‘‘నాకు మీరూ కావాలి. వారూ కావాలి. అంతా అందరూ నా వాళ్ళే’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 (సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

మరో రాత్రి వేళ మళ్ళీ బాబా కేకలు వినవస్తే అటుగా చూశాడు శ్యామా. ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి మండుతున్న గోళం ఏదో వేగంగా విసురుగా వచ్చి, ద్వారకా మాయిలోకి దూసుకుపోయింది.

క్షణం పాటు ద్వారకామాయిలో సూర్యుడు ఉదయించినట్టుగా వెలుగు నిండుకుంది. తర్వాత పెద్ద పేలుడు వినవచ్చింది. భయం వేసింది శ్యామాకి, దాగున్న చోటు నుంచి పరుగుదీశాడు. బడికి చేరుకుని, ముసుగుదన్ని పడుకున్నాడు.

తెల్లారింది. మెలకువ వచ్చింది శ్యామాకి. రాత్రి జరిగిన సంఘన గుర్తు వచ్చింది. ద్వారకామాయి ఉందా? బాబా ఉన్నారా అక్కడ? రాత్రి పేలుడికి బాబా బలి కాలేదు కదా? అనుకుంటూ పరుగుదీసి ద్వారకామాయికి చేరుకున్నాడు శ్యామా.

అంత పొద్దున వచ్చిన శ్యామాని చూసి నవ్వుతూ ఇలా అడిగారు బాబా.

‘‘రాత్రి బాగా భయపడినట్టున్నావు.’’‘‘అవును బాబా! పెద్ద శబ్దం అయ్యేసరికిపరిగెత్తాను.’’ ఒప్పుకున్నాడు శ్యామా.

‘‘ఎక్కడెక్కడి వాళ్ళో దర్శనానికి వస్తారు. కాదనలేను. అప్పటికీ వద్దంటాను, వినరు. కేకలేసినా పట్టించుకోరు. గ్రహాంతరవాసులు గోల గోలగా వస్తారు. గోము గోముగా ప్రార్థిస్తారు. 

ఆడతారు, పాడతారు. వాళ్ళతో పాటూ నేనూ…తప్పదు.’’ అన్నారు బాబా.‘‘వాళ్ళు మీకు కనిపించరు. మీరు వాళ్ళకి కనిపించరు. కనిపించేది నాకే’’ అన్నారు మళ్ళీ.

 అన్నారు బాబా.

బాబాని దర్శించుకునేందుకు గ్రహాంతర వాసులు వస్తారని విన్నాడు శ్యామా. అది నిజమేనన్నమాట. మనం వాళ్ళని చూడలేం. వాళ్ళు మనల్ని చూడలేరు. కాని చూడగలగాలి. ఆ అదృష్టానికి నోచుకోవాలి.

బాబాయే దిక్కు! లోకాలు ఏలే మహారాజు. మనసు పెట్టి అడిగితే మనిషిని కాదంటాడా? అనుకున్నాడు శ్యామా. అడిగాడిలా.

‘‘బాబా నాదో కోరిక’’‘‘అడుగు! అందుకు అర్హుడివయితే తప్పకుండా తీరుస్తాను.’’ అన్నారు బాబా.

‘‘పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ వినవచ్చే ముల్లోకాలనూ చూడాలని ఉంది బాబా! చూపించవా’’ అడిగాడు శ్యామా.

జవాబుగా నవ్వారు బాబా.‘‘కాదనకు బాబా! కరుణించు.’’ అన్నాడు శ్యామా. పదే పదే వేడుకున్నాడు. ‘సరే’నన్నట్టుగా తలూపారు బాబా.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles