కృష్ణారావు జగేశ్వర్ భీష్మ ఐదవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కృష్ణారావు జగేశ్వర్ భీష్మ ఐదవ బాగం…

ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

శ్రీ భీష్మ ఒకసారి ఉపన్యాసం ఇవ్వడానికి ఉమ్రేడ్ కు వెళ్లారు. అతను అక్కడి నుండి మోహపాకు తిరిగి వచ్చేటప్పుడు ఒక నదిని దాటవలసి ఉంది. కాని ఆ నది భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. బండిని లాగుతున్న ఎద్దులు నదిలోకి ప్రవేశించడానికి నిరాకరించాయి. భీష్మ కళ్ళు మూసుకొని ఆ పరిస్థితి నుండి బయటపడవేయమని బాబాను ప్రార్థించారు.

వెంటనే ఎద్దులు నదిలోకి దిగి, వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం ప్రారంభించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు. భీష్మ కళ్ళు తెరిచి, సాయిబాబా తన ముందు నిలబడి ఉండటం చూసారు. భీష్మ బండి నుండి బయటికి దిగి బాబాకు ప్రణామం చేశారు. అదంతా చూస్తున్న వారికి ఎవరూ కనిపించకపోవడం వలన భీష్మ ఎవరికి వందనం చేస్తున్నారా అని వారు ఆశ్చర్యపోయారు.

భీష్మ భారతదేశ యాత్రకు బయలుదేరారు. 1930లో అతను రామేశ్వరం నుండి కాశీ వరకు, మళ్ళీ కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్రకు వెళ్లారు. చివరికి అతను 1933లో మోహపాకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు అతనిని సిద్ధపురుషునిగా అంగీకరించారు. అతను సామజిక సేవ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించారు. 1934 నుండి అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. 1935లో పవిత్రమైన నాగపంచమి రోజున ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కానీ, అతని అద్భుతమైన సంకల్పశక్తి కారణంగా మాత్రమే జీవించారు. ఆ సమయంలో అతను రామాయణంపై పరిశోధన చేస్తున్నారు.

ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1918వ సంవత్సరంలో బాబా సమాధి చెందిన తర్వాత అతడు ప్రతిరోజూ ఆహారం తీసుకోవడం మానివేసి, ఏడాదికి ఒకసారి మాత్రమే తీసుకునేవారు. అది సచ్చిదానంద స్వామి పండుగ అయిన మార్గశిర మాసంలోని ద్వాదశి రోజు మాత్రమే ఆహారం తీసుకునేవారు. మిగతారోజులలో అతను కేవలం పండ్లు, పాలు తీసుకోవడం ద్వారా మాత్రమే జీవనం కొనసాగించారు.

ఈ కాఠిన్యమైన జీవనం 17 సంవత్సరాల పాటు కొనసాగింది. అతను సమాధి చెందడానికి ఒక సంవత్సరం ముందు నుండి పాలు మాత్రమే సేవించడం ద్వారా తన జీవనాన్ని కొనసాగించారు. అలా భీష్మ ఒక గొప్ప యోగి జీవితాన్ని గడిపారు. ఒకరోజు అతని కోడలు రాముని పిలుపు వచ్చిందా అని అడిగినప్పుడు, భీష్మ తన మరణం గురించి అప్పటికే తెలిసి, ఆమెతో, “ఈ ప్రపంచంలో నుండి విడుదలవడానికి నా సమయం వచ్చింది, దయచేసి సచ్చిదానంద స్వామి యొక్క పవిత్ర తీర్ధం ఇవ్వండి” అని చెప్పారు.

అతని కోడలు వెంటనే సచ్చిదానంద స్వామి యొక్క పవిత్ర తీర్ధాన్నిత్రాగించింది. అతను “రామ్-రామ్” అని జపిస్తూ, పవిత్రతీర్థాన్ని స్వీకరించి, ఆగస్టు 8, 1935 శనివారం తన తుది శ్వాసను విడిచారు. ఒక ప్రకాశవంతమైన కాంతి తన శరీరం నుండి బయటకు వెళ్లి పంచభూతాలలో విలీనం అయింది. భీష్మ ఒక సాధు సత్పురుషునిలా జీవనం సాగించినందువలన అంత్యక్రియలలో అతని శరీరం కూర్చున్న స్థితిలో ఉంచబడింది.

మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తాలూకాలోని మోహపా గ్రామంలో శ్రీకృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ సమాధి ఉన్నది. నాగపూర్ నుండి కల్మేశ్వర్ రోడ్ కు 35 కిలోమీటర్ల దూరంలో మోహపా ఉంది.

అతని ముని మనవడు శ్రీప్రమోద్ భీష్మ తన ముత్తాత గారి వారసత్వం కొనసాగిస్తున్నారు.

భీష్మ అనుభవం ద్వారా మనం తెలుసుకోవలసిన సూక్ష్మాలు కొన్ని అర్థమవుతాయి. స్వప్నంలో మహాత్ముల దర్శనమైతే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలవుతాయి. అవెన్నటికీ వ్యర్థంకావు. మంత్రయోగ సంప్రదాయం ప్రకారం గూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరముండదు.

సాయిభక్తుల ప్రయోజనం కోసం శ్రీకృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ యొక్క మునిమనుమడు శ్రీప్రమోద్ భీష్మ యొక్క సంప్రదింపు వివరాలను క్రింద ఇస్తున్నాము:

Shri.Pramod Bhishma

C/o.Shri Sadguru Sainatha Sagunopasana Rachayita

Krishna Jageshwar Bhishma Pratishtana, Nagpur,

Trust Reg No.2818 (Nagpur) 2014,

Advaith Residency, Flat No.33,

Plot No.203, Kher Town,

Dhamarampet,

Nagpur-440 010,

Maharashtra,India

Contact Numbers: 0712 255 2196/ 94218 07013

Email: pramodbhishmasai@gmail.com

రేపుటి బాగంలో …. 1921 జూలై 11న వేదశాస్త్రి కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం. అందులో 1918కి ముందు జరిగిన కొన్ని బాబా లీలలు ఉన్నాయి.

(Source: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015)

http://www.saiamrithadhara.com/mahabhakthas/krishnashastri_jageshwar_bhishma.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles