కృష్ణారావు జగేశ్వర్ భీష్మ నాల్గవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కృష్ణారావు జగేశ్వర్ భీష్మ నాల్గవ బాగం…

ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

తర్వాత భీష్మ తన వసతికి వచ్చి, “నేను ఈ క్రొత్త ప్రదేశంలో ఎవరి సహాయం లేకుండా లడ్డులను ఎలా తయారు చేయగలను?” అని చింతలో పడ్డాడు. “నేను ఎవరి సహాయమైనా తీసుకుంటే బాబా వెంటనే తెలుసుకుంటారు. ఎందుకు ఆయన ఐదు లడ్డూలు అడిగారు? అదికూడా ప్రత్యేకంగా లడ్దూలే ఎందుకు అడిగారు?” అనే ఆలోచనతోనే అతను రోజంతా గడిపి, చివరికి అదే మనస్సులో ఆలోచిస్తూనే నిద్రపోయారు.

కానీ, ఉదయం మేల్కొంటూనే అతనిలో కవితాభావం ఉప్పొంగి ఒక పద్యం రాయడానికి సిద్ధమయ్యారు. ఒకటి వ్రాసి రెండవది వ్రాయడానికి సిద్ధపడుతుండగా బాబా దర్శనం కోసం వెళ్తూ ఉన్న దీక్షిత్ ఆగి అతని కవితను చూసారు. తరువాత భీష్మ స్నానం చేసి, సాయిమహరాజు దర్శనం కోసం మశీదుకు వెళ్ళారు.

బాబా అతన్ని చూసిన వెంటనే లడ్డూల కోసం అడిగారు. అతడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. కానీ దీక్షిత్ మాట్లాడుతూ, ”లడ్డూలు సిద్ధమవుతున్నాయి” అన్నారు. అది విని బాబా మౌనంగా ఉన్నారు. మరుసటి రోజుకి భీష్మ ఐదు పద్యాలు వ్రాసారు, కాని తర్వాత యెంత ప్రయత్నించినా ఐదు పద్యాలకు మించి వ్రాయలేకపోయారు.

వాటిని తీసుకుని వెళ్ళి బాబా చేతిలో పెట్టారు. బాబా వాటిని చూసి, వాటిని చదవమని అడిగారు. అతడు సరేనని చదవడం మొదలుపెట్టి, చదువుతూ ఉండగా బాబా అతని తల మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు.

“ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని వర్ణించేందుకు సాధ్యం కాదు” అని అతడు చెప్పారు. ఆ తర్వాత అతను తాను వ్రాసిన ప్రతి పద్యాన్ని చదివి బాబా పాదాల వద్ద సమర్పించుకున్నారు.

అలా బాబా పాదాల వద్ద సమర్పించబడిన ఆ పద్యాలు తరవాత ‘సాయినాథ సగుణోపాసన’ పుస్తకం అయింది. భీష్మ వ్రాసిన ఆ పద్యాలను దాదాసాహెబ్ ఖపర్డే 1922 వరకు తన స్వంత వ్యయంతో పుస్తక రూపంలో ప్రచురిస్తూ వచ్చారు. తరువాత 1923లో శ్రీ సాయిబాబా సంస్థాన్ స్థాపించబడిన తరువాత, భీష్మ సమ్మతితో మరికొన్ని స్వరకల్పనలతో కలిపి సవరించిన సంచికను ప్రచురించారు. ఆ పుస్తకం ద్వారా లభించే ఆదాయం ఆవుల రక్షణ కోసం ఇవ్వబడింది. ఈ పుస్తకం యొక్క కాపీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

భీష్మ గారు రచించిన ‘సాయినాథ సగుణోపాసన’ పుస్తకంలోని సాయిబాబా ఆరతుల గురించి మరికొంత సంచారం తరువాత తెలియజేస్తాను.

భీష్మ 1912 నుండి ఎక్కువగా సాయిబాబా సన్నిధిలో గడిపేవారు. ఆ రోజులలో, రామనవమి మరియు కృష్ణ జన్మాష్టమి సమయాలలో ఉరుసు ఉత్సవం నిర్వహిస్తుండేవారు. ఒకసారి రామనవమి పండుగను జరుపుకునే ఆలోచన భీష్మకి వచ్చింది. ఆ ఆలోచన గురించి బాబాతో చెప్పి ఆయన అనుమతి తీసుకోమని కాకాసాహెబ్ దీక్షిత్ తో చెప్పారు భీష్మ. కాని దీక్షిత్ అతనినే స్వయంగా బాబాతో మాట్లాడమని సలహా ఇచ్చారు.

ఆ సమయంలో సాయిబాబా చాలా కోపం ప్రదర్శించారు, అందుకే ఎవరూ ఆయనతో నేరుగా మాట్లాడలేకపోయారు. చివరికి, భీష్మ స్వయంగా బాబాను సంప్రదించి పండుగ గురించి మాట్లాడారు. బాబా పండుగ నిర్వహించటానికి వెంటనే అనుమతి ఇచ్చారు. పండుగ సందర్భంగా పూజ, భజన మరియు కీర్తనలను ఎవరు చేస్తారు అనే విషయాన్ని బాబా భీష్మను అడిగారు.

శిరిడీ నివాసితులు రాత్రంతా పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. ఉరుసు పండుగ మరియు రామనవమి పండుగను కలిపి 1912లో రెండు పండుగలను గొప్ప వేడుకగా ఉత్సాహంతో, వైభవంగా జరిపారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ వారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికీ వైభవంగా నిర్వహిస్తున్నారు.

అప్పుడు జరిగిన రామనవమి ఉత్సవంలో సాయి సమక్షంలో భీష్మ కీర్తన చేసాక అతడు గొప్ప కీర్తనకారుడుగా పేరు పొందారు. తరువాత వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మోహపా అనే గ్రామంలో నివసించారు.

రేపు తరువాయి బాగం….

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

(Source: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015)

http://www.saiamrithadhara.com/mahabhakthas/krishnashastri_jageshwar_bhishma.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “కృష్ణారావు జగేశ్వర్ భీష్మ నాల్గవ బాగం…

సాయినాథుని ప్రణతి

Super సాయి .చాలా బాగుంది మీ సెకరణ .భీష్మ అనుభవాలు అద్బుతం .ఇది చదువుతుంటే నాకు పాత జ్ఞపకాలు గుర్తోస్తునాయి .ఎంతో ఆనందిస్తునాం సాయి

Sai Suresh

thank you, thank you so much సాయి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles