‘‘బావూ! నాకు అయిదు లడ్లు కావాలి. ఇస్తావా?’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

 

కోపర్‌గాం చేరుకుంది రైలు. ఇద్దరూ దిగారక్కడ. గబగబా ముందుకు నడిచారు. ద్వారకామాయికి చేరుకున్నారు.

బాబా లేరక్కడ.మరెక్కడ ఉన్నారు?చావడిలో ఉన్నారని చెప్పారెవరో. అటుగా నడిచారు. చావడిలో తనలో తాను మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న బాబా, ముందుగా ఖాపర్డేని పలకరించారు.‘‘బావూ! బాగున్నావా?’’ అడిగారు.

తర్వాత అతని పక్కగా ఉన్న భీష్మని చూశారు. నవ్వారు.‘‘జై సచ్చిదానంద’’ అన్నారు.ఒళ్ళంతా ఝల్లుమంది భీష్మకి.

రాత్రి తాను కన్న కల గుర్తొచ్చిందతనికి. కలలో తిరునామాలు ధరించిన సాధువు దర్శనం, అతను ‘జై సచ్చిదానంద’ అనడం, ఆశీర్వదించడం, మంత్రోపదేశం చేయడం అన్నీ బొమ్మ కట్టాయి.

శ్రీరామ దర్శనం అయింది అనుకున్నాడు తను. కాదు, సాయి దర్శనం అయింది. భావోద్వేగంతో కన్నీళ్ళు పొంగి పొర్లాయి. వణుకుతున్న చేతుల్రెంటినీ జోడించాడు భీష్మ. అలాగే వంగి, బాబా పాదాలను ఆశ్రయించాడు. అతన్ని లేవనెత్తారు బాబా. నుదుటన విబూది పెట్టారు.అడిగారు.

ఇస్తానన్నట్టుగా తలూపాడు భీష్మ.ఆ రాత్రి భీష్మకు నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడతను. బాబా కోరిన లడ్లు మిఠాయి కాదు.

భక్తి వైరాగ్యం కలగలిసిన అయిదు గీతాలనిపించింది.

కూర్చున్న చోటు నుంచి లేచి, వరండాలోకి నడిచాడతను.వసంత నవరాత్రుల రోజులవి. లెండి తోట నుంచి చల్లని గాలి వీస్తోంది. గాలిలో మామిడి పిందెల వాసన గిరికీలు కొడుతోంది.

వాతావరణం అంతా చల్లగా హాయిగా ఉంది. సూర్యోదయం అవుతోంది. చూశాడు దాన్ని. కళ్ళు మూసుకున్నాడు భీష్మ. గుండె గొంతుకలో కొట్లాడింది. మాత్రా ఛందస్సులో మనోహర గీతం రూపు దిద్దుకుంది.ప్రభాత సమయీ నభా శుభరవీ ప్రభా ఫాకలీస్మరే గురు పదా అశా సమయిత్యా ఛళే నా కలీ!హ్మణోని కరజోడు నీ కరు అతా గురు ప్రార్ధనాసమర్ధగురు సాయినాథ పురవీ మనోవాసనా…

ఒకటి తర్వాత ఒకటిగా అయిదు గీతాలు గుండె లోతుల్లోంచి వెలువడ్డాయి. బాబా కోరినవి అయిదు లడ్లే!

తను ఆరు లడ్లు ఇద్దామనుకున్నాడు భీష్మ. ఆరో గీతం కోసం ఆపసోపాలు పడ్డాడు. భావం రూపు కట్ట లేదు. పదాలంద లేదు.

అప్పుడు తెలుసుకున్నాడు, ఎంత చెట్టుకి అంత గాలేనని.తెల్లగా తెల్లారింది. పరుగు పరుగున చావిడికి చేరుకున్నాడు భీష్మ.

బాబా ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అనుమతిని అర్థించాడు. నవ్వి, బాబా తల పంకించగానే   భీష్మ గొంతు విచ్చుకుంది. రాత్రి తాను రచించిన అయిదు గీతాల్నీ భావయుక్తంగా, భక్తిగా ఆలపించాడు. ఆనందించారు బాబా.

‘‘బావూ! నీ అయిదు లడ్లూ బహు రుచిగా ఉన్నాయి.’’ మెచ్చుకున్నారు.‘‘ఇవే ఆరతి పాటలు. ఇక మీదట ప్రతి రోజూ ఈ పాటలు పాడిన తర్వాతే ఆరతి.’’ అన్నారు.

‘‘ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో అల్లాకు బాగా తెలుసు. నిన్ను ఎందుకు పిలిచానో ఇప్పుడు అర్థమయిందా?’’ అడిగారు బాబా. అర్థమయిందన్నట్టుగా చేతులు జోడించాడు భీష్మ.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles