కృష్ణారావు జగేశ్వర్ భీష్మ మూడవ భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కృష్ణారావు జగేశ్వర్ భీష్మ మూడవ భాగం…

మందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాయిబాబా యొక్క బ్రాహ్మణ భక్తులు కూడా ఆయన పాదతీర్థాన్ని తీసుకొనేవారు. కానీ, భీష్మ హిందూ-ముస్లిం భేదభావం వలన  బాబా పాదతీర్థాన్ని తీసుకొనేవారు కాదు. సాయిబాబా చిలుం పీల్చి, కొంతమంది భక్తులకు కూడా అందించేవారు, కానీ, ప్రారంభంలో భీష్మను మినహాయించేవారు. సాయి పొగపీల్చి అందించిన చిలుము గొట్టము, వారి పాదతీర్థము ఎందరో ఆచారవంతులైన బ్రాహ్మణులు కూడా తీసుకునేవారు. కాని ఇతని భావమెరిగిన సాయి ఇతనికి మాత్రం చిలుమునిచ్చేవారుకాదు.

బాబా వద్ద ఎప్పుడూ పాత చింకి గోనెగుడ్డ ఉండేది. దానినే బాబా ఎప్పుడూ ఆసనంగా ఉపయోగించేవారు. ఒకరోజు పాత గోనెను తొలగించి కొత్త గోనెను భర్తీ చేయమని భక్తులు భీష్మను కోరారు. కానీ అతను ఆరతికి అందరూ వచ్చేవరకు నిరీక్షించి, అప్పుడు బాబాని గోనెను మార్పు చేయడం గురించి సైగలతో అడిగారు. బాబా సరేనని సంకేతం ఇచ్చారు. అతను వెంటనే దాదాసాహెబుతో చెప్పి, ఒక క్రొత్త గోనెతో పాతదాన్ని భర్తీ చేసారు. ఆరతి తర్వాత బాబా నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఆయనను సేవించసాగారు.

ఒక భక్తుడు చిలుం సిద్ధం చేసి బాబాకు ఇచ్చాడు. సాయిబాబా ఒకసారి పీల్చిన తర్వాత భీష్మకు అందించి, చిలుం పీల్చమని చెప్పారు. భీష్మ ఒకసారి పీల్చి, దానిని సాయిబాబాకు తిరిగి ఇచ్చారు.

సాయిబాబా దానిని తీసుకుని, “నేను ప్రతిచోటా ఉన్నాను, బాంబే, పూణే, సతారా, నాగపూర్; అన్ని ప్రాంతాలు రామమయమే మిత్రమా” అన్నారు. తరువాత మళ్ళీ ఆయన హఠాత్తుగా భీష్మతో, “నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడూ ఒక్కడివే తింటావు. కనీసం ఇప్పుడైనా నాకు ఐదు లడ్డూలు ఇవ్వు” అని అన్నారు. అందుకు అతను అలాగేనని వాగ్దానం చేశారు.

సాయిబాబా యొక్క వ్యాఖ్యానం భీష్మ మీద వింత ప్రభావాన్ని చూపింది. తన కలలోని వైష్ణవ సాధువు మరియు సాయిబాబా మధ్య భేదభావం అదృశ్యమయ్యింది. వెంటనే అతను బాబా సేవకుల వద్ద నుండి సాయిబాబా పాదతీర్థాన్ని అడిగి తీసుకుని, మనసారా స్వీకరించి, సాయిబాబా పాదాల వద్ద తన శిరస్సునుంచారు.

అప్పడు రెండునిముషాల పాటు సాయిబాబా భీష్మ తలపై తమ అరచేతిని పెట్టారు. భీష్మ దివ్య పారవశ్యంలో మునిగిపోయారు. అప్పటి తన మనస్సు యొక్క స్థితిని ఎలా వివరించగలరు. దేవనాథ్ తన ప్రసిద్ధ కూర్పు “గురుకృపయ్క ఉహ్న్జున పాయ మేరా మై జానూ” లో చెప్పినట్లు “గురుకృప అందుకున్న ఆయనకు మాత్రమే తెలుసు ఆ అనుభూతి ఏమిటో”.

తర్వాత భీష్మ తన వసతికి వచ్చి, “నేను ఈ క్రొత్త ప్రదేశంలో ఎవరి సహాయం లేకుండా లడ్డులను ఎలా తయారు చేయగలను?” అని చింతలో పడ్డాడు. “నేను ఎవరి సహాయమైనా తీసుకుంటే బాబా వెంటనే తెలుసుకుంటారు. ఎందుకు ఆయన ఐదు లడ్డూలు అడిగారు? అదికూడా ప్రత్యేకంగా లడ్దూలే ఎందుకు అడిగారు?” అనే ఆలోచనతోనే అతను రోజంతా గడిపి, చివరికి అదే మనస్సులో ఆలోచిస్తూనే నిద్రపోయారు.

రేపు తరువాయి బాగం….

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

(Source: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015)

http://www.saiamrithadhara.com/mahabhakthas/krishnashastri_jageshwar_bhishma.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles