిల్స్ ను అర్థం చేసుకోవడానికి తప్పక చదవాలి.

sources: www.saileelas.com,

                   http://saiamrithadhara.com/flash_news_2016_01.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles