Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ద్వారకామాయిలో రాళ్ళు నలుగుతున్న శబ్దం వినరావడంతో ‘ఏమయి ఉంటుంది?’ అని అక్కడకి ఆందోళనగా చేరాడు శ్యామా. కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
తిరగలిలో గోధుమలు వేసి, వేగంగా తిప్పుతున్నారు బాబా. బలాన్నంతా వినియోగిస్తున్నారు.
తనలాగే ఆశ్చర్యపోతూ నిల్చున్న షిండేని సమీపించాడు శ్యామా.‘‘ఏమిటిదంతా?’’ గుసగుసగా అడిగాడు.‘‘తెలీదు. బజారుకి వెళ్ళి, గోధుమలు, తిరగలి తీసుకు రమ్మన్నారు. తెచ్చాను. అంతే!’’ అన్నాడు షిండే. గుసగుసగానే చెప్పాడు.
చెమటలు కారిపోతున్నాయి. అలసిపోతున్నారు బాబా. అయినా విసరడం మానడం లేదు.
అయిదు ఇళ్ళు బిచ్చం ఎత్తుకుని, కడుపు నింపుకునే బాబాకి ఈ కష్టం అంతా ఎందుకు? రేపటి నుంచి బిచ్చం ఎత్తుకోడా?
తల్లిదండ్రులు లేరు, భార్యాబిడ్డలు లేరు. ఒక్కడు! ఈ ఒక్కడికీ ఇంత తాపత్రయం ఎందుకు? ఇంత పిండిని ఏం చేసుకుంటాడు?
కబుర్లకేం కొదవలేదు. తప్పనీ ఒప్పనీ ఉపదేశాలిస్తాడు. తిండిదగ్గరకొచ్చేసరికి తీరిగ్గా తిరగలి విసురుకుంటున్నాడు. ఈ బాబాల్ని నమ్మలేం అనుకున్నాడు శ్యామా.
‘‘నమ్మవద్దు! నన్ను నమ్మమని నీకు చెప్పానా?’’ గట్టిగా అరిచారు బాబా. తుళ్ళిపడ్డాడు శ్యామా.‘‘నాకు తల్లిదండ్రులు లేరు. భార్యాబిడ్డలు లేరు. అయినా ఈ గోధుమ పిండి విసురుతూ ఇంతతాపత్రయం దేనికంటావా? మీ కోసం. చాలా?’’ అరిచినట్టుగానే మాట్లాడారు బాబా.
‘‘క్షమించు బాబా’’ చేతులు జోడించాడు శ్యామా.అంతలో నలుగురు స్త్రీలు వచ్చారక్కడకి . బాబాని దర్శించి, ప్రసాదాలు అర్పించేందుకు వచ్చారు.
బాబా తిరగలి విసరడం చూసి విస్తుపోయారు.‘‘మీకెందుకు బాబా శ్రమ. లేవండి, మేము విసిరిపెడతాం.’’ అన్నారు స్త్రీలు.
‘‘వద్దు, నా పని నేను చేసుకుంటాను.’’ అన్నారు బాబా.‘‘మీ పని మా పని కాదా?’’ అడిగారు. బలవంతాన బాబాని పక్కన కూర్చోబెట్టి, వాళ్ళు పిండి విసరసాగారు.
ఒకరు గోధుమలు పోస్తుంటే, ఒకరు విసురుతూ, అలుపు మరిచిపోయేందుకు పాటలు పాడారు. భక్తిపాటలు, బాగున్నాయి.
కళ్ళు మూసుకుని పాటల్ని వింటూ బాబా ఆనందించారు. బస్తాలో గోధుమలు అయిపోయాయి. పిండి తిరగలి చుట్టూ అంతెత్తున మేట వేసింది.
తిరగలిని పక్కకి లాగి, పిండిని నలుగురు స్త్రీలూ నాలుగు వాటాలు వేసుకున్నారు.బాబాకి రొట్టెలు చేసుకోవడం చాతనవునా, పాడా! నలుగురం నాలుగింతలు పిండిని తీసుకు వెళ్ళి, రొట్టెలు చేసి పెడదాం అనుకున్నారు వాళ్ళు.
పిండిని కొంగులో మూటగట్టుకోసాగారు. కళ్ళు తెరిచారు బాబా. పిండిని మూటగట్టుకుంటున్న స్త్రీలను చూశారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘తెలియక చేసిన పాపాలన్నీ తిరగలి తిప్పి, పోగొట్టుకున్నారు.
- అధ్యాయము 1
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మొదటి అధ్యాయము🌹….Audio
- ‘నీకు ఏం కావాలో నేను అదే! నీకు అక్కరలేనిది కూడా నేనే!’’
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “‘‘నమ్మవద్దు! నన్ను నమ్మమని నీకు చెప్పానా?’’ గట్టిగా అరిచారు బాబా.”
kishore Babu
January 11, 2017 at 5:56 amSai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/videos/view/Sai-Baba-Naamam-7