Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
‘‘ఏంటక్కడ నిలబడిపోయారు? లోపలికి రండి.’’శ్యామా పిలుపుతో లోపలికి ప్రవేశించాడు ఆయు.
భయం భయంగానే తల ఎత్తి బాబాని చూశాడతను. బాబా నవ్వుతూ సజీవంగా కనిపించారు. బాబా చనిపోలేదు. బాబాని ఎవరూ చంపలేదు. బాబా బతికే ఉన్నారు. మరి, తాను పొద్దున చూసింది?
అంతుచిక్కలేదతనికి. శ్యామాని పక్కకి పిలిచాడతను.‘‘ఏంటండీ’’ అడిగాడు శ్యామా.
తాను పొద్దున ద్వారకామాయిలో చూసిందంతా వివరంగా చెప్పాడు ఆయు.‘‘నిజవండీ! ఒట్టు’’ అన్నాడు.
పొద్దున పొద్దునే బాబా ఖండ ఖండాలుగా పడి ఉన్నాడా? ఎవరో ఖండించినట్టుగా బాబా అవ యవాలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయా? బాబాని హత్య చేశారా? హత్యకు గురయిన బాబా ఇప్పుడిలా సజీవంగా ఎలా కనిపించగలుగుతున్నాడు?-అనేక అనుమానాలతో బాబాని చూశాడు శ్యామా. అతన్ని.
అతని అనుమానాల్ని చదివినట్టుగా నవ్వుతూ చూశారు బాబా. ఇలా అన్నారతనితో.
‘‘ఖండయోగాన్ని సాధన చేస్తే శరీర అవ యవాలన్నీ ఖండఖండాలుగా పడి ఉంటాయి. అందులో భయపడాల్సింది ఏమీ లేదు. నన్ను ఎవరూ చంపలేదు. నేను చనిపోలేదు.’’
‘‘బాబా’’ అని చేతులు జోడించాడు ఆయు.
అతని అనుమానాలు, భయాలు పటాపంచలయ్యాయి. శ్యామాకు కూడా జవాబు దొరికింది. ఊపిరి పీల్చుకున్నాడతను.
ద్వారకామాయి సమీపంలో పూలతోటను పెంచసాగారు బాబా. దానిని ‘లెండీ బాగ్’ అని వ్యవహరించేవారు.
మొక్కలన్నా, పువ్వులన్నా బాబాకి చాలా ఇష్టం. మొక్కల్ని నాటడం, వాటికి నీరు పొయ్యడం బాబా స్వయంగా నిర్వహించేవారు.
షిరిడీ పొలిమేరల్లో మర్రిచెట్టు కింద ఉన్న బావి దగ్గర నుంచి రెండు కుండలతో నీరు తెచ్చేవారాయన. ఈ రెండు కుండలూ పచ్చివి కావడాన్ని విశేషంగా చెప్పుకునేవారంతా.
అడగగానే కుమ్మరి ఒకడు, అప్పటికప్పుడు రెండు కుండలు తయారు చేసి బాబాకి ఇచ్చేవాడు. పచ్చి కుండలే కావాలనేవారు బాబా. కాల్చిన కుండలు వద్దనే వారు.
ఆ పచ్చికుండలతోనే బాబా నీరు మోసుకుని వచ్చేవారు. మొక్కలకి నీరు పోసేంత వరకు కుండలు బాగానే ఉండేవి. పని కాగానే విచ్చిపోయేవి. అదంతా చిత్రమనిపించేంది కుమ్మరికి.
తోటలో మొక్కలకి నీరు పోస్తున్నారు బాబా. కుదుళ్ళను సరి జేస్తున్నాడు శ్యామా.‘‘జాగ్రత్త జాగ్రత్త’’ అని హెచ్చరిస్తున్నారు బాబా.
అప్పుడక్కడికి వచ్చారు బడేబాబా. అతనిది మాలేగాం. షిరిడీకి సమీపంలోనే ఆ గ్రామం ఉంది. బడేబాబా అంటే అక్కడి వారందరికీ చాలా గౌరవమూ, భక్తీ.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఎవరూ తమంతట తాముగా షిరిడీకి రాలేరు. ఇక్కడికి రావాలంటే నా అనుమతి కావాలి.
- ‘‘నమ్మవద్దు! నన్ను నమ్మమని నీకు చెప్పానా?’’ గట్టిగా అరిచారు బాబా.
- ‘‘ఇక మీదట నేను మాట్లాడను. నా సమాధి మాట్లాడుతుంది.’’
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
- ‘నీకు ఏం కావాలో నేను అదే! నీకు అక్కరలేనిది కూడా నేనే!’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments