ఎవరూ తమంతట తాముగా షిరిడీకి రాలేరు. ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

పగలు రాత్రి అని లేదు, వందలాది మంది భక్తులు ద్వారకామాయి చేరుకుంటున్నారు. బాబాని దర్శించి వెళ్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుణ్ణీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు బాబా.

వారితో తరతరాలుగా పరిచయం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్రసాదంగా ఊదీ పెట్టి, స్వీకరించమంటున్నారు.

షిరిడిలో బాబా కొలువుదీరినట్టుగా ఇంత మందికి ఎలా తెలుస్తోంది? అంతంత దూరాల నుంచి వారంతా ఎలా రాగలుగుతున్నారు? శ్యామాకి అంతు చిక్కని విషయాలివి.

సమాధానాల కోసం వారినీ వీరినీ అడిగి చూశాడు. ఏవేవో సమాధానాలు దొరికాయి. అయితే అవేవీ సరయిన సమాధానాలు కాదనిపించాయి.

సరయిన సమాధానం బాబా ఒక్కరే ఇవ్వగలరనిపించింది. వారినే అడుగుదామనుకున్నాడు శ్యామా. అడిగేశాడు ఆఖరికి.

‘‘నేనిక్కడ ఉన్నట్టుగా ఎలా తెలుస్తుందంటే…ఎవరికి వారు, వారి మనసులోకి తొంగి చూస్తే తెలుస్తుంది.

ఎలా రాగలుగుతున్నారంటే… ఎవరూ తమంతట తాముగా షిరిడీకి రాలేరు. ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి. నేను అనుమతిస్తేనే రాగలుగుతారు.

నన్ను దర్శించుకోవాలనే వ్యక్తిని, నా భక్తుణ్ణి ఎంత దూరంలో ఉన్నా ‘పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు’గా నేను లాగుతాను. ఇక్కడికి వచ్చే వరకు వదిలిపెట్టను వాళ్ళని.’’ అన్నారు బాబా.

ఆ సమాధానానికి ఆనందించాడు శ్యామా. అంతలో అక్కడికి నానాతో పాటుగా వచ్చి ఓ వ్యక్తి నిల్చున్నాడు.

అయిష్టంగా ఉన్నాడతను. ఇబ్బందిగా ఉన్నాడు. బాబాని చూస్తూనే నమస్కరించాడు నానా. పక్కనున్న వ్యక్తిని కూడా నమస్కరించమన్నట్టుగా చూశాడు. అతను అది పట్టించుకోలేదు. బాబాకి నమస్కరించలేదు.

బాబాని పరిశీలనగా చూడసాగాడు. అతనలా బాబాని చూస్తోంటే అతన్ని శ్యామా పరిశీలనగా చూడసాగాడు. నానా అంటే బాబాకి ఆప్తుడు. ఈ కొత్త వ్యక్తి ఎవరు? ఎందుకు ఏదోలా ఉన్నాడు? ఆలోచించసాగాడు శ్యామా.

‘‘పేరుకి తగినట్టుగానే కొందరు సహస్రబుద్ధులతో ఆలోచిస్తారు. ఎవర్నీ దేనినీ నమ్మరు.’’ అన్నారు బాబా. ఈ మాటల్ని నానా పక్కనున్న కొత్త వ్యక్తిని కడగంట చూస్తూ అన్నారు.

తన పేరు గణపతి దత్తాత్రేయ సహస్రబుద్ధి. ‘సహస్రబుద్ధి’ అని పిలుస్తారంతా. ఆ పేరు బాబాకి ఎలా తెలిసింది? నానాతో పాటుగా ద్వారకామాయికి రావడం ఇదే ప్రథమం. చిత్రంగా ఉందే! అనుకున్నాడు సహస్రబుద్ధి.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles